MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Andhra Pradesh
  • PM Kisan : మీ అకౌంట్లో పీఎం కిసాన్ డబ్బులు పడలేవా..? అయితే వెంటనే ఈ పని చేయండి

PM Kisan : మీ అకౌంట్లో పీఎం కిసాన్ డబ్బులు పడలేవా..? అయితే వెంటనే ఈ పని చేయండి

PM Kisan Samman Nidhi : కేంద్ర ప్రభుత్వం చిన్న సన్నకారు రైతులకు పీఎం కిసాన్ పేరిట పెట్టుబడి సాయం అందిస్తోంది.. ఇందుకు సంబంధించిన 22వ విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు. మీ అకౌంట్లో ఈ డబ్బులు పడకుంటే ఏం చేయాలో తెలుసా?

2 Min read
Author : Arun Kumar P
Published : Mar 13 2026, 07:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రైతుల అకౌంట్ లో డబ్బులే డబ్బులు..
Image Credit : Getty

రైతుల అకౌంట్ లో డబ్బులే డబ్బులు..

PM Kisan : తెలుగు ప్రజలకు ఉగాది, రంజాన్ పండగలు ముందే వచ్చాయి. ఆంధ్ర ప్రదేశ్ రైతుల ఖాతాల్లో రూ.6 వేలు జమకాగా, తెలంగాణ రైతుల అకౌంట్లలో రూ.2 వేలు పడ్డాయి. ఇలా సరిగ్గా పండగల సమయంలో కేంద్రం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ఏపీ ప్రభుత్వం 'అన్నదాత-సుఖీభవ' డబ్బులు పడటంతో రైతుల ముఖంలో ఆనందం విరిసింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ దేశంలోని చిన్న, సన్నకారు రైతులకు పీఎం కిసాన్ డబ్బులు అందాయి.

అయితే కొందరు రైతులకు వివిధ కారణాలతో ఈ పెట్టుబడి సాయం అందలేదు... అలాంటివారు కంగారుపడాల్సిన పనిలేదు. ఇంట్లో కూర్చుని ఫోన్ లోనే సమస్యను తెలుసుకోవచ్చు.... పరిష్కరించుకోవచ్చు. ఇందుకోసం ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పీఎం కిసాన్ స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా..?
Image Credit : X (Twitter)

పీఎం కిసాన్ స్టేటస్ చెక్ చేసుకోవడం ఎలా..?

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ (మార్చి 13, శుక్రవారం) అస్సాం రాజధాని గువహటిలో అధికారికంగా నిధులు విడుదల చేశారు... దీంతో దేశంలోని 9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.18,640 కోట్లు నేరుగా జమ అయ్యాయి. వీరిలో 2.15 కోట్లకు పైగా మహిళా రైతులు ఉన్నారు. 2019లో ఈ పథకం ప్రారంభంకాగా ఇప్పటివరకు 22 విడతలు పూర్తయ్యాయి... మొత్తం రూ.4.27 లక్షల కోట్లకు పైగా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి.

అయితే మీకు ప్రతి విడతలో పీఎం కిసాన్ డబ్బులు పడి ఈసారి పడకుంటే కంగారుపడిపోకండి. ఇందుకు కారణమేంటో తెలుసుకొని అది పరిష్కరించుకుంటే హోల్డ్ లో ఉన్న డబ్బులు అకౌంట్లో పడిపోతాయి. ఇందుకోసం ముందుగా స్మార్ట్ ఫోన్‌లో pmkisan.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. హోమ్‌పేజీలో 'Know Your Status' ఆప్షన్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేయండి. స్క్రీన్‌పై కనిపించే క్యాప్చా కోడ్‌ను నింపండి. మీ ఫోన్‌కు వచ్చే OTPని ఎంటర్ చేయగానే, మీ పూర్తి స్టేటస్ కనిపిస్తుంది. అందులో మీకు పీఎం కిసాన్ డబ్బులు ఎందుకు పడలేవో కారణం కనిపిస్తుంది.

