Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు వచ్చేలోగా టీడీపి ఖాళీ: వెనక సుజనా చౌదరి?

ఏపీలో తెలుగుదేశం పార్టీ ముఖచిత్రం మార్చేస్తామని బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి చెప్పకనే చెప్పారు. యూరప్ ట్రిప్ నుంచి చంద్రబాబు నాయుడు వచ్చే లోపు ఏపీలో టీడీపీ ముఖచిత్రం మార్చేస్తామని బీజేపీ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మెుత్తానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు యూరప్ ట్రిప్ నుంచి వచ్చేసరికి ఏపీలో టీడీపీని బీజేపీ ఊడ్చే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. 

TDP leaders may jump into BJP
Author
Amaravathi, First Published Jun 20, 2019, 2:28 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓటమి పాలవ్వడంతో ఆ పార్టీలో ముసలం నెలకొంది. ఎవరికి వారే తమ రాజకీయ భవిష్యత్ కు వేదిక ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. 

పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు యూరప్ ట్రిప్ వెళ్లిన నేపథ్యంలో ఇదే తరుణమని భావించిన కొందరు నేతలు గోడ దూకేందుకు రెడీ అవుతున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైయస్  జగన్ డోర్ క్లోజ్ చేయడంతో ఇక చేసేది లేక బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు టీడీపీ నేతలు. 

ఇప్పటికే రాజ్యసభ సభ్యుల్లో చీలిక వచ్చేసింది. టీడీపీ సీనియర్ నేత, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, ఎంపీ సుజనాచౌదరి ముగ్గురు రాజ్యసభ సభ్యులతో కలిసి ఒక జట్టుకట్టేశారు. వీరంతా కలిసి బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. 

బీజేపీలో చేరే అంశంపై ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలతో చర్చలు కూడా జరిపారు. గురువారం సాయంత్రంలోగా వీరంతా కలిసి రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడును కలవబోతున్నారని  కూడా తెలుస్తోంది. 

బీజేపీలో చేరబోతున్న తమను ప్రత్యేక టీమ్ గా లేదా బీజేపీకి అనుబంధం సభ్యులుగా పరిగణించాలని కోరుతూ లేఖ సమర్పించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే రాజ్యసభలో ఇద్దరు ఎంపీలు తోట సీతారామలక్ష్మీ, కనకమేడల రవీంద్రకుమార్ లు మాత్రమే మిగిలారు. తోట సీతారామలక్ష్మిసైతం బీజేపీలో చేరేందుకు రెడీగా ఉన్నారని తెలుస్తోంది. ఒకవేళ ఆమె చేరకపోతే రవీంద్రకుమార్ తో కలిసి మరోజట్టుకట్టే అవకాశం ఉంది. 

ఇదిలా ఉంటే రాష్ట్రం విషయానికి వస్తే కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలంతా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. టీడీపీ అధిష్టానాన్ని సంప్రదించకుండా టీడీపీ సీనియర్ నేత తోట త్రిమూర్తుల నేతృత్వంలో నేతలంతా సమావేశమయ్యారు. 

ఈ సమావేశానికి కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలే హాజరుకావడం ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీపీకి చెందిన కాపు నేతలంతా బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని అందులో భాగంగానే ఈ రహస్య భేటీ జరుతుతోందని తెలుస్తోంది. 

కాపు సామాజిక వర్గం నేతల సమావేశం వెనుక టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి, బీజేపీ అగ్రనేత రామ్ మాధవ్ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు మత పరంగా తన సామ్రాజ్యాన్ని విస్తరించిన బీజేపీ ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యాష్ట్ ఈక్వేషన్స్ ప్రకారం పార్టీని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే కాపు సామాజిక వర్గంలోని కీలక నేతలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఈ మీటింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది. 

కాపు సామాజిక వర్గం నేతల సమావేశానికి హాజరైన కీలక నేతలంతా చంద్రబాబుకు గత ఎన్నికల్లో దూరంగా ఉన్నవారే కావడం విశేషం. అంతేకాకుండా టికెట్ ఇస్తే టీడీపీలో ఉందాం లేకపోతే పార్టీ మారిపోదాం అనుకున్న నేతలు సైతం సమావేశానికి హాజరయ్యారు. దీంతో వీరంతా పార్టీ వీడి బీజేపీ గూటికి చేరిపోవడం ఖాయమనిపిస్తోంది. 

ఇకపోతే ఏపీలో తెలుగుదేశం పార్టీ ముఖచిత్రం మార్చేస్తామని బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి చెప్పకనే చెప్పారు. యూరప్ ట్రిప్ నుంచి చంద్రబాబు నాయుడు వచ్చే లోపు ఏపీలో టీడీపీ ముఖచిత్రం మార్చేస్తామని బీజేపీ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మెుత్తానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు యూరప్ ట్రిప్ నుంచి వచ్చేసరికి ఏపీలో టీడీపీని బీజేపీ ఊడ్చే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. 

ఈ వార్తలు కూడా చదవండి

 

బీజేపీలో రాజ్యసభ ఎంపీల చేరిక చంద్రబాబుకు ముందే తెలుసు

టీడీపీతోనే ఉంటా: రాజకీయాల్లో విలువలు లేవు, సుజనాపై ప్రత్తిపాటి ఫైర్

మేం వేరు: వెంకయ్యకు టీడీపీ రాజ్యసభ ఎంపీల లేఖ

టీడీపీ ఖాళీయే: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు

బీజేపీలోకి టీడీపీ ఎంపీలు.. మేం ఎవరిని ఆకర్షించలేదు: జీవీఎల్

ఏపీ టీడీపీలో ముసలం: ఎంపీల వ్యవహారం తెలియదన్న కళా వెంకట్రావ్

టీడీపీపై నమ్మకం పోయింది.. పురందేశ్వరి

సంక్షోభం కొత్త కాదు: సీనియర్ నేతలకు బాబు ఫోన్

ఆ నలుగురి బాటలోనే కేశినేని..?

స్పీకర్‌‌ను కలిసిన టీడీపీ లోక్‌సభ ఎంపీలు: మతలబు?

మేము ఏ పార్టీలోకి వెళ్లడం లేదు: తోట త్రిమూర్తులు

టీడీపీలో ముసలం: మరో ఆగష్టు సంక్షోభం?

టీడీపీ కాపు నేతల రహస్య భేటీ: చక్రం తిప్పిన రామ్ మాధవ్

చంద్రబాబు వచ్చేలోగా టీడీపి ఖాళీ: వెనక సుజనా చౌదరి?

చంద్రబాబుకు షాక్: రాజ్యసభలో టీడీపికి మిగిలింది ఇద్దరే, నలుగురు జంప్

తోట త్రిమూర్తులుతో టీడీపీ నేతల భేటీ: బిజెపిలో గంపగుత్తగా చేరిక?

చంద్రబాబు వచ్చేలోపు ముఖచిత్రం మారిపోతుంది: బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి

రాజకీయాలకు జేసీ దివాకర్ రెడ్డి గుడ్ బై: జేసీ ప్రభాకర్ రెడ్డి క్లారిటీ ఇదే....

 

Follow Us:
Download App:
  • android
  • ios