Asianet News TeluguAsianet News Telugu

టీడీపీలో ముసలం: మరో ఆగష్టు సంక్షోభం?

 టీడీపీలో మరో ఆగష్టు సంక్షోభం రానుందా...  ఏపీతో పాటు ఢిల్లీలో చోటు చేసుకొన్న పరిణామాలు ఆ పార్టీలో గందరగోళానికి కారణమైంది. టీడీపీ ఆవిర్భావం నుండి  ఇప్పటికే రెండు దఫాలు ఆగష్టు సంక్షోభాలు చోటు చేసుకొన్నాయి. ఈ దఫా ఆగష్టు కంటే ముందుగానే టీడీపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

tdp kapu leaders meeting:is it repeat august crisis in tdp
Author
Amaravathi, First Published Jun 20, 2019, 3:20 PM IST

హైదరాబాద్: టీడీపీలో మరో ఆగష్టు సంక్షోభం రానుందా...  ఏపీతో పాటు ఢిల్లీలో చోటు చేసుకొన్న పరిణామాలు ఆ పార్టీలో గందరగోళానికి కారణమైంది. టీడీపీ ఆవిర్భావం నుండి  ఇప్పటికే రెండు దఫాలు ఆగష్టు సంక్షోభాలు చోటు చేసుకొన్నాయి. ఈ దఫా ఆగష్టు కంటే ముందుగానే టీడీపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

1982 మార్చి 29వ తేదీన హైద్రాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో టీడీపీ ఆవిర్భవించింది. పార్టని ఏర్పాటు చేసిన 9 మాసాల్లోనే టీడీపీ అధికారంలోకి వచ్చింది.  ఎన్టీఆర్ ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రిగా కొంతకాలం పనిచేసిన తర్వాత గుండె ఆపరేషన్ కోసం ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లారు. 

ఆ సమయంలో  ఎన్టీఆర్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న నాదెండ్ల భాస్కర్ రావు నేతృత్వంలో తిరుగుబాటు చోటు చేసుకొంది. ఎన్టీఆర్ ను గద్దె దింపి నాదెండ్ల భాస్కర్ రావు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.  

అయితే ఈ సమయంలో ఎన్టీఆర్‌కు  బీజేపీ, లెఫ్ట్ పార్టీలు అండగా నిలిచాయి. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం పెద్ద ఎత్తున జరిగింది.సుమారు నెల రోజుల పాటు సీఎంగా ఉన్న నాదెండ్ల భాస్కర్ రావు పదవి నుండి తప్పుకొన్నారు. తిరిగి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కారు. 

ముఖ్యమంత్రి పదవి నుండి ఎన్టీఆర్ దిగిపోయిన మాసం ఆగష్టు. దీంతో టీడీపీలో తొలిసారి ఆగష్టు సంక్షోభానికి నాంది పడింది. ఆ తర్వాత 1985లో ఎన్టీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాడు. ఈ సమయంలో కూడ ప్రజలు మరోసారి ఎన్టీఆర్‌కు అధికారాన్ని కట్టబెట్టారు.

1989లో ఎన్టీఆర్ నేతృత్వంలోని టీడీపీ అధికారాన్ని కోల్పోయింది. 1994 ఎన్నికల్లో  ఎన్టీఆర్ నేతృత్వంలో టీడీపీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. ఈ సమయంలో  ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో మితీమీరిన జోక్యం పెరిగిందని ప్రచారం సాగింది. ఈ ప్రచారాన్ని లక్ష్మీపార్వతి వర్గం మాత్రం అప్పట్లో ఖండించింది.

లక్ష్మీపార్వతి పెత్తనాన్ని సహించలేక చంద్రబాబు నేతృత్వంలో నేతలు తిరుగుబాటు చేశారు. 1995లో  ఆగష్టు మాసంలో ఈ పరిణామాలు చోటు చేసుకొన్నాయి.చంద్రబాబు నేతృత్వంలో ఎమ్మెల్యేలు వైస్రాయి హోటల్ లో సమావేశమయ్యారు. బాబు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 1995 సెప్టెంబర్ 1వ తేదీన చంద్రబాబునాయుడు ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి తొలిసారిగా బాధ్యతలు చేపట్టారు.

