న్యూఢిల్లీ:   టీడీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ను కలిశారు.రాజ్యసభలో నలుగురు ఎంపీలు తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలని రాజ్యసభ చైర్మెన్‌కు లేఖ ఇచ్చిన తరుణంలో  ఈ ముగ్గురు ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ను కలవాలని నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకొంది.

చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనలో ఉన్నారు. మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్,, గరికపాటి మోహన్ రావులు బీజేపీలో చేరాలని  నిర్ణయం తీసుకొన్నారు. త్వరలోనే ఈ నలుగురు బీజేపీలో చేరే అవకాశం ఉంది. ఈ నలుగురు ఎంపీలు  రాజ్యసభలో తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని  రాజ్యసభ చైర్మెన్‌కు లేఖ రాశారు.

ఈ నలుగురు ఎంపీలు రాజ్యసభలో ప్రత్యేక గ్రూపుగా కొనసాగే అవకాశం ఉంది.. ఇదిలా ఉంటే లోక్‌సభలో ముగ్గురు ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని కూడ లోక్‌సభ స్పీకర్‌ను కలిశారు.

లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా  ఎన్నికైన తర్వాత ఆయనను మర్యాదపూర్వకంగానే కలిసినట్టుగా టీడీపీ ఎంపీలు చెబుతున్నారు.  కానీ, రాజ్యసభలో నలుగురు ఎంపీలు ప్రత్యేక వర్గంగా గుర్తించాలని లేఖను ఇచ్చిన సమయంలో  లోక్‌సభ స్పీకర్‌ను ఈ ముగ్గురు ఎంపీలు కలవడంపై సర్వత్రా చర్చ సాగుతోంది. 

ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత టీడీపీ పార్లమెంట్ పార్టీ సమావేశం తర్వాత   చంద్రబాబునాయుడు తీసుకొన్న నిర్ణయాలపై కేశినేని నాని  తీవ్రంగానే స్పందించారు. అంతేకాదు లోక్‌సభలో టీడీపీ విప్ పదవిని తిరస్కరిస్తున్నట్టుగా కేశినేని నాని ప్రకటించారు.

వరుసగా మూడు దఫాలు తన ఫేస్‌బుక్ వాల్‌పై నాని  పోస్టులు పెట్టారు.  పార్టీ నాయకత్వం తీసుకొన్న నిర్ణయాలపై కేశినేని నాని తీవ్రంగా మనస్థాపానికి గురైనట్టుగా  ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ విషయమై చంద్రబాబు నాయుడు చర్చించినా కూడ నాని మాత్రం చల్లబడలేదు.

పార్టీ నాయకత్వంపై కేశినేని నాని  అసంతృప్తితో ఉన్నారు. వ్యాపార వేత్తగా ఉన్న గల్లా జయదేవ్‌పై ఒత్తిడి ఉండే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఇక రామ్మోహన్ నాయుడు ఏం చేయాలో అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో  ఈ ముగ్గురు ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ను కలవడమే అనుమానాలకు తావిస్తోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

బీజేపీలో రాజ్యసభ ఎంపీల చేరిక చంద్రబాబుకు ముందే తెలుసు

టీడీపీతోనే ఉంటా: రాజకీయాల్లో విలువలు లేవు, సుజనాపై ప్రత్తిపాటి ఫైర్

మేం వేరు: వెంకయ్యకు టీడీపీ రాజ్యసభ ఎంపీల లేఖ

టీడీపీ ఖాళీయే: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు

బీజేపీలోకి టీడీపీ ఎంపీలు.. మేం ఎవరిని ఆకర్షించలేదు: జీవీఎల్

ఏపీ టీడీపీలో ముసలం: ఎంపీల వ్యవహారం తెలియదన్న కళా వెంకట్రావ్

టీడీపీపై నమ్మకం పోయింది.. పురందేశ్వరి

సంక్షోభం కొత్త కాదు: సీనియర్ నేతలకు బాబు ఫోన్

ఆ నలుగురి బాటలోనే కేశినేని..?

స్పీకర్‌‌ను కలిసిన టీడీపీ లోక్‌సభ ఎంపీలు: మతలబు?

మేము ఏ పార్టీలోకి వెళ్లడం లేదు: తోట త్రిమూర్తులు

టీడీపీలో ముసలం: మరో ఆగష్టు సంక్షోభం?

టీడీపీ కాపు నేతల రహస్య భేటీ: చక్రం తిప్పిన రామ్ మాధవ్

చంద్రబాబు వచ్చేలోగా టీడీపి ఖాళీ: వెనక సుజనా చౌదరి?

చంద్రబాబుకు షాక్: రాజ్యసభలో టీడీపికి మిగిలింది ఇద్దరే, నలుగురు జంప్

తోట త్రిమూర్తులుతో టీడీపీ నేతల భేటీ: బిజెపిలో గంపగుత్తగా చేరిక?

చంద్రబాబు వచ్చేలోపు ముఖచిత్రం మారిపోతుంది: బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి

రాజకీయాలకు జేసీ దివాకర్ రెడ్డి గుడ్ బై: జేసీ ప్రభాకర్ రెడ్డి క్లారిటీ ఇదే....