హాస్య నటుడు వేణుమాధవ్ అనారోగ్యం కారణంగా బుధవారం మృతి చెందారు. హాస్య నటుడిగా టాలీవుడ్ లో వేణు మాధవ్ చెరగని ముద్రవేశారు. సూర్య పేట జిల్లా కోదాడ అయన జన్మస్థలం. సినిమాల్లోకి రాకముందు మిమిక్రీ ఆర్టిస్టుగా స్టేజి షోలలో వేణుమాధవ్ పాల్గొనేవారు. 

అలా రవీంద్రభారతిలో వేణుమాధవ్ చేసిన ఓ కామెడీస్కిట్ అతడి జీవితాన్నే మార్చేసింది. ఆ షోకు ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి హాజరయ్యారు. వేణుమాధవ్ ఆ కార్యక్రమంలో 'గుల గుల గులాబ్ జామ్' అంటూ చెప్పిన డైలాగ్ ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డిలకు చాలా బాగా నచ్చింది.  

వెంటనే మా తదుపరి చిత్రంలో నటిస్తావా అని ఎస్వీ కృష్ణారెడ్డి వేణుమాధవ్ ని అడిగారు. అలా వేణుమాధవ్ కు 1996లో 'సంప్రదాయం ' చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఆ చిత్రానికి గాను వేణు మాధవ్ 70 వేలు పారితోషికం అందుకున్నారు. నటుడిగా వేణుమాధవ్ తొలి రెమ్యునరేషన్ అదే. 

ఆ తర్వాత వరుసగా అవకాశాలు రావడం, వేణుమాధవ్ హాస్యానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించడంతో బిజీ కమెడియన్ గా మారిపోయాడు. ఆ తర్వాతి కాలంలో వేణుమాధవ్ ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో హీరోగా హంగామా లాంటి చిత్రాల్లో నటించారు. 

 

related news

వేణుమాధవ్ మృతికి మహేష్ బాబు సంతాపం!

వేణుమాధవ్ జీవితాన్ని మార్చేసిన సంఘటన.. తొలి పారితోషికం ఎంతంటే!

మెగాస్టార్ కోసం రూల్ బ్రేక్ చేసిన వేణుమాధవ్!

'అప్పట్లో భుట్టో.. ఇప్పుడు ముషారఫ్'.. వేణుమాధవ్ మృతికి ప్రముఖుల సంతాపం!

బ్రేకింగ్: హాస్య నటుడు వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి విషమం!

బ్రేకింగ్: ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత!

బూతులు ఉన్నాయనే సినిమాలు చేయలేదు.. వేణుమాధవ్!

ఛాన్సుల కోసం ఎవరినీ అడుక్కోను.. వేణుమాధవ్ కామెంట్స్!

కాలు మీద కాలేసి కూర్చున్నానని.. ఆ స్టార్ హీరో.. : వేణుమాధవ్!

వేణుమాధవ్ యూ టర్న్ రోల్స్.. నల్లబాలు నల్ల తాచు లెక్క

అభిమానుల సందర్శనార్ధం వేణుమాధవ్ పార్థివదేహం.. రేపే అంత్యక్రియలు

వేణుమాధవ్ కి ఎంత ఆస్తి ఉందో తెలుసా..?

వేణుమాధవ్ ఇంటిపై ఉండే దర్శకుల పేర్లు ఎవరివంటే..?

వేణుమాధవ్‌‌ చెంపపై కొట్టిన సీనియర్ ఎన్టీఆర్

టీడీపీ కార్యాలయంలో పనిచేసిన వేణుమాధవ్

వేణుమాధవ్ ప్రత్యేకత ఇదీ: నల్గొండ నుండి హైద్రాబాద్ కు ఇలా...

వేణుమాధవ్.... ఆ కోరిక తీరకుండానే..