Asianet News TeluguAsianet News Telugu

టీడీపీ కాపు నేతల రహస్య భేటీ: చక్రం తిప్పిన రామ్ మాధవ్

టీడీపీకి చెందిన కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు కాకినాడలోని ఓ హోటల్‌లో రహస్యంగా సమావేశమయ్యారు. బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి  రామ్‌మాధవ్ కొందరు టీడీపీ నేతలతో టచ్‌లోకి వెళ్లినట్టుగా సమాచారం

bjp leader ram madhav key role behind the kapu tdp leaders meeting
Author
Amaravathi, First Published Jun 20, 2019, 2:42 PM IST


కాకినాడ: టీడీపీకి చెందిన కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు కాకినాడలోని ఓ హోటల్‌లో రహస్యంగా సమావేశమయ్యారు. బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి  రామ్‌మాధవ్ కొందరు టీడీపీ నేతలతో టచ్‌లోకి వెళ్లినట్టుగా సమాచారం. ఈ  చర్చలకు  కొనసాగింపుగానే గురువారం నాడు  టీడీపీ నేతలు సమావేశమైనట్టుగా ప్రచారం సాగుతోంది.

 టీడీపీకి చెందిన నేతలతో బీజేపీ అగ్రనేత  రామ్ మాధవ్ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రామ్ మాధవ్ నేరుగా కొందరు నేతలతో టచ్‌లోకి వెళ్లినట్టుగా సమాచారం ఉంది. మరో వైపు తమ పార్టీకి చెందిన నేతలతో  తోట త్రిమూర్తులుతో కూడ  రామ్ మాధవ్ చర్చలు జరిపినట్టుగా ప్రచారం సాగుతోంది.

ఏపీలో బలోపేతమయ్యేందుకు బీజేపీ వ్యూహత్మకంగా పావులు కదుపుతోంది. ఈ మేరకు టీడీపీకి చెందిన ముఖ్య నేతలకు ఆ పార్టీ నాయకత్వం చర్చలు జరుపుతోంది. ఈ చర్చల్లో భాగంగానే  టీడీపీ నేతలు సమావేశమైనట్టుగా సమాచారం.

కాకినాడ కేంద్రంగా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు సమావేశం కావడం వెనుక బీజేపీ అగ్రనేతలు కొంతకాలంగా టీడీపీ నేతలు టచ్‌లోకి వెళ్లినట్టుగా ఉన్నట్టుగా  ప్రచారం సాగుతోంది. అయితే కాకినాడలో సమావేశమైన నేతలు మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. ఏ కారణం చేత తాము ఓటమి పాలయ్యామో అనే విషయమై చర్చించేందుకు సమావేశమైనట్టుగా తోట త్రిమూర్తులు, బొండా ఉమ ప్రకటించారు.

అయితే కాకినాడలో సమావేశమైన నేతలతో మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి కూడ టచ్‌లోకి వెళ్లినట్టుగా సమాచారం. సుజనా చౌదరి  నేతృత్వంలోనే ఈ  నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని సమాచారం.

ఏపీలో టీడీపీ అగ్రనేతలతో కొంత కాలంగా  బీజేపీ అగ్రనేత రామ్ మాధవ్ చర్చలు జరిపినట్టుగా సమాచారం. ఏపీ రాష్ట్రంలో వైసీపీకి తామే ప్రత్యామ్నాయం అని  బీజేపీ నేతలు కొంత కాలంగా ప్రకటిస్తున్నారు. అంతేకాదు టీడీపీకి చెందిన కీలక నేతలు తమతో టచ్‌లో ఉన్నారని కూడ బీజేపీ నేతలు ప్రకటిస్తున్నారు. 

టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ నెల 25వ తేదీన ఏపీకి తిరిగి రానున్నారు. అయితే విదేశీ పర్యటనలో బాబు ఉన్న సమయంలో  టీడీపీకి చెందిన కీలక నేతలు కాకినాడలో సమావేశం కావడం వెనుక బీజేపీ నేతలతో కొంత కాలంగా ఉన్న సంప్రదింపులు కారణంగా చెబుతున్నారు.

కాకినాడ సమావేశానికి వెళ్లకూడదని కూడ కొందరు నేతలకు పార్టీ సీనియర్లు  ఫోన్లు చేశారని సమాచారం. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని కూడ టీడీపీ నేతలు సూచించారని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

 

బీజేపీలో రాజ్యసభ ఎంపీల చేరిక చంద్రబాబుకు ముందే తెలుసు

టీడీపీతోనే ఉంటా: రాజకీయాల్లో విలువలు లేవు, సుజనాపై ప్రత్తిపాటి ఫైర్

మేం వేరు: వెంకయ్యకు టీడీపీ రాజ్యసభ ఎంపీల లేఖ

టీడీపీ ఖాళీయే: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు

బీజేపీలోకి టీడీపీ ఎంపీలు.. మేం ఎవరిని ఆకర్షించలేదు: జీవీఎల్

ఏపీ టీడీపీలో ముసలం: ఎంపీల వ్యవహారం తెలియదన్న కళా వెంకట్రావ్

టీడీపీపై నమ్మకం పోయింది.. పురందేశ్వరి

సంక్షోభం కొత్త కాదు: సీనియర్ నేతలకు బాబు ఫోన్

ఆ నలుగురి బాటలోనే కేశినేని..?

స్పీకర్‌‌ను కలిసిన టీడీపీ లోక్‌సభ ఎంపీలు: మతలబు?

మేము ఏ పార్టీలోకి వెళ్లడం లేదు: తోట త్రిమూర్తులు

టీడీపీలో ముసలం: మరో ఆగష్టు సంక్షోభం?

టీడీపీ కాపు నేతల రహస్య భేటీ: చక్రం తిప్పిన రామ్ మాధవ్

చంద్రబాబు వచ్చేలోగా టీడీపి ఖాళీ: వెనక సుజనా చౌదరి?

చంద్రబాబుకు షాక్: రాజ్యసభలో టీడీపికి మిగిలింది ఇద్దరే, నలుగురు జంప్

తోట త్రిమూర్తులుతో టీడీపీ నేతల భేటీ: బిజెపిలో గంపగుత్తగా చేరిక?

చంద్రబాబు వచ్చేలోపు ముఖచిత్రం మారిపోతుంది: బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి

రాజకీయాలకు జేసీ దివాకర్ రెడ్డి గుడ్ బై: జేసీ ప్రభాకర్ రెడ్డి క్లారిటీ ఇదే....

 


 

Follow Us:
Download App:
  • android
  • ios