ప్రపంచకప్ హోరులో భాగంగా బుధవారం న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో విజయాపజయాల సంగతి పక్కన పెడితే.. ఓ వీడియో మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతోంది. న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ ఔట్ అయిన విధానం అందరి చేత నవ్వులు పూయిస్తోంది.

బ్యాటింగ్ లో భాగంగా మార్టిన్ గుప్తిల్... న్యూజిలాండ్ ఓపెనర్ గా ఫీల్డ్ లోకి అడుగుపెట్టారు. ప్రత్యర్థి వేసిన బంతిని పెద్ద షాట్ ఆడదామని ప్రయత్నించి మార్టిన్ తన పట్టు తప్పాడు. బ్యాలెన్స్ కోల్పోయి గిరిగిరా తిరిగి వికెట్ల మీద పడ్డాడు. దీంతో తనంతట తానే ఔట్ అయిపోయాడు. అయినప్పటికీ విజయం న్యూజిలాండ్ నే వరించింది. ప్రస్తుతం న్యూజిలాండ్ వరల్డ్ కప్ పాయింట్ల పట్టికలో ముందంజలో ఉంది. మొత్తం 5 మ్యాచుల్లో ఒక మ్యాచ్ డ్రా కాగా... మిగిలిన 4 మ్యాచ్ లు విజయం సాధించింది. దీంతో 9 పాయింట్లు సాధించి మొదటి స్థానంలో ఉంది. 

న్యూజిలాండ్ తో మ్యాచ్ ని కూడా కోల్పోయిన దక్షిణాఫ్రికా సెమిస్ పై ఆశలు వదులుకున్నట్లే. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్ లు ఆడగా.. కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది.ఈ సంగతి పక్కన పెడితే..ఇక మార్టిన్ గుప్తిల్ వీడియో మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోని మీరు కింద వీక్షించవచ్చు.