35
సమస్యను పరిష్కరించుకునే మార్గమిదే...
Image Credit : ChatGPT

సమస్యను పరిష్కరించుకునే మార్గమిదే...

మీ వివరాలన్ని సరిగ్గానే ఉన్నా పీఎం కిసాన్ డబ్బులు అకౌంట్లో జమ కాకుంటే కంగారుపడకండి. ప్రభుత్వం ఇలాంటి రైతుల సహాయం కోసమే టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులో ఉంచింది. కాబట్టి వెంటనే 1800-115-526 నంబర్‌కు ఫోన్ చేసి మీ సమస్యను తెలియజేయవచ్చు. వారి సలహాలు, సూచనలు పాటించి పీఎం కిసాన్ డబ్బులు పొందవచ్చు.

45
ఏపీ రైతులకు ఏకంగా రూ.6 వేల సాయం...
Image Credit : pixabay

ఏపీ రైతులకు ఏకంగా రూ.6 వేల సాయం...

దేశవ్యాప్తంగా రైతులకు కేవలం రూ.2 వేలు అందితే ఏపీ రైతులకు మాత్రం రూ.6 వేలు అందాయి. పీఎం నరేంద్ర మోదీ పీఎం కిసాన్ కింద రూ.2 వేలు విడుదల చేస్తే ఏపీ సీఎం నారా చంద్రబాబు వాటికి మరో రూ.4 వేలు జతచేసి రూ.6 వేలు వేశారు. కృష్ణా జిల్లా సూరంపల్లి సమీపంలోని మాదాల వారి గూడెంలో మూడువేల మందికిపైగా రైతులతో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేశారు... ఇందులోని సీఎం అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేశారు.

అన్నదాత సుఖీభవ మూడవ విడతలో భాగంగా 46.85 లక్షల మంది రైతులకు కేంద్ర, రాష్ట్ర వాటా కింద రూ.6,000 చొప్పున జమ అయ్యాయి. మూడో విడతగా రూ.2,676 కోట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నాయి... ఇందులో రాష్ట్ర వాటా రూ.1,874 కోట్లు అని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే రెండు విడతలు కలిపి రూ.14 వేలను ప్రభుత్వం అందించింది... తాజాగా రూ.6 వేలతో కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.20,000 అందించినట్లు అయ్యింది.

55
తెలంగాణలో రైతు భరోసా ఎప్పుడు..?
Image Credit : Getty

తెలంగాణలో రైతు భరోసా ఎప్పుడు..?

తెలంగాణ ప్రజలకు పీఎం కిసాన్ అయితే అందింది... ఇక రైతు భరోసా మిగిలింది. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు భరోసా అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి... తాజాగా మంత్రి వివేక్ వెంకటస్వామి దీనిపై ఆసక్తికర ప్రకటన చేశారు. మార్చి నెలాఖరులోపు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలల్లో జమ అవుతాయని... ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కాబట్టి రైతులెవ్వరూ ఆందోళన చెందవద్దని మంత్రి సూచించారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వ్యవసాయం (Vyavasayam)
ప్రభుత్వ పథకాలు
నరేంద్ర మోదీ
నారా చంద్రబాబు నాయుడు
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
కుప్పం ఋణం తీర్చుకుంటున్న బాబు | Chandrababu Kuppam Tour | Asianet News Telugu
Recommended image2
Now Playing
మా 90's కిడ్స్ కి చంద్రబాబు అంటే ఒక ఎమోషన్ | Chandrababu fan moment | Asianet News Telugu
Recommended image3
Now Playing
అవును వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు | YS Sharmila Meets YS Jagan | Asianet News Telugu
Related Stories
Recommended image1
PM Kisan : రూ.6000 కావాలంటే ఈ పని తప్పక చేయాల్సిందే.. పీఎం కిసాన్ లేటెస్ట్ అప్‌డేట్ !
Recommended image2
PM Kisan : రైతులకు పండుగ ముందే వచ్చింది.. ఖాతాల్లోకి రూ. 6,000.. లిస్టులో మీ పేరుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved