Asianet News TeluguAsianet News Telugu

వేణుమాధవ్ ఇంటిపై ఉండే దర్శకుల పేర్లు ఎవరివంటే..?


కమెడియన్ గా టాలీవుడ్ లో సరికొత్త యాంగిల్ లో గుర్తింపు తెచ్చుకున్న వేణు మాధవ్ మరణించడం అభిమానులను కలచివేసింది. గత కొంత కాలంగా కాలేయ  సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వేణుమాధవ్ బుధవారం తుది శ్వాసను విడిచారు. 
 

venumadhav affection towards acchi reddy sv krishnareddy
Author
Hyderabad, First Published Sep 25, 2019, 3:18 PM IST

సినిమా ఇండస్ట్రీలో హాస్య నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు వేణుమాధవ్ కాలేయ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ బుధవారం నాడు మృతి చెందారు. అభిమానుల సందర్శనార్ధం రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు మృతదేహాన్ని ఫిలిం ఛాంబర్ కి తీసుకురానున్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన 'సంప్రదాయం'  సినిమాతో వేణుమాధవ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.

నిజానికి అప్పటికి ఆయన మిమిక్రీ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. సినిమాల మీద ఆసక్తి లేనప్పటికీ అచ్చిరెడ్డి, కృష్ణరెడ్డి లాంటి దర్శకులు అడుగుతున్నారని..ఇంట్లో తన తల్లి కూడా వెళ్లమని ఒత్తిడి చేయడంతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

ఆ తరువాత కమెడియన్ గా మెల్లమెల్లగా ఎదుగుతూ స్టార్ హీరో అందుకున్నాడు. ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా నటించి నంది అవార్డు కూడా అందుకున్నాడు. తను ఈరోజు ఇంత బాగా బ్రతుకుతున్నానంటే దానికి కారణం అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డిలే కారణమని చెబుతుంటారు వేణుమాధవ్. అందుకే తన ఇళ్లల్లకు కూడా వారిద్దరి పేర్లు కలిసొచ్చేలా పేరు పెట్టుకున్నాడు.

ఈ ఆలోచన తనకు వచ్చినప్పుడు నటుడు ఉత్తేజ్ తో చెబితే.. అతడు 'అచ్చి వచ్చిన కృష్ణ నిలయం' అనే పేరు సజెస్ట్ చేశాడట. ఆ పేరు నచ్చడంతో తన ఇంటికి అదే పేరుగా పెట్టానని గతంలో వేణుమాధవ్ చెప్పారు. తన పది ఇళ్లకూ అదే పేరు ఉంటుందని..  మౌలాలీలో ఈ పేరుతో ఉన్న ఇల్లు ఎవరిది? అని ఎవర్ని అడిగినా, ‘వేణుమాధవ్’ది అని చెబుతారని గతంలో ఓ సందర్భంలో వెల్లడించారు.   

 

related news

వేణుమాధవ్ మృతికి మహేష్ బాబు సంతాపం!

వేణుమాధవ్ జీవితాన్ని మార్చేసిన సంఘటన.. తొలి పారితోషికం ఎంతంటే!

మెగాస్టార్ కోసం రూల్ బ్రేక్ చేసిన వేణుమాధవ్!

'అప్పట్లో భుట్టో.. ఇప్పుడు ముషారఫ్'.. వేణుమాధవ్ మృతికి ప్రముఖుల సంతాపం!

బ్రేకింగ్: హాస్య నటుడు వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి విషమం!

బ్రేకింగ్: ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత!

బూతులు ఉన్నాయనే సినిమాలు చేయలేదు.. వేణుమాధవ్!

ఛాన్సుల కోసం ఎవరినీ అడుక్కోను.. వేణుమాధవ్ కామెంట్స్!

కాలు మీద కాలేసి కూర్చున్నానని.. ఆ స్టార్ హీరో.. : వేణుమాధవ్!

వేణుమాధవ్ యూ టర్న్ రోల్స్.. నల్లబాలు నల్ల తాచు లెక్క

అభిమానుల సందర్శనార్ధం వేణుమాధవ్ పార్థివదేహం.. రేపే అంత్యక్రియలు

వేణుమాధవ్ కి ఎంత ఆస్తి ఉందో తెలుసా..?

వేణుమాధవ్ ఇంటిపై ఉండే దర్శకుల పేర్లు ఎవరివంటే..?

వేణుమాధవ్‌‌ చెంపపై కొట్టిన సీనియర్ ఎన్టీఆర్

టీడీపీ కార్యాలయంలో పనిచేసిన వేణుమాధవ్

వేణుమాధవ్ ప్రత్యేకత ఇదీ: నల్గొండ నుండి హైద్రాబాద్ కు ఇలా...

వేణుమాధవ్.... ఆ కోరిక తీరకుండానే..

 

Follow Us:
Download App:
  • android
  • ios