దివంగత నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్.. ఎన్టీఆర్ బయోపిక్ ని రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల  ముందుకు రానుంది. ఈ సినిమా చంద్రబాబు నాయుడిగా రానా, ఏఎన్నార్ గా సుమంత్ కనిపించనున్నారు.

ఆ పాత్రలో వారి లుక్స్ బయటకొచ్చినప్పుడు అభిమానుల సంతోషానికి అవధుల్లేవు. తాజాగా ఈ సినిమా కల్యాణ్ రామ్ లుక్ ని రివీల్ చేస్తూ చిత్రబృందం ఓ పోస్టర్ ని విడుదల చేసింది.

ఇందులో ఎన్టీఆర్ పాత్రలో నటిస్తోన్న బాలకృష్ణ ఓ కుర్చీలో కూర్చొని ఉండగా.. హరికృష్ణ పాత్రధారి కల్యాణ్ రామ్ అతడికి ఏదో చెబుతున్నట్లు కనిపిస్తుంది. కల్యాణ్ రామ్ గెటప్ అచ్చం తన తండ్రిని తలపిస్తోంది. తన తండ్రి ఎన్టీఆర్ జీవితంలో హరికృష్ణ కీలకపాత్ర పోషించారు.

ఎన్టీఆర్ చైతన్య రథానికి వారధిగా వ్యవహరించారు కల్యాణ్ రామ్. సినిమాలో ఆయన పాత్రకి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. హరికృష్ణ మరణం తరువాత ఆయన పాత్రలో కల్యాణ్ రామ్ నటించడం ఎమోషనల్ గా ఆడియన్స్ కి మరింతగా కనెక్ట్ అవుతుంది.