MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Sapthami Gowda: బాడీ పార్ట్స్ జూమ్‌ చేయడంపై `కాంతార` నటి ఫైర్‌.. ఎన్టీఆర్‌, నాగార్జున హీరోయిన్ల రియాక్షన్‌ ఇదే

Sapthami Gowda: బాడీ పార్ట్స్ జూమ్‌ చేయడంపై `కాంతార` నటి ఫైర్‌.. ఎన్టీఆర్‌, నాగార్జున హీరోయిన్ల రియాక్షన్‌ ఇదే

Sapthami Gowda: హీరోయిన్ల ప్రైవేట్‌ పార్ట్స్ ని జూమ్‌ చేయడంపై `కాంతార` హీరోయిన్‌, ఎన్టీఆర్‌ `డ్రాగన్‌` హీరోయిన్‌, నాగార్జున, రవితేజ హీరోయిన్‌ ఫైర్‌ అయ్యారు. దీన్ని ఖండిస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 04 2026, 08:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
హీరోయిన్లని అసభ్యంగా ఫోటోలు తీయడంపై హీరోయిన్లు ఫైర్‌
Image Credit : latestly

హీరోయిన్లని అసభ్యంగా ఫోటోలు తీయడంపై హీరోయిన్లు ఫైర్‌

కన్నడ హీరోయిన్లు కలిసి గళమెత్తారు. తమని ఈవెంట్లలో అసభ్యంగా చూపించడంపై మండిపడ్డారు. తమ ప్రతిభని కాకుండా తమ శరీర భాగాలను హైలైట్‌ చేసి చూపించడంపై ఫైర్‌ అయ్యారు. ఇలాంటి తగ్గించాలని తెలిపారు. అసభ్యకరమైన యాంగిల్‌లో జూమ్‌ చేయడంపై హీరోయిన్లు అసహనం వ్యక్తం చేశారు. `కాంతార` హీరోయిన్‌ సప్తమీ గౌడ ఈ సమస్యని లేవనెత్తగా దీనికి ఎన్టీఆర్‌ హీరోయిన్‌ రుక్మిణి వసంత్‌, నాగార్జున హీరోయిన్‌ ఆషికా రంగనాథ్‌, అలాగే దివ్య సపోర్ట్ గా నిలిచారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఈవెంట్లలో హీరోయిన్ల బాడీ పార్ట్స్ పైనే ఫోకస్‌ చేస్తున్నారు
Image Credit : Sapthami Gowda FB

ఈవెంట్లలో హీరోయిన్ల బాడీ పార్ట్స్ పైనే ఫోకస్‌ చేస్తున్నారు

ఇంతకి `కాంతార` అమ్మడు సప్తమి గౌడ ఏం చెబుతుందంటే, సినిమా ఇండస్ట్రీలో మహిళా నటులుగా మేం ఎప్పుడూ రిపీట్‌ అవుతున్న ఒక సమస్యపై నిలబడాలనుకుంటున్నాం. పబ్లిక్‌ ఈవెంట్లలో హీరోయిన్లను అసభ్యకరమైన యాంగిల్స్ లో ఫోటోలు, వీడియోలు తీస్తున్నారు. మా పనిమీద కంటే బాడీ పార్ట్స్ పైనే ఫోకస్‌ పెడుతున్నారు. అనవసరంగా జూమ్‌ చేసి ఫోటోలు, వీడియోలు తీస్తున్నారు. వీటిని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కొంత మంది వ్యక్తులు ఇలా ప్రవర్తించడం సరికాదు, ఇది మమ్మల్ని అగౌరవపరిచినట్టే అవుతుంది. దీన్ని సహించేది లేదు. అదే సమయంలో ఇది ఆమోదయోగ్యం కాదు.

