Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్యే రాజాసింగ్ పై దాడి కేసులో ట్విస్ట్: వీడియో విడుదల

తనను తాను రాయితో గాయపరుచుకున్న రాజాసింగ్ తామే దాడికి పాల్పడినట్టు డ్రామాకు తెరదీశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఆయన రాయితో కొట్టుకోవడానికి సంబంధించిన విజువల్స్ కూడా వెలుగులోకి వచ్చాయి.

Twist in attack on BJP MLA Raja singh
Author
Hyderabad, First Published Jun 20, 2019, 11:51 AM IST

హైదరాబాద్‌: హైదరాబాదులోని జుమేరాత్ బజార్ లో బిజెపి శాసనసభ్యుడు రాజా సింగ్ పై పోలీసులు దాడి చేశారనే ఉదంతంలో ఆశ్చర్యకమైన విషయం వెలుగు చూసింది. రాజాసింగ్ తనను తానే గాయపరుచుకుని తమపై ఆరోపణలు చేస్తున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేశారు. 
 
జుమ్మెరాత్‌ బజార్‌లో అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త వాతారణం చోటు చేసుకుంది. స్థానికులతో కలిసి రాణి అవంతిభాయ్‌ విగ్రహ నిర్మాణానికి  రాజాసింగ్ యత్నించడంతో వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. విగ్రహ ఏర్పాటును పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ చోటు చేసుకుంది.  ఎమ్మెల్యే రాజాసింగ్ తన మద్దతుదారులతో కలిసి ఆందోళనకు దిగడంతో పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. 

ఆ క్రమంలోే రాజాసింగ్‌ తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. ఆయనను హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తనను తాను రాయితో గాయపరుచుకున్న రాజాసింగ్ తామే దాడికి పాల్పడినట్టు డ్రామాకు తెరదీశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఆయన రాయితో కొట్టుకోవడానికి సంబంధించిన విజువల్స్ కూడా వెలుగులోకి వచ్చాయి.

రాజాసింగ్‌పై పోలీసుల దాడి ఘటనను ట్విట్టర్ వేదికగా బీజేపీ నేత లక్ష్మణ్ కూడా ఖండించారు. ఓ ప్రజాప్రతినిధిని రక్తం వచ్చేలా కొట్టడం దారుణమని ఆయన అన్నారు. తెలంగాణలో ప్రజాపాలన ఉందా, రజాకార్ల పాలన కొనసాగుతోందా అని లక్ష్మణ్ ప్రభుత్వాన్ని నిలదీశారు.

Follow Us:
Download App:
  • android
  • ios