MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Technology
  • Gadgets
  • iPhone 18 Pro Max: 45 గంటల బ్యాటరీ లైఫ్‌తో మైండ్ బ్లాకింగ్ ఫీచర్లు.. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ధరెంతో తెలుసా?

iPhone 18 Pro Max: 45 గంటల బ్యాటరీ లైఫ్‌తో మైండ్ బ్లాకింగ్ ఫీచర్లు.. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ధరెంతో తెలుసా?

iPhone 18 Pro Max: ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ నెక్స్ట్ లెవెల్ ఫీచర్లతో ఎంట్రీ ఇచ్చింది. వేరియబుల్ ఎపర్చర్ కెమెరా, A20 ప్రో చిప్‌సెట్, మరింత స్పీడ్ గా పనిచేసే సిరి ఏఐ, 45 గంటల వీడియో ప్లేబ్యాక్ బ్యాటరీ లైఫ్‌తో వచ్చేసింది. మరి ఇండియాలో ధరెంతో తెలుసా?

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 10 2026, 09:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
నెక్స్ట్ లెవెల్ ఫీచర్లతో ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ లాంచ్
Image Credit : Chatgpt

నెక్స్ట్ లెవెల్ ఫీచర్లతో ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ లాంచ్

ఆపిల్ తన మోస్ట్ అవైటెడ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 18 ప్రో మాక్స్ (iPhone 18 Pro Max) మోడల్‌ను కాలిఫోర్నియాలో అధికారికంగా విడుదల చేసింది. ఇప్పటివరకు వచ్చిన ఐఫోన్లలోకెల్లా అత్యంత అడ్వాన్స్డ్ ప్రో కెమెరా సిస్టమ్ ను ఇందులో తీసుకొచ్చారు. అలాగే, అత్యధిక బ్యాటరీ లైఫ్ ఇచ్చే స్పెక్స్ తో అందుబాటులోకి వచ్చిందది. ఇక కెమెరా అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.

ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ A20 ప్రో చిప్‌సెట్, అప్‌గ్రేడెడ్ వేపర్ ఛాంబర్‌తో పనిచేస్తుంది. iOS 27, ఆపిల్ ఇంటెలిజెన్స్, సిరి ఏఐ కాంబినేషన్‌తో ఈ ఫోన్ రన్ అవుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
సూపర్ కెమెరా సెటప్
Image Credit : Apple Screengrab

సూపర్ కెమెరా సెటప్

ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లో 48MP ఫ్యూజన్ మెయిన్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఐఫోన్ చరిత్రలో తొలిసారిగా వేరియబుల్ ఎపర్చర్ టెక్నాలజీని ఇందులో చేర్చడం విశేషం. సిక్స్ లేజర్-కట్ బ్లేడ్స్ ద్వారా ఈ కెమెరా వెలుతురు, డెప్త్ ఆఫ్ ఫీల్డ్‌కు అనుగుణంగా ఎపర్చర్‌ను ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేస్తుంది. దీనివల్ల తక్కువ వెలుతురు ఉన్న సమయంలో కూడా స్పష్టమైన ఫొటోలు వస్తాయి. ప్రో యూజర్లు తమకు కావాల్సినట్లు కెమెరా యాప్‌లో నాలుగు ఎపర్చర్ సెట్టింగ్స్‌ను మ్యాన్యువల్‌గా కూడా మార్చుకోవచ్చు.

ఫొటోల క్వాలిటీ పెంచడానికి కొత్త కంప్యూటేషనల్ ఇమేజింగ్ పైప్‌లైన్ ఉపయోగపడనుంది. ప్రో కంట్రోల్స్ ద్వారా లెన్స్ ఎపర్చర్, షట్టర్ స్పీడ్, వైట్ బ్యాలెన్స్, హిస్టోగ్రామ్ వంటి సెట్టింగ్స్‌ను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. సినిమాటిక్ వీడియోలను 60 fps వద్ద రికార్డ్ చేసిన తర్వాత కూడా ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. టైమ్-లాప్స్ మోడ్‌లో 4K, అలాగే, పోస్ట్ డాల్బీ విజన్ హెచ్డీఆర్ వీడియోలు రికార్డ్ చేయవచ్చు.

