ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న  'ఎన్టీఆర్' బయోపిక్ పై దర్శకుడు క్రిష్, ఆయన టీమ్ రకరకాల ఆలోచనలు చేస్తున్నారు. ఎలాగైనా ఈ ప్రాజెక్టు చరిత్రలో నిలిచిపోయేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం కొత్త ఐడియాలు వచ్చిన వెంటనే ఎక్కువ సమయం తీసుకోకుండా బాలయ్య అనుమతి తీసుకోవటం..ఓకే చేయించుకుని ఇంప్లిమెంట్ చేయటం జరుగుతోంది. తాజాగా క్రిష్ కు వచ్చిన ఓ ఆలోచన బాలయ్యకు తెగ నచ్చేసిందిట. వెంటనే వేరే ప్రశ్నకూడా అడగకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారట.

అదేమిటంటే... ఈ బయోపిక్ సెకండ్ పార్ట్ లో వచ్చే కొన్ని ఎపిసోడ్స్ లో అన్నగారి సొంత వాయిస్ వాడాలని. అప్పుడు వచ్చే రెస్పాన్స్ వేరుగా ఉంటుందని, ఆహార్యం అనుకరించినా, వాయిస్ ని యధాతథంగా ఉంచితే ఇంపాక్ట్ సూపర్ అని. ఇది విన్న వెంటనే బాలయ్య కూడా ఎక్సైట్ అయ్యి...తన తండ్రిగారి వాయిస్ ..తెలుగు ప్రజలకు బాగా పరిచయం కాబట్టి..ఆయన బయోపిక్ తీస్తూ వాటిని వాడటం సమంజసం అని ఫీలయ్యారట. ఈ క్రమంలో ఏ డైలాగులకు ఆ వాయిస్ వాడాలనే విషయమే కొంత వర్క్ చేసారుట. 

మఖ్యంగా బొబ్బిలి పులి సినిమాలో కోర్ట్ సీన్, దానవీరశూరకర్ణలో ఏమంటివి..ఏమింటివి అనే డైలాగుని, అలాగే అన్నగారి పొలిటికల్ ప్రస్దానంలో ..వచ్చే స్పీచ్ లలో మొదట జనాలని ఉద్దేశించి మాట్లాడే పలకరింపు. ఇలాంటి కొన్ని ఎంపిక చేసి ఓకే చేసారట. కాబట్టి ఈ సినిమాలో మనం అన్నగారి రియల్ వాయిస్ ని మనం తెరపై చాలా కాలం తర్వాత వినవచ్చు అన్నమాట.

నందమూరి బాలకృష్ణ, క్రిష్ కాంబినేషన్ లో 'ఎన్టీఆర్' బయోపిక్ ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాలో టాలీవుడ్ లో పలువురు స్టార్లను ముఖ్య పాత్రల కోసం ఎంపిక చేసుకున్నారు.

ఎన్టీఆర్ భారీగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ కనిపించనుంది. రానా దగ్గుబాటి, కళ్యాణ్ రామ్, సుమంత్, నిత్యామీనన్, రకుల్ ప్రీత్ సింగ్, తమన్నా ఇలా చాలా మంది నటీమణులు ఒకే సినిమాలో కనిపించబోతున్నారు.

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ బయోపిక్ లో బాహుబలి హీరోయిన్!

బాలయ్య 'అల్లూరి సీతారామరాజు' అవతారం!

'ఎన్టీఆర్' బయోపిక్: క్రిష్ రీషూట్ చేస్తాడా..?

ఎన్టీఆర్ బయోపిక్: దాసరి పాత్రలో మాస్ డైరెక్టర్!

మహేష్ కోసం 'ఎన్టీఆర్' ఎదురుచూపులు!

ఎన్టీఆర్ బయోపిక్: ఇంట్రెస్టింగ్ అప్డేట్..ఎన్టీఆర్ ప్రేమ కథ!

పెళ్లి పీటలెక్కిన బాలకృష్ణ!

బయోపిక్ లో ఎన్టీఆర్.. క్రిష్ ఏమన్నాడంటే..?

'ఎన్టీఆర్' బయోపిక్: రానా పాత్రపై షాకింగ్ న్యూస్

ఎన్టీఆర్ బయోపిక్: లక్ష్మీపార్వతిగా సీనియర్ హీరోయిన్..!

ఎన్టీఆర్ బయోపిక్ లో భూతాల రాజు!

'బయోపిక్' లో ఎన్టీఆర్ ఉంటాడు కానీ..!

ఎన్టీఆర్ బయోపిక్ లో తారక్.. అసలు నిజమేమిటంటే..?

వేటగాడి గెటప్ లో బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్2: 'మహానాయకుడు'!

'ఎన్టీఆర్' బయోపిక్ టైటిల్.. @కథానాయకుడు!

రెండు భాగాలుగా 'ఎన్టీఆర్' బయోపిక్!

ఎన్టీఆర్ ని పరిగెత్తిస్తున్న క్రిష్!

ఎన్టీఆర్ పిక్ వైరల్.. రిక్షా తొక్కిన బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ లో రకుల్.. అచ్చం శ్రీదేవిలానే!

ఎన్టీఆర్‌ భార్యగా విద్యాబాలన్ గెటప్!

ఎన్టీఆర్ సినిమా అందుకే ఒప్పుకోలేదు.. కీర్తి సురేశ్ కామెంట్స్!

పిక్ టాక్: ఎన్టీఆర్ తో నందమూరి హరికృష్ణ