ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ బుధవారం నాడు అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతోమంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన మరణ వార్తతో ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది.

గతంలో తన సినిమా షూటింగ్ అనుభవాల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వేణుమాధవ్.. తానొక సినిమా షూటింగుకి వెళ్లినప్పుడు ఓ పెద్ద హీరో తనను పిలిచారని.. ఏవయ్యా నువ్వు కాలు మీద కాలు వేస్తావట అని అడిగారట. ఎవరు చెప్పారని వేణుమాధవ్ అడిగేలోపు నేను నిరూపిస్తా అంటూ అతడు ఎవరికో ఫోన్ చేయబోయారట. ఇంతలో ఆయన్ని అడ్డుకుని విషయమేంటో స్పష్టంగా చెప్పండి సార్ అని వేణుమాధవ్ అడిగారట.

దానికి ఆయన మళ్లీ.. 'నువ్వు కాలుమీద కాలేసుకుని కూర్చుకుంటావట గదా' అని అడిగినట్లు.. దానికి వెంటనే ''నేను ఎవరి కాలుమీద కాలేసి కూర్చోను సార్ .. నా కాలుమీద నా కాలేసుకుని కూర్చుంటాను. అదెలా తప్పవుతుందని'' సదరు స్టార్ హీరోని వేణుమాధవ్ ప్రశ్నించారట. దీంతో ఆయన సైలెంట్ గా ఉండిపోయారని వేణుమాధవ్ చెప్పుకొచ్చారు. తనకు కాలు మీద కాలేసుకొని కూర్చోవడం అలవాటని వేణుమాధవ్ అన్నారు.

ఇక తను ఉన్న చోటు నుండి షూటింగ్ కి వెళ్లడానికి కొంత ఆలస్యం అవుతుందని.. ఆ విషయాన్ని ముందే చెప్తానని.. ఉద్దేశపూర్వకంగా ఆలస్యంగా వెళ్లనని చెప్పారు. స్టార్ హీరోలను కూడా వెయిట్ చేయిస్తారనే మాటలో నిజం లేదని గతంలో వేణుమాధవ్ చెప్పారు. 

బ్రేకింగ్: హాస్య నటుడు వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి విషమం!

బూతులు ఉన్నాయనే సినిమాలు చేయలేదు.. వేణుమాధవ్!

ఛాన్సుల కోసం ఎవరినీ అడుక్కోను.. వేణుమాధవ్ కామెంట్స్!