హైదరాబాద్:  హైద్రాబాద్ టీడీపీ కార్యాలయంలో సినీ నటుడు వేణుమాదవ్ కొంత కాలం పాటు పనిచేశారు. టీడీపీ నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో టీడీపీ కార్యాలయం హిమాయత్ నగర్‌లో ఉన్న సమయంలో  వేణుమాధవ్  అక్కడ పనిచేశారు. 

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోని ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోదాడలో వేణు మాధవ్ అక్షరాస్యత ఉద్యమం (చదువు వెలుగు) లో చురుకుగా పాల్గొన్నారు. ఆ సమయంలోనే జిల్లా వ్యాప్తంగా వేలాది ప్రదర్శనల్లో ఆయన పాల్గొన్నారు.

ఆ సమయంలో కోదాడ ఎమ్మెల్యేగా చందర్ రావు ఉన్నారు.  తాను చదువుకొన్న కాలేజీలో వేణు మాధవ్ నిర్వహించిన మిమిక్రీ కార్యక్రమాన్ని చూసిన స్థానిక ఎమ్మెల్యే చందర్ రావు మహానాడులో పాల్గొనే అవకాశాన్ని కల్పించారు. ఈ సమయంలో వేణు మాధవ్ ప్రదర్శన టీడీపీ నేతలను ఆకట్టుకొంది. సీనియర్ ఎన్టీఆర్ వేణుమాధవ్ ప్రదర్శనకు ముగ్గుడయ్యారు. ఈ కారణంగానే వేణుమాధవ్ కు టీడీపీ కార్యాలయంలో పనిచేసే అవకాశం దక్కింది.

ఆనాడు హిమాయత్‌నగర్ లో  ఉన్న టీడీపీ కార్యాలయంలో టెలిఫోన్ ఆపరేటర్‌గా వేణు మాధవ్ చేరాడు. ఆ తర్వాత టీడీఎల్పీ కార్యాలయంలో లైబ్రరీ అసిస్టెంట్ గా  కొంత కాలం పాటు పనిచేశాడు. ఆ తర్వాత సీనియర్ ఎన్టీఆర్ ఇంట్లో కొంతకాలం పాటు పనిచేశారు.

1994లో టీడీపీ ప్రభుత్వం ఏపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. 1995లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో ఎలిమినేటి మాధవ రెడ్డి హోం, సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు. ఈ సమయంలో హోంమంత్రి ద్వారా వేణు మాధవ్ సినీ రంగ ప్రవేశం చేశారని చెబుతారు.

ఆ తర్వాత సినీ రంగంలో తనదైన నటనతో వేణుమాధవ్ గుర్తింపు తెచ్చుకొన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీ తరపున ప్రచారం చేసేవారు.  ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోదాడ అసెంబ్లీ స్థానం నుండి గత ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన నామినేషన్ కూడ దాఖలు చేశారు. చివరి నిమిషంలో నామినేషన్ ను ఉపసంహరించుకొన్నారు.

సంబంధిత వార్తలు

 

వేణుమాధవ్‌ మరణం ఇండస్ట్రీకి తీరని లోటు.. రాజశేఖర్ కామెంట్స్!

వేణుమాధవ్ మృతికి మహేష్ బాబు సంతాపం!

వేణుమాధవ్ జీవితాన్ని మార్చేసిన సంఘటన.. తొలి పారితోషికం ఎంతంటే!

మెగాస్టార్ కోసం రూల్ బ్రేక్ చేసిన వేణుమాధవ్!

'అప్పట్లో భుట్టో.. ఇప్పుడు ముషారఫ్'.. వేణుమాధవ్ మృతికి ప్రముఖుల సంతాపం!

బ్రేకింగ్: హాస్య నటుడు వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి విషమం!

బ్రేకింగ్: ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత!

బూతులు ఉన్నాయనే సినిమాలు చేయలేదు.. వేణుమాధవ్!

ఛాన్సుల కోసం ఎవరినీ అడుక్కోను.. వేణుమాధవ్ కామెంట్స్!

కాలు మీద కాలేసి కూర్చున్నానని.. ఆ స్టార్ హీరో.. : వేణుమాధవ్!

వేణుమాధవ్ యూ టర్న్ రోల్స్.. నల్లబాలు నల్ల తాచు లెక్క

అభిమానుల సందర్శనార్ధం వేణుమాధవ్ పార్థివదేహం.. రేపే అంత్యక్రియలు

వేణుమాధవ్ కి ఎంత ఆస్తి ఉందో తెలుసా..?

వేణుమాధవ్ ఇంటిపై ఉండే దర్శకుల పేర్లు ఎవరివంటే..?