34
అస్సలు సహించకూడదు
Image Credit : Instagram

అస్సలు సహించకూడదు

మేం యాక్టింగ్‌ చేయడం కోసమే ఇక్కడున్నాం. మేమంతా సినిమా కోసం పనిచేస్తున్నాం. కావాలని జూమ్‌ చేసి ఫోటోలు తీయడాన్ని, అసభ్యకరమైన యాంగిల్స్ లో బాడీ పార్ట్స్ ని ఫోటోలు, వీడియోలు తీయడాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది సాధారణ విషయం కాదు, సహించే విషయం అస్సలే కాదు. ఈవెంట్లకి వచ్చే ఫొటోగ్రాఫర్లు ఇందుకు సంబంధించి రెస్పెక్ట్ ఇవ్వాలని, డిగ్నిటీ మెయింటేన్‌ చేయాలని కోరుకుంటున్నాం. మహిళలను అసభ్యంగా చిత్రీకరించే, ప్రొజెక్ట్ చేసే విషయంలో క్రూరంగా వ్యవహరించే కొంత మందికి వ్యతిరేకంగా నిలబడాలి. ఈ విషయంలో మాకు మీడియా ఫ్రెండ్స్ సపోర్ట్ కావాలి. ఇది సరైన పద్ధతి కాదు, హీరోయిన్లకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అసభ్యకరంగా ఫొటోలు తీసేవాళ్లని అడ్డుకోవాలి` అని సప్తమి గౌడ తెలిపారు. 

44
సప్తమీ గౌడకి రుక్మిణి వసంత్‌, ఆషికా రంగనాథ్‌ సపోర్ట్
Image Credit : instagram/@rukmini_vasanth

సప్తమీ గౌడకి రుక్మిణి వసంత్‌, ఆషికా రంగనాథ్‌ సపోర్ట్

ఈ మేరకు ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఇది వైరల్‌గా మారింది. దీనికి `కాంతార 2` హీరోయిన్‌, ఇప్పుడు ఎన్టీఆర్‌తో `డ్రాగన్‌` చేస్తున్న రుక్మిణి వసంత్‌ సపోర్ట్ గా నిలిచారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, మహిళలకు రెస్పెక్ట్ ఉండాలని, ఇలాంటి విషయాలను ఉపేక్షించేది లేదని తెలిపారు. అలాగే నాగార్జునతో `నా సామిరంగ` చేసిన హీరోయిన్‌ ఆషికా రంగనాథ్‌ కూడా సపోర్ట్ చేస్తూ సప్తమి పోస్ట్ ని తన సోషల్‌ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేసింది. దీనికి హీరోయిన్ల నుంచి సపోర్ట్ పెరగడం విశేషం. సప్తమి గౌడ ఇటీవల తెలుగులో `తమ్ముడు` చిత్రంలో నటించింది. ఇందులో నితిన్‌కి లవ్‌ ఇంట్రెస్ట్ గా కనిపించింది. కానీ సినిమా ఆడలేదు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
కత్రినా కైఫ్‌పై బాడీ షేమింగ్.. హీరోయిన్ తరపున స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నది ఎవరో తెలుసా ?
Recommended image2
Suriya Jyotika Record: విజయ్ - అజిత్ రికార్డును బ్రేక్ చేసిన సూర్య - జ్యోతికల వెడ్డింగ్ వీడియో!
Recommended image3
Megastar: చిరంజీవిని పరిచయం చేసిన పాపానికి.. సీనియర్ నటుడు అవకాశాలు కోల్పోయాడా? రెమ్యునరేషన్ నష్టపోయాడా? నిజమెంత?
Related Stories
Recommended image1
Rashmika Mandanna: పిల్లలపై రష్మిక కామెంట్‌, ఇప్పటికే తల్లి ఫీలింగ్‌.. త్వరలో సినిమాలకు గుడ్‌ బై?
Recommended image2
Rakshit Shetty: ఒంటరిగానే ఉండటమే ఇష్టం.. విజయ్‌ దేవరకొండతో రష్మిక పెళ్లి తర్వాత రక్షిత్‌ శెట్టి షాకింగ్‌ రియాక్షన్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved