టీం ఇండియా జెర్సీ మారనుంది. ఇప్పటి వరకు టీం ఇండియా అంటే.. కేవలం బ్లూ కలర్ జెర్సీలో మాత్రమే కనపడేది. తొలిసారిగా ఆరెంజ్ కలర్ జెర్సీలో బరిలోకి దిగనుంది. ఇక నుంచి ఆరెంజ్ జెర్సీని మాత్రమే కంటిన్యూ చేస్తుంది అనుకుంటే పొరపాటే. కేవలం ఇంగ్లండ్ తో జరగబోయే మ్యాచ్ లో మాత్రమే టీం ఇండియా తన జెర్సీ రంగు మార్చుకుంది. ఇందుకు కారణం లేకపోలేదు.

ప్రపంచకప్ లో భాగంగా టీం ఇండియా తర్వాతి మ్యాచ్ ఆదిత్య జట్టు ఇంగ్లాండ్ తో పోటీ పడనుంది. కాగా...ఈ రెండు జట్ల జెర్సీ రంగు బ్లూ. ఈ రెండు జట్లు ఒకే రంగు జెర్సీతో తలపడితే... ఎవరు ఆడుతున్నారు..? ఎవరు చేం చేస్తున్నారన్న విషయంలో అభిమానులు తికమకపడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో.. టీం ఇండియా తన జెర్సీ మార్చుకుంటోంది. ఇంగ్లాండ్ ఆదిత్య జట్టు కావడంతో.. ఆ జట్టుకి మాత్రం తన జెర్సీనే కంటిన్యూ చేసే అవకాశం ఉంది.

‘ఐసీసీ ఈవెంట్స్‌లో పాల్గొనే జట్లన్నీ విభిన్న రంగులున్న రెండు జెర్సీలను కలిగి ఉండాలి. ఈ విషయంలో ఆతిథ్య జట్టుకు మినహాయింపు ఉంది. ప్రత్యామ్నయ రంగు ఎంపికలో జట్లదే పూర్తి స్వేచ్చ. కానీ ఒకే రంగు టోర్నీ మొత్తం కొనసాగించాలి. ఒకే రంగు జెర్సీ కలిగిన జట్లు తలపడినప్పడు మాత్రం ప్రత్యామ్నాయ జెర్సీని ఎంచుకోవాలి. ఈ విషయం ముందే తెలియజేయాలి’ అని ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది.