కమెడియన్ వేణు మాధవ్ మరణం టాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు అభిమానులను షాక్ కి గురి చేసింది. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఈ సీనియర్  కమెడియన్ బుధవారం చిక్కిత్స పొందుతూ తుది శ్వాసను విడిచారు.

ఆయన కడసారి చూసేందుకు కుటుంబ సభ్యులు సినీ ప్రముఖులు స్వగృహానికి బయలుదేరారు. ఇక వేణుమాధవ్ మృతిని నిర్దారించిన ఆయన సోదరుడు గోపాలకృష్ణ 2గంటలకు  వేణుమాధవ్ మృత దేహాన్ని కాప్రా Hb కాలనీ  మంగాపురంకి తీసుకురానున్నారు వేణుమాధవ్ మృతితో కాప్రా లో విషాధచాయలు అలుముకున్నాయి. 

ఇక రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు ఫిల్మ్ చాంబర్ కి వేణుమాధవ్ మృతదేహాన్ని తీసుకురానున్నారు. అభిమానుల సందర్శనార్ధం రెండున్నర గంటల వరకు ఉంచి  మౌలాలిలో  అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వేణు మాధవ్ మృతి పట్ల పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.