MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • విజయ్ దేవరకొండ కెరీర్‌లో టాప్ 10 సినిమాలు.. వంద కోట్ల మూవీ ఒక్కటే, 3 డిజాస్టర్లు ఏంటో తెలుసా?

విజయ్ దేవరకొండ కెరీర్‌లో టాప్ 10 సినిమాలు.. వంద కోట్ల మూవీ ఒక్కటే, 3 డిజాస్టర్లు ఏంటో తెలుసా?

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఉదయ్‌పూర్‌లో రెండు సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఈ సందర్భంగా, విజయ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల బాక్సాఫీస్ రికార్డులు ఎలా ఉన్నాయో చూద్దాం. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 04 2026, 07:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
గీత గోవిందం
Image Credit : X/GeethaArts

గీత గోవిందం

విజయ్ దేవరకొండ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా 'గీత గోవిందం'. 2018లో వచ్చిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్. కేవలం 20 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా, బాక్సాఫీస్ దగ్గర 127 కోట్లు కొల్లగొట్టింది. విజయ్ కెరీర్‌లో వంద కోట్ల క్లబ్‌లో చేరిన ఏకైక సినిమా ఇదే. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
కింగ్‌డమ్
Image Credit : instagram

కింగ్‌డమ్

2025లో రిలీజ్ అయిన విజయ్ దేవరకొండ సినిమా 'కింగ్‌డమ్' బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా బడ్జెట్ 90 కోట్లు కాగా, ఇది 84.2 కోట్లు వసూలు చేసింది. కానీ విజయ్ దేవరకొండ నటనకు మంచి పేరు వచ్చింది.

37
మహానటి
Image Credit : instagram

మహానటి

విజయ్ దేవరకొండ నటించిన 'మహానటి' సినిమా 2018లో విడుదలైంది. సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈసినిమాలో.. కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా బడ్జెట్ 25 కోట్లు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 84 కోట్ల బిజినెస్ చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

47
ఖుషి
Image Credit : instagram

ఖుషి

విజయ్ దేవరకొండ, సమంత రూత్ ప్రభు జంటగా నటించిన 'ఖుషి' సినిమా 2023లో విడుదలైంది. 55 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా 77.4 కోట్లు వసూలు చేసి యావరేజ్‌గా నిలిచింది.

57
లైగర్
Image Credit : instagram

లైగర్

విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన 'లైగర్' 2022లో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫ్లాప్ అయ్యింది. 90 కోట్ల భారీ బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా కేవలం 60 కోట్ల వ్యాపారం మాత్రమే చేసింది.

67
అర్జున్ రెడ్డి
Image Credit : instagram

అర్జున్ రెడ్డి

విజయ్ దేవరకొండ కెరీర్‌ను మార్చేసిన బ్లాక్‌బస్టర్ సినిమా 'అర్జున్ రెడ్డి'. 2017లో వచ్చిన ఈ సినిమాలో షాలినీ పాండే హీరోయిన్‌గా నటించింది. కేవలం 8 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 50 కోట్ల బిజినెస్ చేసింది.

77
టాక్సీవాలా
Image Credit : instagram

టాక్సీవాలా

2018లో వచ్చిన 'టాక్సీవాలా' బ్లాక్‌బస్టర్ అయ్యింది. 5 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా 38 కోట్లు వసూలు చేసింది. ఇక 2019లో వచ్చిన 'డియర్ కామ్రేడ్' ఫ్లాప్ అయ్యింది. 35 కోట్ల బడ్జెట్‌తో తీస్తే 37 కోట్లు రాబట్టింది. 2016లో వచ్చిన 'పెళ్లి చూపులు' 2 కోట్ల బడ్జెట్‌తో 30 కోట్లు వసూలు చేసి బ్లాక్‌బస్టర్ అయ్యింది. 2018లో వచ్చిన 'నోటా' 30 కోట్ల బడ్జెట్‌తో తీస్తే 24 కోట్లు మాత్రమే వసూలు చేసి ఫ్లాప్‌గా నిలిచింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
విజయ్ దేవరకొండ
సందీప్ రెడ్డి వంగా
రష్మిక మందన్న
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nana Patekar Top 10 Movies: నానా పటేకర్‌ విశ్వరూపం చూపించే టాప్‌ 10 సినిమాలు.. అస్సలు మిస్‌ అవ్వద్దు
Recommended image2
Nana Patekar Passed away: విలక్షణ నటుడు నానా పటేకర్ కన్నుమూత, గోవాలో మరణం.. కారణం ఇదే
Recommended image3
The Paradise 14 Days Collection: దారుణంగా పడిపోయిన ప్యారడైజ్‌, నానికి లాస్ట్ ఛాన్స్.. ఇంకా ఎంత రావాలంటే?
Related Stories
Recommended image1
పెళ్లి తర్వాత రష్మిక మందన్న ఫుల్ బిజీ.. లైన్‌లో 6 సినిమాలు, విజయ్ దేవరకొండ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్..
Recommended image2
50 లక్షల బడ్జెట్, 120 కోట్ల కలెక్షన్స్, సెన్సేషనల్ మూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved