ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ నిర్విరామంగా సాగుతోంది. దర్శకుడు క్రిష్ ప్రాజెక్టు కోసం పక్కా ప్రణాళికలతో షెడ్యూల్స్ ప్లాన్ చేసుకొని సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రీసెంట్ గా ఎన్టీఆర్ - ఏఎన్నార్ కి సంబందించిన కొన్ని సన్నివేశాలను షూట్ చేశారు. 

బాలకృష్ణ తన తండ్రి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సన్నివేశంలో భాగంగా బాలయ్య రిక్షా తొక్కుతూ ఉన్న ఫొటో బయటకు వచ్చింది. 1977 కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరదలతో చాలా నష్టపోయింది. జన వ్యవస్ధ చిన్నాభిన్నమైంది. దీంతో సీనియర్ ఏన్టీఆర్ అక్కినేని నాగేశ్వరరావు ఏపి వరద బాధితుల కోసం రిక్షా తొక్కారు. 

కృష్ణా జిల్లా దివి సీమలో అగ్రనటులిద్దరు పలు రకాలుగా విరాళాలు సేకరించారు. అందుకు సంబందించిన సన్నివేశాలను క్రిష్ ఇప్పుడు తెరకెక్కిస్తున్నాడు. అప్పుడు ఎన్టీఆర్ ఏ విధమైన డ్రెస్సింగ్ స్టైల్ తో ఉన్నారో అలానే బాలకృష్ణ గెటప్ ఉండడం ఆకట్టుకుంటోంది. ఇక సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలని అనుకుంటున్నారు. సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.