సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు వేణుమాధవ్. బ్రహ్మానందం తరువాత ఆ స్థాయిలో ఫేమస్ అయిన నటుడు వేణుమాధవ్.. కానీ సడెన్ గా ఆయన సినిమాలకు దూరమయ్యారు.

ఆ తరువాత ఆయన బాగా చిక్కిపోవడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి బాలేదంటూ వార్తలు వచ్చేవి. ఆ సమయంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సినిమాల్లో ఎందుకు నటించలేదో క్లారిటీ ఇచ్చారు.

అవకాశాలు వచ్చినా.. కొన్ని సినిమాలు తనే వదులుకున్నానని చెప్పారు వేణుమాధవ్. అలానే కొంతమంది తనను అవాయిడ్ చేశారని అన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో బూతు సినిమాలు ఎక్కువయ్యాయని.. అవి ఫ్యామిలీతో చూసే సినిమాలు కావని అలాంటి సినిమాల్లో అవకాశాలు వచ్చాయని అందుకే సినిమాలు చేయలేదని అన్నారు.

తన పిల్లలు ఎదుగుతున్నారని.. వారు ఏంటి ఇలాంటి సినిమాలు చేస్తున్నావని అడిగితే సమాధానాలు చెప్పలేనని అందుకే సినిమాలు చేయలేదని చెప్పుకొచ్చారు. తెలియని పరిస్థితుల్లో గతంలో అలాంటి సినిమాలు చేశాను.. కానీ ఇప్పుడు కథలు చూసుకొని బూతులు ఉంటే పక్కకి పెట్టేస్తున్నానని  ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 

బ్రేకింగ్: హాస్య నటుడు వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి విషమం!