దివంగత నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

అతను కథగా మారితే 'కథానాయకుడు', అతను ఓ చరిత్ర అయితే 'మహానాయకుడు' అంటూ ఇటీవల సినిమాకు సంబంధించిన పోస్టర్లు విడుదల చేశారు. 
తొలిభాగం జనవరి 9న, రెండో భాగం జనవరి 24న విడుదల చేయనున్నారు.

 తాజాగా సినిమాకు సంబంధించిన మరొక పోస్టర్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈరోజు చిత్రబృందం ఎన్టీఆర్ బయోపిక్ లో శ్రీదేవి పాత్రలో నటిస్తోన్న రకుల్ ప్రీత్ లుక్ ని విడుదల చేసింది. ఆకుచాటు పిందె తడిచే సాంగ్ లో శ్రీదేవి కట్టు, బొట్టు ఆడియన్స్ ఇప్పటికి మర్చిపోలేరు. 

ఇప్పుడు అటువంటి కాస్ట్యూమ్స్ తో ఉన్న రకుల్ గెటప్ ని విడుదల చేశారు. రకుల్ గెటప్ అచ్చం శ్రీదేవిని తలపిస్తోంది. మరి శ్రీదేవి పాత్రలో ఆమె ఎంతగా జీవించిందో చూడాలి!

 

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్2: 'మహానాయకుడు'!

'ఎన్టీఆర్' బయోపిక్ టైటిల్.. @కథానాయకుడు!

రెండు భాగాలుగా 'ఎన్టీఆర్' బయోపిక్!