Related Articles

Related image1
Maruti Suzuki: మారుతి నుంచి మైండ్ బ్లాకింగ్ కారు.. రూ. 5 లక్షలకే 34KM మైలేజ్, 6 ఎయిర్‌బ్యాగ్స్
Related image2
iPhone 18 Pro: ల్యాప్‌టాప్‌ల కంటే స్పీడ్.. 2nm A20 ప్రో చిప్‌తో ఆపిల్ ఐఫోన్ 18 ప్రో వచ్చేసింది భయ్యా.. ధర, ఫీచర్లు ఇవే
36
ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ లో 'యాపిల్ రిఫరెన్స్ ఇమేజ్' ఫీచర్
Image Credit : Apple Hub | X

ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ లో 'యాపిల్ రిఫరెన్స్ ఇమేజ్' ఫీచర్

ఫొటోల ప్రామాణికతను నిరూపించేందుకు యాపిల్ సంస్థ 'యాపిల్ రిఫరెన్స్ ఇమేజ్' అనే కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. మెయిన్ కెమెరాలోని కొత్త సెన్సార్ ప్రతి పిక్సెల్‌ను సైన్ చేస్తుంది. దీనివల్ల ప్రైవేట్ క్లౌడ్ కంప్యూట్ ద్వారా మార్చడానికి వీలులేని ఓ రిఫరెన్స్ ఇమేజ్ తయారవుతుంది. ఒరిజినల్ ఫొటోతో దీనిని పోల్చి చూసి, ఎడిటింగ్ జరిగిందో లేదో ఫొటో జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్లు సులభంగా గుర్చించవచ్చు.

దీంతోపాటు ఏఐ సహాయంతో క్రియేట్ చేసిన లేదా ఎడిట్ చేసిన ఇమేజెస్ గుర్తించడానికి SynthID స్టాండర్డ్ సపోర్ట్ రానుంది. ఇక డిస్‌ప్లే విభాగంలో డైనమిక్ ఐలాండ్‌ను పునర్నిర్మించారు. పరిమాణంలో చిన్నదిగా మారిన ఈ డైనమిక్ ఐలాండ్, ఇప్పుడు ఒకేసారి మూడు 'లైవ్ యాక్టివిటీస్'ను చూపుతుంది. అలాగే ఫేస్ ఐడీ సపోర్ట్ కూడా ఇందులో కొనసాగుతుంది.

46
A20 ప్రో చిప్‌సెట్, సూపర్ కూలింగ్ సిస్టమ్
Image Credit : X@@Saurav_DJ47

A20 ప్రో చిప్‌సెట్, సూపర్ కూలింగ్ సిస్టమ్

లేటెస్ట్ 2-నానోమీటర్ ప్రాసెస్ టెక్నాలజీతో A20 ప్రో చిప్‌ను డిజైన్ చేశారు. A19 ప్రోతో పోలిస్తే ఇది 50 శాతం ఎక్కువ మెమరీ బ్యాండ్‌విడ్త్‌ను కలిగి ఉంది. దీనిలోని 6-కోర్ CPU అత్యంత వేగంగా పనిచేస్తుంది. 7-కోర్ GPU ద్వారా గ్రాఫిక్స్ రెంజరింగ్ 40 శాతం వరకు వేగవంతమవుతుంది. డ్యూయల్ 16-కోర్ న్యూరల్ ఇంజిన్ వల్ల AI ప్రాసెసింగ్ పవర్ రెట్టింపు అయింది. వైఫై 7, బ్లూటూత్ 6 కోసం N1 వైర్‌లెస్ చిప్‌ను, మెరుగైన నెట్‌వర్క్ కనెక్షన్ కోసం C2 సెల్యులార్ మోడమ్‌ను ఉపయోగించారు.

గేమింగ్, హెవీ పనుల సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు వేపర్ ఛాంబర్ థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను మెరుగుపరిచారు. మునుపటి ఐఫోన్ 17 ప్రో కంటే ఇది 3 రెట్లు పెద్ద సర్ఫేస్ ఏరియాను కలిగి ఉండి, 40 శాతం వరకు సస్టైన్డ్ పర్‌ఫార్మెన్స్‌ను ఇస్తుంది.

56
అత్యంత భారీ బ్యాటరీ లైఫ్, iOS 27
Image Credit : Apple.com

అత్యంత భారీ బ్యాటరీ లైఫ్, iOS 27

ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ మోడల్స్ బ్యాటరీ విషయంలో ఆపిల్ పెద్ద మార్పు చేసింది. eSIM-ఓన్లీ మోడల్స్ 45 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ సమయాన్ని ఇస్తాయి. కేవలం 5 నిమిషాల వైర్డ్ చార్జింగ్‌తో 7 గంటల వీడియో ప్లేబ్యాక్ వస్తుంది. పూర్తిగా చార్జ్ చేస్తే 30 గంటల వరకు వినియోగించుకోవచ్చు.

