వేణుమాధవ్... ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కమెడియన్ గా తనకంటూ గుర్తింపు సంపాదించుకున్న... వేణుమాధవ్ బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన... ఈ రోజు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అయితే... వేణుమాధవ్ కి ఎప్పటి నుంచో ఓ ఓరిక ఉండేదట. ఆ కోరిక తీరకుండానే ఆయన తుదిశ్వాస విడిచారంటూ... ఆయన కుటుంబసభ్యులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కమెడియన్ గా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న వేణుమాధవ్.. రాజకీయాల్లో  కూడా రాణించాలని అనుకున్నారు. సినిమాల్లోకి రాకముందే.. టీడీపీ ఆఫీసులో ఆయన పనిచేశాడు.  తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలకు అవకాశం దక్కించుకున్నాడు. ఆ తర్వాత తన టాలెంట్​తో విశ్వవిఖ్యాత నటుడు ఎన్టీఆర్​ దృష్టిలో పడ్డాడు.హైదరాబాద్‌లోని తెదేపా కార్యాలయంలో టెలిఫోన్ ఆపరేటర్‌గా, అనంతరం టీడీఎల్పీ కార్యాలయంలో లైబ్రరీ అసిస్టెంటుగా పనిచేశాడు. కొన్నాళ్లు ఎన్టీఆర్​ ఇంట్లో అసిస్టెంట్‌గానూ పనిచేశాడు. నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశాడు.

ఎప్పటికైనా అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నుంచి పోటీ చేసి..ఎమ్మెల్యేగా విజయం సాధించాలనేది ఆయన చిరకాల కోరిక.  విషయాన్ని చాలా సార్లు ఆయన మీడియా ముందు బహిరంగంగానే చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ ఎమ్మెల్యే సీటుకి ఆయన నామినేషన్ కూడా వేశారు. అయితే... ఎమ్మెల్యే అవ్వాలన్న ఆయన కోరిక తీరకుండా కన్నుమూయడం విషాదం.
 

related news

వేణుమాధవ్ మృతికి మహేష్ బాబు సంతాపం!

వేణుమాధవ్ జీవితాన్ని మార్చేసిన సంఘటన.. తొలి పారితోషికం ఎంతంటే!

మెగాస్టార్ కోసం రూల్ బ్రేక్ చేసిన వేణుమాధవ్!

'అప్పట్లో భుట్టో.. ఇప్పుడు ముషారఫ్'.. వేణుమాధవ్ మృతికి ప్రముఖుల సంతాపం!

బ్రేకింగ్: హాస్య నటుడు వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి విషమం!

బ్రేకింగ్: ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత!

బూతులు ఉన్నాయనే సినిమాలు చేయలేదు.. వేణుమాధవ్!

ఛాన్సుల కోసం ఎవరినీ అడుక్కోను.. వేణుమాధవ్ కామెంట్స్!

కాలు మీద కాలేసి కూర్చున్నానని.. ఆ స్టార్ హీరో.. : వేణుమాధవ్!

వేణుమాధవ్ యూ టర్న్ రోల్స్.. నల్లబాలు నల్ల తాచు లెక్క

అభిమానుల సందర్శనార్ధం వేణుమాధవ్ పార్థివదేహం.. రేపే అంత్యక్రియలు

వేణుమాధవ్ కి ఎంత ఆస్తి ఉందో తెలుసా..?

వేణుమాధవ్ ఇంటిపై ఉండే దర్శకుల పేర్లు ఎవరివంటే..?

వేణుమాధవ్‌‌ చెంపపై కొట్టిన సీనియర్ ఎన్టీఆర్

టీడీపీ కార్యాలయంలో పనిచేసిన వేణుమాధవ్

వేణుమాధవ్ ప్రత్యేకత ఇదీ: నల్గొండ నుండి హైద్రాబాద్ కు ఇలా...

వేణుమాధవ్.... ఆ కోరిక తీరకుండానే..