ప్రస్తుతం ఏపీలో చోటు చేసుకొన్న పరిణామాలు మాత్రం టీడీపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.  కాకినాడ వేదికగా  కాపు సామాజిక వర్గానికి చెందిన 14 మంది మాజీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. అదే సమయంలో  రాజ్యసభలో నలుగురు ఎంపీలు బీజేపీకి అనుబంధ సభ్యులుగా గుర్తించాలని రాజ్యసభ ఛైర్మెన్‌కు లేఖ ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నారని ప్రచారం సాగుతోంది.

ఈ పరిణామాలు మాత్రం టీడీపీలో మరో ఆగష్టు సంక్షోభానికి కేంద్రంగా మారనున్నాయా అనే చర్చ సాగుతోంది. అయితే విదేశాల్లో ఉన్న చంద్రబాబునాయుడు ఈ పరిణామాలపై పార్టీకి చెందిన కొందరు నేతలు సమాచారం ఇచ్చినట్టుగా సమాచారం.

టీడీపీకి చెందిన నేతలపై బీజేపీ కన్నేసింది. బీజేపీ నేతలు వ్యూహత్మకంగా  టీడీపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. బీజేపీ అగ్రనేతలు రామ్ మాధవ్, మురళీధర్ రావులు ఏపీకి చెందిన టీడీపీ నేతలతో సంప్రదింపులు జరిపినట్టుగా ప్రచారం సాగుతోంది. కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు, ఎంపీలు బీజేపీలో చేరితే టీడీపీపై ఆ ప్రభావం తీవ్రంగా పడే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బీజేపీలో రాజ్యసభ ఎంపీల చేరిక చంద్రబాబుకు ముందే తెలుసు

టీడీపీతోనే ఉంటా: రాజకీయాల్లో విలువలు లేవు, సుజనాపై ప్రత్తిపాటి ఫైర్

మేం వేరు: వెంకయ్యకు టీడీపీ రాజ్యసభ ఎంపీల లేఖ

టీడీపీ ఖాళీయే: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు

బీజేపీలోకి టీడీపీ ఎంపీలు.. మేం ఎవరిని ఆకర్షించలేదు: జీవీఎల్

ఏపీ టీడీపీలో ముసలం: ఎంపీల వ్యవహారం తెలియదన్న కళా వెంకట్రావ్

టీడీపీపై నమ్మకం పోయింది.. పురందేశ్వరి

సంక్షోభం కొత్త కాదు: సీనియర్ నేతలకు బాబు ఫోన్

ఆ నలుగురి బాటలోనే కేశినేని..?

స్పీకర్‌‌ను కలిసిన టీడీపీ లోక్‌సభ ఎంపీలు: మతలబు?

మేము ఏ పార్టీలోకి వెళ్లడం లేదు: తోట త్రిమూర్తులు

టీడీపీలో ముసలం: మరో ఆగష్టు సంక్షోభం?

టీడీపీ కాపు నేతల రహస్య భేటీ: చక్రం తిప్పిన రామ్ మాధవ్

చంద్రబాబు వచ్చేలోగా టీడీపి ఖాళీ: వెనక సుజనా చౌదరి?

చంద్రబాబుకు షాక్: రాజ్యసభలో టీడీపికి మిగిలింది ఇద్దరే, నలుగురు జంప్

తోట త్రిమూర్తులుతో టీడీపీ నేతల భేటీ: బిజెపిలో గంపగుత్తగా చేరిక?

చంద్రబాబు వచ్చేలోపు ముఖచిత్రం మారిపోతుంది: బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి

రాజకీయాలకు జేసీ దివాకర్ రెడ్డి గుడ్ బై: జేసీ ప్రభాకర్ రెడ్డి క్లారిటీ ఇదే....

Follow Us:
Download App:
  • android
  • ios