- Home
- Entertainment
- Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Mohan Babu: ఫిల్మ్ ఇండస్ట్రీలో ముక్కుసూటి మనిషి అని డైలాగ్ కింగ్ మోహన్ బాబుకు పేరుంది. ఎంతటి వారైనా.. ఆయన అనాలనుకున్న మాట అనేస్తాడు. ఈక్రమంలోనే ఓ ఈవెంట్ లో రాజమౌళి, రాఘవేంద్రరావుపై ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ మోహన్ బాబు ఏమన్నాడంటే?

మోహన్ బాబును సరదాగా రోస్ట్ చేసిన రాజమౌళి..
తెలుగు చిత్రసీమలో నటులకు, దర్శకులకు మధ్య ఉండే ఆత్మీయ అనుబంధం గురించి వేరే చెప్పక్కర్లేదు. పెద్ద వేదికలపై ఒకరినొకరు సరదాగా ఆటపట్టించుకోవడం, పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం ప్రేక్షకులను ఎంతో అలరిస్తుంది. అలాంటి ఒక వేదికపై దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుల మధ్య జరిగిన ఒక సరదా సంభాషణ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది.
రాజమౌళి కామెంట్స్:
వేదికపై రాజమౌళి మాట్లాడుతుండగా మోహన్ బాబుపై సరదా కామెంట్స్ చేశారు. "మోహన్ బాబు గారికి చాలా గర్వం అండి! ఆయనను మించిన ఆర్టిస్ట్ లేడని ఆయన భావిస్తుంటారు... అది నిజం కూడా!" అంటూ పొగుడుతూనే చమత్కారంగా వ్యాఖ్యానించారు. రాజమౌళి వ్యాఖ్యలకు వేదికపై ఉన్నవారితో పాటు ప్రేక్షకులు కూడా నవ్వుల్లో మునిగిపోయారు.
మోహన్ బాబు మాస్ రిప్లై
రాజమౌళి కామెంట్స్‌కు మోహన్ బాబు తనదైన మార్క్ పంచ్‌తో సమాధానమిచ్చారు. తనకు పొగరు ఉందనే వ్యాఖ్యలపై స్పందిస్తూ, సీనియర్ దర్శకుడు కె. రాఘవేంద్రరావుతో తనకున్న పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. '' రాజమౌళి నాకు పొగరు అన్నాడు.. ఏమయ్య రాజమౌళి.. నాకు కాదు పొగరు.. మీ గురువు రాఘవేంద్రరావుకి పొగరు, అహంకారం ఎక్కువ.. వరుస హిట్లు కొడుతున్న టైమ్ లో అది చూపించాడు.. అంటూ ఒకప్పుడు జరిగిన ఓ సన్నివేశం గురించి వివరించాడు మోహన్ బాబు.
మోహన్ బాబు - రాఘవేంద్ర రావు మధ్య గొడవ..
"సింహబలుడు సినిమా షూటింగ్ టౌమ్ లో అన్నయ్య సీనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ఫైట్ సీన్స్ చేస్తున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. అప్పటికే షూటింగ్ వల్ల అలసిపోయి కళ్లు వాసిపోయేవి. అప్పట్లో రాఘవేంద్రరావు గారు వరుస హిట్లు కొడుతూ బాగా పొగరుగా, అహంకారంతో ఉండేవారు (సరదాగా). ఒకసారి షూటింగ్‌లో నాకు బాగా తలనొప్పిగా ఉండి, కళ్లు వాసిపోయి ఉంటే... మరో దర్శకుడు కోదండరామిరెడ్డితో 'కొంచెం రిస్కీ షాట్స్ కాకుండా మెల్లగా చేయమని చెప్పురా' అని అన్నాను. అయినా కూడా రాఘవేంద్రరావు గారు భయంకరమైన రిస్కీ షాట్ పెట్టారు."
మోహన్ బాబు మాట్లాడుతూ..
"ఏమండీ! ఇంత రిస్కీ షాట్ పెట్టారేంటి? అని నేను అడిగితే... 'ప్రతిదీ ఆర్టిస్టుకి చెప్పాలా? చేస్తావా చేయవా?' అని సీరియస్‌గా అన్నారు. దాంతో నాకు కోపం వచ్చి, హెల్మెట్‌తో పాటు నా విగ్గు తీసి కింద కొట్టేసి 'పోవయ్యా.. నువ్వు నాకు షూటింగ్ ఇవ్వద్దు! నేను మా ఊరికెళ్లి వ్యవసాయం చేసుకుంటా' అని అక్కడి నుండి వెళ్ళిపోయాను. అసలు నేను నా హెల్మెట్ తీసి కొట్టానో, విగ్గు తీసి కొట్టానో ఆయనకు కూడా అర్థం కాలేదు!" అంటూ మోహన్ బాబు సంచలన కామెంట్స్ చేశారు. అయితే ఇదంతా మోహన్ బాబు సరదాగా నవ్వుతూ చెప్పడంతో.. అక్కడే ఉన్న రాఘవేంద్రరావు తో పాటు రాజమౌళి కూడా ఎంజాయ్ చేశారు.

