Asianet News TeluguAsianet News Telugu

శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడుకు కీలకపదవి : టీడీపీ అధ్యక్షుడిగా ఛాన్స్

ఈ పరిణామాల నేపథ్యంలో రామ్మోహన్ నాయుడును రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలతో పరిచయాలు ఉన్న నేపథ్యంలో ఎలాంటి అసమ్మతి కూడా ఉండదని టీడీపీ అధిష్టానం అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. 

srikakulam mp rammohan naidu may be ap tdp president
Author
Amaravathi, First Published Jun 20, 2019, 10:07 AM IST

అమరావతి: ఎన్నికల్లో ఓటమి అనంతరం తెలుగుదేశం పార్టీ ప్రక్షాళనపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఏపీలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు వ్యూహరచన చేస్తోంది. ప్రజల్లో టీడీపీ తరపున బలమైన వాయిస్ కోసం అన్వేషిస్తున్న టీడీపీ యువకుడుని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

అందులో భాగంగా టీడీపీకి వీరవిధేయుడు అయిన శ్రీకాకుళం ఎంపీ కె.రామ్మెహన్ నాయుడును టీడీపీ అధ్యక్షుడిగా నియమించాలని టీడీపీ అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో యువనాయకుల్లో అగ్రస్థానంలో ఉన్నారు ఎంపీ రామ్మెహన్ నాయుడు. 

స్వతహాగా మంచి వాగ్ధాటి అయిన రామ్మోహన్ నాయుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు. అంతేకాదు తెలుగుదేశం పార్టీలో ఆయన కుటుంబానిది ప్రత్యేక స్థానం. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో రామ్మోహన్ నాయుడు ఎంపీగా, ఆయన బాబాయ్ అచ్చెన్నాయుడు టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా, సోదరి ఆదిరెడ్డి భవానీ ఎమ్మెల్యేగా ఉన్నారు. 

అంతేకాదు తెలుగుదేశం పార్టీకి వీర విధేయులుగా కింజరపు ఫ్యామిలీకి గుర్తింపు ఉంది. గతంలో రామ్మోహన్ నాయుడు తండ్రి ఎర్రన్నాయుడు తెలుగుదేశం పార్టీకి కీలక సేవలందించారు. తెలుగుదేశం పార్టీలో రెండో స్థానం ఆయనదే.  

అటు రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కీలక పదవులలో పనిచేసిన ఎర్రన్నాయుడు అకాల మరణం చెందారు. ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీకి కంచుకోట అనడానికి ఎర్రన్నాయుడే కారణమని ఇప్పటికీ చంద్రబాబు అంటూనే ఉంటారు. 

ఈ పరిణామాల నేపథ్యంలో రామ్మోహన్ నాయుడును రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలతో పరిచయాలు ఉన్న నేపథ్యంలో ఎలాంటి అసమ్మతి కూడా ఉండదని టీడీపీ అధిష్టానం అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బీసీ సామాజిక వర్గానికి చెందిన రామ్మోహన్ నాయుడుకు పదవి ఇస్తే బీసీలకు గుర్తింపు ఇచ్చినట్లు ఉంటుందని పార్టీలో కొత్త ప్రతిపాదన వస్తోందన్నారు.

ఇప్పటి వరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న కిమిడి కళా వెంకట్రావును తప్పించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుంచి పోటీచేసి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గొర్లె కిరణ్ కుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు. 

ఓడిపోయిన కళా వెంకట్రావునే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగించడం అంత భావ్యం కాదని పార్టీలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ ప్రక్షాళన దిశగా అధిష్టానం పావులు కదుపుతోందని తెలుస్తోంది. యూరప్ ట్రిప్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాలకు నూతన అధ్యక్షులను నియమిస్తారంటూ ప్రచారం జరుగుతోంది.  

ఒకవేళ రామ్మోహన్ నాయుడుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పదవి ఇస్తే శ్రీకాకుళం జిల్లా నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికవుతున్న రెండో వ్యక్తిగా రికార్డు సృష్టించబోతున్నారు. తొలి అధ్యక్షుడిగా కిమిడి కళా వెంకట్రావు బాధ్యతలు చేపట్టగా ఆ తర్వాత కూడా శ్రీకాకుళం జిల్లాకు చెందిన రామ్మోహన్ నాయుడే కావడం విశేషం.

Follow Us:
Download App:
  • android
  • ios