ఈ ఫోన్‌లు iOS 27 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తాయి. ఇందులో నెక్స్ట్ జనరేషన్ యాపిల్ ఇంటెలిజెన్స్, అప్‌గ్రేడెడ్ 'సిరి AI' అందుబాటులోకి వచ్చాయి. సిరి AI మన పర్సనల్ కాంటెక్స్ట్‌ను అర్థం చేసుకుని మెసేజ్‌లు, ఈమెయిల్‌లు, ఫొటోలలో కావాల్సిన విషయాలను త్వరగా వెతికి పెడుతుంది. కెమెరాలో సిరి మోడ్ ద్వారా మన ముందున్న వస్తువుల సమాచారాన్ని తెలుసుకోవచ్చు. భద్రత కోసం డేటా ప్రాసెసింగ్ అంతా ఆన్-డివైస్, ప్రైవేట్ క్లౌడ్ కంప్యూట్ ద్వారానే జరుగుతుంది.

66
ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ధర ఎంత? ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటాయి?
Image Credit : Apple Hub | X

ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ధర ఎంత? ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటాయి?

పర్యావరణ హితంగా రూపొందించిన ఈ ఫోన్లలో 40 శాతం రీసైకిల్డ్ పదార్థాలను వాడారు. బ్యాటరీలో 100 శాతం రీసైకిల్డ్ కోబాల్ట్, ఎన్‌క్లోజర్‌లో 85 శాతం రీసైకిల్డ్ అల్యూమినియం ఉపయోగించారు. 2030 నాటికి కార్బన్ న్యూట్రల్ సాధించే లక్ష్యంతో ఆపిల్ ఈ అడుగులు వేసింది.

ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ 256GB, 512GB, 1TB, 2TB స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అమెరికాలో దీని ప్రారంభ ధర $1,299 డాలర్లుగా నిర్ణయించారు. నెలకు $54.12 డాలర్ల చొప్పున 24 నెలల ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. భారతదేశం సహా 65 కంటే ఎక్కువ దేశాల్లో సెప్టెంబర్ 12 నుండి ప్రీ-ఆర్డర్లు ప్రారంభమై, సెప్టెంబర్ 18 నుండి విక్రయాలు షురూ అవుతాయి. ఇండియాలో ఆపిల్ ఐఫోన్ ప్రో మ్యాక్స్ ప్రారంభ ధర రూ. 1,79,900 గా ఉంది.

భారత్ లో ఆపిల్ ఐఫోన్ ప్రో మ్యాక్స్ వివిధ వేరియంట్ల ధరలు

256GB: Rs 1,79,900

512GB: Rs 2,04,900

1TB: Rs 2,54,900

2TB: Rs 3,29,900

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
గాడ్జెట్‌లు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
iPhone 18 Pro: ల్యాప్‌టాప్‌ల కంటే స్పీడ్.. 2nm A20 ప్రో చిప్‌తో ఆపిల్ ఐఫోన్ 18 ప్రో వచ్చేసింది భయ్యా.. ధర, ఫీచర్లు ఇవే
Recommended image2
iPhone 18 Pro vs 17 Pro: ఐఫోన్ 18 ప్రో vs ఐఫోన్ 17 ప్రో.. మైండ్ బ్లోయింగ్ అప్‌గ్రేడ్స్ ఇవే
Recommended image3
iPhone 18 Pro: ఐఫోన్ 18 ప్రో లాంచ్.. వేరియబుల్ అపెర్చర్ కెమెరా, ఏ20 ప్రో చిప్‌తో బిగ్ అప్‌గ్రేడ్స్
Related Stories
Recommended image1
Maruti Suzuki: మారుతి నుంచి మైండ్ బ్లాకింగ్ కారు.. రూ. 5 లక్షలకే 34KM మైలేజ్, 6 ఎయిర్‌బ్యాగ్స్
Recommended image2
iPhone 18 Pro: ల్యాప్‌టాప్‌ల కంటే స్పీడ్.. 2nm A20 ప్రో చిప్‌తో ఆపిల్ ఐఫోన్ 18 ప్రో వచ్చేసింది భయ్యా.. ధర, ఫీచర్లు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved