టీం ఇండియా క్రేజీ క్రికెటర్ ట్విట్టర్ లో షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట ఓ చర్చకు దారి తీసింది. ఓ మహిళ బుజం మీద చెయ్యి వేసి నడుస్తుండగా.. వెనక నుంచి తీసిన ఫోటోని బుమ్రా షేర్ చేశాడు. అయితే... ఆ ఫోటోలో ఉన్నది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అనే వాదనలు వినపడుతున్నాయి.

ఇంతకీ మ్యాటరేంటంటే..  గత కొద్ది రోజుల క్రితం హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, క్రికెటర్ బుమ్రా మధ్య ఏదో నడుస్తోందంటూ వార్తలు వచ్చాయి. అందుకు కారణం సోషల్ మీడియాలో ఇద్దరూ ఒకరినొకరు ఫాలో అవ్వడమే కారణం. అంతేకాకుండా బుమ్రా ఫాలో అవుతున్న ఒకైక నటి అనుపమ అవ్వడంతో ఈ వార్తలకు బలాన్ని చేకూర్చాయి. అయితే... దీనిపై ఇప్పటికే అనుపమ క్లారిటీ ఇచ్చింది. మా ఇద్ధరి మధ్య మంచి స్నేహం తప్ప ఇంకేమీ లేదని చెప్పేసింది. అయితే... తాజాగా బుమ్రా ఓ ఫోటో షేర్ చేయగా.. అందులో ఉన్నది అనుపమ నే అని చాలా మంది భావిస్తున్నారు.

ఇండోపాకిస్తాన్ మ్యాచ్ తరువాత ఒక అమ్మాయి భుజం పై చేయివేసి బూమ్రా తన హోటల్ కారిడార్ లో నడుస్తున్న ఫోటోను షేర్ చేసాడు. 
‘నా జీవితంలో ఎలాంటి పరిస్థుతులలో అయినా తన భుజాన్ని నాకు ఆసరాగా ఇచ్చి ప్రోత్సహిస్తుంది. నాకు నచ్చిన వ్యక్తి గురించి ఎవరు ఎన్ని అనుకున్నా నేను పట్టించుకొను’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. దీంతో అందరూ అనుపమ అంటూ కింద కామెంట్స్ చేస్తున్నారు. 

మరికొందరైతే ఆఫోటోలో ఉన్నది బూమ్రా తల్లి అనీ దేశానికి కొడుకుగా మారిన కుమారుడుకి  కన్నతల్లి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఆ ఫోటోలో ఉన్నది ఎవరు అన్నదానిపై బుమ్రా కానీ అనుపమ కానీ స్పందిస్తారేమో చూడాలి.