MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Andhra Pradesh
  • Weather Update : ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు, బలమైన గాలులు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్

Weather Update : ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు, బలమైన గాలులు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్

Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. దీని కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ, అధికారులు సూచించారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 11 2026, 09:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో దంచికొట్టనున్న వానలు
Image Credit : Chatgpt

తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో దంచికొట్టనున్న వానలు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ ఒడిశా తీరం వెంబడి ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఉత్తర దిశగా ప్రయాణించి, ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో స్థిరంగా కేంద్రీకృతమై ఉంది. ఇది రానున్న రోజుల్లో మరింత కదులుతూ విదర్భ వైపు వెళ్లే క్రమంలో బలహీనపడే సూచనలు ఉన్నాయి. అయితే, ఈ సిస్టమ్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాబోయే రెండు నుంచి మూడు రోజులు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని విశాఖపట్నం, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు తెలిపాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఉత్తరాంధ్రను వణికించనున్న ఈదురుగాలులు, పిడుగులు
Image Credit : chatgpt

ఉత్తరాంధ్రను వణికించనున్న ఈదురుగాలులు, పిడుగులు

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అల్పపీడన ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రత్యేకించి ఉత్తరాంధ్ర జిల్లాలపై దీని ఇంపాక్ట్ తీవ్రంగా ఉండనుంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

వీటితో పాటు విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలతో పాటు పోలవరం ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు విస్తారంగా పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో వానలు స్టార్ట్ అయ్యాయి.

Related Articles

Related image1
Asia Cup 2026 Final: ఆసియా కప్‌లో భారత్‌ను ఆపడం ఎవరి వల్ల కాదు.. మళ్లీ ఫైనల్‌కు టీమిండియా గ్రాండ్ ఎంట్రీ
Related image2
Investment Tips: ఈ 5 గోల్డెన్ ఇన్వెస్ట్‌మెంట్ రూల్స్ తెలిస్తే మీ లైఫ్ సెట్
35
సముద్రంలో వేటకు నో.. మత్స్యకారులకు అలర్ట్
Image Credit : Gemini

సముద్రంలో వేటకు నో.. మత్స్యకారులకు అలర్ట్

కోస్తా తీరం వెంబడి వాతావరణం బాగా కల్లోలంగా మారింది. ఉత్తర కోస్తా తీరం వెంట గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉంది. సముద్రం అల్లకల్లోలంగా మారడమే కాకుండా పెద్ద ఎత్తున అలలు ఎగసిపడే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే నీటిలోకి వెళ్లిన మత్స్యకారులు తక్షణమే తీరానికి తిరిగి రావాలని స్పష్టం చేశారు.

45
తెలంగాణలో ఏ జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా పడతాయి?
Image Credit : Google AI

తెలంగాణలో ఏ జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా పడతాయి?

తెలంగాణలోనూ ఈ అల్పపీడన ఎఫెక్ట్ సెప్టెంబర్ 14 వరకు కొనసాగనుంది. ముఖ్యంగా సెప్టెంబర్ 12, 13 తేదీల్లో వర్షాల తీవ్రత అత్యధికంగా ఉంటుంది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ, 50 నుంచి 70 మిల్లీమీటర్ల వరకు భారీ వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉంది. అయితే దక్షిణ తెలంగాణలోని జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో మాత్రం వర్షాల ప్రభావం చాలా తక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

55
హైదరాబాద్ లోనూ వర్షాలు
Image Credit : Gemini

హైదరాబాద్ లోనూ వర్షాలు

రాజధాని హైదరాబాద్‌ విషయానికి వస్తే, నగరం రోజంతా సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో నగరంలో చినుకులు పడే సూచనలు ఎక్కువ. ఇక సెప్టెంబర్ 15 నుంచి 17 మధ్య రెండు రాష్ట్రాల్లోనూ వర్షాలు క్రమంగా తగ్గుముఖం పట్టవచ్చని భావిస్తున్నారు. రైతులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు అలర్ట్ చేశారు.

వర్షాలు, బలమైన ఈదురుగాలుల సమయంలో ప్రజలు పాత భవనాలు, పెద్ద చెట్లు, విద్యుత్ స్తంభాలు లేదా హోర్డింగ్‌ల కింద నిలబడవద్దని సూచించారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
లైవ్: వైఎస్ జగన్ కీలక ప్రెస్ మీట్ | వైఎస్ జగన్ లేటెస్ట్ ప్రెస్ మీట్ | వైఎస్‌ఆర్‌సిపి లేటెస్ట్ న్యూస్
Recommended image2
Flight: తిరుప‌తికి కొత్త విమాన స‌ర్వీస్‌.. టైమింగ్స్, టికెట్ ధ‌ర వివ‌రాలు
Recommended image3
Weather Update : బంగాళాఖాతంలో అల్పపీడనం రెడీ... తెలుగు రాష్ట్రాలపై స్ట్రాంగ్ ఎఫెక్ట్, ఈ జిల్లాల్లో ఇక వర్షబీభత్సమే
Related Stories
Recommended image1
Asia Cup 2026 Final: ఆసియా కప్‌లో భారత్‌ను ఆపడం ఎవరి వల్ల కాదు.. మళ్లీ ఫైనల్‌కు టీమిండియా గ్రాండ్ ఎంట్రీ
Recommended image2
Investment Tips: ఈ 5 గోల్డెన్ ఇన్వెస్ట్‌మెంట్ రూల్స్ తెలిస్తే మీ లైఫ్ సెట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved