అవును..త్వరలో మనం బాలయ్యని కర్ణుడు గెటప్ లోనూ, కళ్యాణ్ రామ్ ని అర్జునుడు గెటప్ లోనూ చూడబోతున్నాం. అదేంటి.. వీరిద్దరూ కలిసి ఏదన్నా పౌరణిక సినిమా మొదలెట్టారా అనే కదా మీ డౌట్..అదేమీ లేదు కానీ ... స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రగా రూపొందుతున్న  . నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ లో ఈ సన్నివేశం కనుల విందు కానుంది.

ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం బయోపిక్... మరో మూడు రోజులపాటు అక్కడే షూటింగ్ జరగుతుందిది. ఈ మూడు రోజులు పాటు ఈ గెటప్ లలో బాబాయ్ ..అబ్బాయ్ లు కనిపించనున్నారు.  ఏ సందర్బంలో ఈ గెటప్ లు వస్తాయంటే... ఎన్టీఆర్ కెరీర్ లో మెగా హిట్ గా నిలిచిన దానవీరశూరకర్ణ చిత్రానికి సంబంధించిన సీన్స్ . ఇక ఈ సన్నివేశాలను చిత్ర యూనిట్ చిత్రీకరించటానికి అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు తెలుస్తోంది.

ఈ రోజు దానవీరశూరకర్ణ సినిమాలోని ‘చిత్రం భళారే విచిత్రం’ పాటకు సంబంధించిన సీన్స్ ని షూట్ చేస్తారు. ఇక  అర్జునుడు క్యారెక్టర్ కు సంబంధించిన సీన్స్ ను రెండో రోజు  షూట్ చేయబోతున్నారు. అర్జునుడి పాత్రలో నందమూరి కళ్యాణ్ రామ్ లుక్ అదురుతుందంటున్నారు.  ఇప్పటికే చిత్ర యూనిట్ దానవీరశూరకర్ణ చిత్రం మొదలవ్వడానికి ముందు జరిగిన కొన్ని సంఘటనలను కూడా షూట్ చేయటం పూర్తి చేసింది.

కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం రెండు పార్ట్ లుగా విడుదల కానుంది. జనవరి 9న ఈ చిత్రం మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ను విడుదల చేసి, జనవరి 24న రెండో పార్ట్ ‘మహానాయకుడు’ను విడుదల చేయనున్నారు. బుర్రా సాయిమాధవ్‌ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ బయోపిక్ లో బాహుబలి హీరోయిన్!

బాలయ్య 'అల్లూరి సీతారామరాజు' అవతారం!

'ఎన్టీఆర్' బయోపిక్: క్రిష్ రీషూట్ చేస్తాడా..?

ఎన్టీఆర్ బయోపిక్: దాసరి పాత్రలో మాస్ డైరెక్టర్!

మహేష్ కోసం 'ఎన్టీఆర్' ఎదురుచూపులు!

ఎన్టీఆర్ బయోపిక్: ఇంట్రెస్టింగ్ అప్డేట్..ఎన్టీఆర్ ప్రేమ కథ!

పెళ్లి పీటలెక్కిన బాలకృష్ణ!

బయోపిక్ లో ఎన్టీఆర్.. క్రిష్ ఏమన్నాడంటే..?

'ఎన్టీఆర్' బయోపిక్: రానా పాత్రపై షాకింగ్ న్యూస్

ఎన్టీఆర్ బయోపిక్: లక్ష్మీపార్వతిగా సీనియర్ హీరోయిన్..!

ఎన్టీఆర్ బయోపిక్ లో భూతాల రాజు!

'బయోపిక్' లో ఎన్టీఆర్ ఉంటాడు కానీ..!

ఎన్టీఆర్ బయోపిక్ లో తారక్.. అసలు నిజమేమిటంటే..?

వేటగాడి గెటప్ లో బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్2: 'మహానాయకుడు'!

'ఎన్టీఆర్' బయోపిక్ టైటిల్.. @కథానాయకుడు!

రెండు భాగాలుగా 'ఎన్టీఆర్' బయోపిక్!

ఎన్టీఆర్ ని పరిగెత్తిస్తున్న క్రిష్!

ఎన్టీఆర్ పిక్ వైరల్.. రిక్షా తొక్కిన బాలయ్య!

ఎన్టీఆర్ బయోపిక్ లో రకుల్.. అచ్చం శ్రీదేవిలానే!

ఎన్టీఆర్‌ భార్యగా విద్యాబాలన్ గెటప్!

ఎన్టీఆర్ సినిమా అందుకే ఒప్పుకోలేదు.. కీర్తి సురేశ్ కామెంట్స్!

పిక్ టాక్: ఎన్టీఆర్ తో నందమూరి హరికృష్ణ