అక్కినేని వారి కోడలు సమంత చెప్పినట్టుగానే సరికొత్త చిత్రాలతో దర్శనమిస్తోంది. ఓ బేబీ సినిమాతో సమంత మరో సాలిడ్ హిట్ కొట్టేలా కనిపిస్తోంది. 70 ఏళ్ల బామ్మ వయసు నుంచి 24 ఏళ్ల పడుచు పిల్లలా కనిపించే స్టోరీ లైన్ తో రాబోతున్న ఈ  చిత్రం యొక్క ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 

కామెడీ అండ్ ఎమోషనల్ యాంగిల్ లో ఉన్న సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెంచేలా ఉంది. సడన్ గా యుక్త వయసులోకి వచ్చే సమంత ఏ విధమైన అనుభవాలను ఎదుర్కొన్నారు అనే సీన్స్ ఆసక్తిగా ఉన్నాయి. నాగ శౌర్య కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ - రావ్ రమేష్ కీలక పాత్రలో నటించారు. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సురేష్ బాబు నిర్మించారు. జులై 5న ఓ బేబీ ప్రేక్షకుల ముందుకు రానుంది.