MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Rajamouli: ఏంటి.! జక్కన్న కూడా కాపీ బ్యాచ్‌నా.? ఆ సీనియర్ డైరెక్టర్‌తో పోల్చుతూ నెట్టింట చర్చ

Rajamouli: ఏంటి.! జక్కన్న కూడా కాపీ బ్యాచ్‌నా.? ఆ సీనియర్ డైరెక్టర్‌తో పోల్చుతూ నెట్టింట చర్చ

Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి తన సినిమాల్లో అత్యాధునిక సాంకేతికతను వాడుతూ విజువల్ వండర్స్ సృష్టిస్తుంటారు. అయితే, రాజమౌళి, శంకర్ కంటే ముందే టెక్నాలజీని వినూత్నంగా ఉపయోగించిన దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి..  

2 Min read
Author : Pavithra D
Published : Mar 04 2026, 08:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
విజువల్ వండర్‌కు కేరాఫ్..
Image Credit : SS Rajamouli\Twitter

విజువల్ వండర్‌కు కేరాఫ్..

ప్రస్తుతం ఇండియన్ సినిమాలో విజువల్ వండర్ అనే మాటకు కేరాఫ్ అడ్రస్ ఎస్.ఎస్. రాజమౌళి. ఆయన తన సినిమాల్లో వాడే సాంకేతికత, గ్రాఫిక్స్ ప్రేక్షకులను ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్తాయి. అయితే, రాజమౌళి, శంకర్ లాంటి అగ్ర దర్శకుల కంటే ముందే తెలుగు తెరపై టెక్నాలజీని వినూత్నంగా పరిచయం చేసిన ఘనత దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డికి దక్కుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ముందే ఊహించిన ఎస్.వి. కృష్ణారెడ్డి
Image Credit : Instagram

ముందే ఊహించిన ఎస్.వి. కృష్ణారెడ్డి

కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరు ఎస్.వి. కృష్ణారెడ్డి. అప్పట్లోనే తన సినిమాల్లో ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్‌ను అద్భుతంగా జోడించేవారు. ముఖ్యంగా ఆయన దర్శకత్వంలో వచ్చిన 'ఘటోత్కచుడు' సినిమా దీనికి ఒక నిదర్శనం. ఆ కాలంలో అందుబాటులో ఉన్న పరిమిత వనరులతోనే రోబో పాత్రను సృష్టించి.. గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. నేడు శంకర్ 'రోబో' సినిమాలో చూపించిన కాన్సెప్ట్‌ను ఎస్.వి. కృష్ణారెడ్డి దశాబ్దాల క్రితమే టచ్ చేశారని నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు.

Related Articles

Related image1
వెంకటేష్ వద్దన్నాడు.. బాలయ్య సై అన్నాడు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీ హిట్.. ఆ సినిమా ఏదంటే
Related image2
'సిగరెట్ తాగుతూ స్టైల్‌గా..! ఆ ఒక్క సీన్ కోసం ఏకంగా 50 టేక్‌లు తీసుకున్న రజినీకాంత్..'
35
సాంకేతికతలో దూరదృష్టి
Image Credit : youtube/@ScreenRantPlus

సాంకేతికతలో దూరదృష్టి

రాజమౌళి తన సినిమాల్లో ఎమోషన్స్‌తో పాటు హై-ఎండ్ టెక్నాలజీని వాడుతుంటారు. కానీ, ఎస్.వి. కృష్ణారెడ్డి కథ, మాటలు, సంగీతం, దర్శకత్వం వంటి అన్ని విభాగాల్లోనూ స్వయంగా పని చేస్తూనే సాంకేతిక ప్రయోగాలు చేసేవారు. ఆయన సినిమాల్లోని హాస్యం, కుటుంబ విలువలతో పాటు టెక్నాలజీని సామాన్యులకు అర్థమయ్యేలా చూపడం ఆయన ప్రత్యేకత.

45
'కాపీ బ్యాచ్' అని అంటుంటే
Image Credit : facebook.com/SSRajamouli

'కాపీ బ్యాచ్' అని అంటుంటే

సోషల్ మీడియాలో కొందరు ట్రోలర్స్ రాజమౌళిని 'కాపీ బ్యాచ్' అని అంటుంటే.. వారికి ఇచ్చిపడేస్తూ ఆయన వాడుతున్న టెక్నాలజీ, ఐడియాలకు పునాది ఎస్.వి. కృష్ణారెడ్డి వంటి దర్శకులే వేశారని మరొకొందరు వ్యాఖ్యానిస్తున్నారు. రాజమౌళి గొప్ప దర్శకుల్లో ఒకరంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

55
మరో ప్రయోగానికి సిద్ధం
Image Credit : Rajamouli\Twitter

మరో ప్రయోగానికి సిద్ధం

చాలా కాలం తర్వాత ఎస్.వి. కృష్ణారెడ్డి మళ్ళీ మెగా ఫోన్ పట్టుకుని 'వేదవ్యాస్' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అప్పట్లో ఆయన చేసిన ప్రయోగాలు నేటి తరం దర్శకులకు ఒక పాఠం లాంటివి. సాంకేతిక వసతులు అంతగా లేని కాలంలోనే విజువల్ వండర్స్ సృష్టించిన ఆయన సృజనాత్మకత నిజంగా అభినందనీయం. రాజమౌళి తన మహేష్ బాబు సినిమా వారణాసి కోసం అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీని వాడుతున్న తరుణంలో, ఈ పాత జ్ఞాపకాలు మళ్ళీ చర్చకు వస్తున్నాయి.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వినోదం
తెలుగు సినిమా
ఎస్.ఎస్. రాజమౌళి

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijayakanth: విజయ్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిన కెప్టెన్.. కారణం తెలిస్తే సెల్యూట్‌ చేయాల్సిందే
Recommended image2
Kotha Cinema: హైదరాబాద్‌తో పనిలేదు, లోకల్ ఆర్టిస్ట్ లతో `కొత్త సినిమా`.. సరికొత్త ప్రయోగం
Recommended image3
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Related Stories
Recommended image1
వెంకటేష్ వద్దన్నాడు.. బాలయ్య సై అన్నాడు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీ హిట్.. ఆ సినిమా ఏదంటే
Recommended image2
'సిగరెట్ తాగుతూ స్టైల్‌గా..! ఆ ఒక్క సీన్ కోసం ఏకంగా 50 టేక్‌లు తీసుకున్న రజినీకాంత్..'
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved