కాబోయే సీఎం పవన్ బీజేపీ నేత సంచలనం: మరిన్ని వార్తలు

Siva Kodati |  
Published : Sep 04, 2019, 04:56 PM ISTUpdated : Sep 04, 2019, 05:56 PM IST
కాబోయే సీఎం పవన్ బీజేపీ నేత సంచలనం: మరిన్ని వార్తలు

సారాంశం

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.

మూడేళ్లలో ఎన్నికలు: అయ్యన్నపాత్రుడి సంచలన వ్యాఖ్యలు

మూడేళ్లలో ఎన్నికలు వస్తాయి... మీరంతా మా వద్దే పనిచేయాలి... అది గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని  అయ్యన్నపాత్రుడు పోలీసులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాము అన్యాయంగా ప్రవర్తించడం లేదన్నారు. ఎక్కడైనా హెల్మెట్లు పెట్టుకొని ర్యాలీలు నిర్వహించారా అని ఆయన ప్రశ్నించారు.

 

పవన్ కాబోయే సీఎం, బీజేపీలో జనసేన విలీనం... అన్నం సతీష్

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన వస్తుందని ముఖ్యమంత్రి జగన్ ముందునుంచే జాగ్రత్త పడుతున్నాడని ఆయన అన్నారు. తనది ప్రస్తుతం స్టేట్ పార్టీ కాదని... సెంట్రల్ పార్టీ అని పేర్కొన్నారు. ఢిల్లీ నేతలు పవన్ తో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన పేర్కొన్నారు. 

 

అవకాశాలు ఇస్తామని జనసేన నేతలు... నటి ఆరోపణలు!

గతంలో సునీత బోయ సినీ విమర్శకుడు కత్తి మహేష్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపణలు చేసింది. అప్పట్లో కత్తి మహేష్‌పై లైంగిక ఆరోపణలతో వార్తల్లో నిలిచిన ఈమె ఇప్పుడు ఫిలిం ఛాంబర్ వద్ద నిరసనకు దిగడంతో మరోసారి హాట్ టాపిక్ అయింది. 

 

అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలు: ఎపిలో పవన్, బాబులతో కలిసి బిజెపి స్కెచ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాగా వేసేందుకు బిజెపి పక్కా ప్రణాళికను రచించినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేత అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలను బట్టి చూసి, బిజెపి నేత అన్నం సతీష్ తాజా వ్యాఖ్యలను బట్టి పరిశీలించిన బిజెపి స్కెచ్ ఏమిటో అర్థమవుతోంది. 

 

బిగ్ బాస్ 3: శిల్పాతో శ్రీముఖికి పాత గొడవలా..?

బిగ్ బాస్ సీజన్ 3 ఏడో వారంలోకి ఎంటర్ అయింది. సోమవారం ఎపిసోడ్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్ లోకి ఎంటర్ అయింది యాంకర్ శిల్పా చక్రవర్తి. ఇక మంగళవారం ఎపిసోడ్ లో తన గేమ్ ని మొదలుపెట్టింది శిల్పా. హౌస్ లో తన మొదటిరోజు కాబట్టి అన్నీ గమనిస్తున్నానని రేపటి నుండి విజృంభిస్తా అంటూ సవాల్ చేసింది.

 

స్టార్ హీరో ధనుష్ పై నిర్మాతలు ఫైర్!

విజయ్, అజిత్ వంటి అగ్ర నటులు నిర్మాతలకు పూర్తి సహకారం అందిస్తున్నారని గుర్తు చేశారు. కానీ ధనుష్ సహకారం లేని కారణంగా నిర్మాతలు నష్టపోతున్నారని చెప్పారు. కెరీర్ ఆరంభంలో ధనుష్ హీరోగా నటించిన 'తుల్లువదో ఇలమై' నుండి ఇప్పటివరకు చాలా చిత్రాలతో నిర్మాతలు వరుసగా నష్టపోతున్నారని చెప్పారు

 

హేమంత్ ఒక్కడి పని కాదు: టెక్కీ సతీష్ భార్య ప్రశాంతి

హేమంత్ వ్యవహారంపై తనకు చాలా అనుమానాలున్నాయని ప్రశాంతి బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తన భర్తకు చాలా మందితో వ్యాపార, ఆర్థిక సంబంధాలున్నాయని, చాలా సంస్థల్లో తన భర్త పెట్టుబడులు పెట్టారని, చాలా మంది పేర్లతో వ్యాపారాలు చేశారని ఆమె చెప్పారు

 

'సాహో' ఆ మూడు చోట్లా డిజాస్టర్!

ప్రభాస్ హీరోగా  దాదాపు 350 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో రూపొందిన చిత్రం సాహో.  ఇలాంటి  సినిమాలు కలెక్షన్స్ పరంగా ఒడ్డెక్కాలంటే... ప‌క్కాగా రిలీజ్ డేట్ ప్లానింగ్ ఉండాలి. ముఖ్యంగా లాంగ్ వీకెండ్ ఉంటే చాలా ప్లస్. 

 

బీజేపీలో చేరిన రేవూరి ప్రకాష్ రెడ్డి, రవీంద్రనాయక్

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు బుధవారం నాడు బీజేపీలో చేరారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్ రెడ్డి, మాజీ ఎంపీ రవీంద్రనాయక్ లు బుధవారం నాడు బీజేపీలో చేరారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తో కలిసి రేవూరి ప్రకాష్ రెడ్డి, రవీంద్రనాయక్ లు న్యూఢిల్లీ వెళ్లారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో వీరిద్దరూ బీజేపీలో చేరారు.

 

మీ భార్య మీతో లేదా? ఫోన్ చేయండి..అంటూ నటి నెంబర్, ఫొటో!

ఓ ఎస్కార్ట్ సర్వీస్ సంస్థ తనపై దుష్ప్రచారం చేస్తోందంటూ బెంగాలీ టెలివిజన్ నటి బ్రిష్తీరాయ్ పోలీసులకు ఫిర్యాదు  చేయటం సంచలనంగా మారింది. చేసింది. తన ఫొటో, ఫోన్ నంబరు ముద్రించిన పోస్టర్లతో ఎస్కార్ట్ సంస్థ లోకల్ రైళ్లు, రైల్వే స్టేషన్లలో ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది

 

ముగిసిన ముత్యం రెడ్డి అంత్యక్రియలు

అనారోగ్యంతో మరణించిన టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి అంత్యక్రియలు బుధవారం అధికారిక లాంఛనాలతో ముగిశాయి. అంత్యక్రియలకు పలువురు రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

 

వరుణ్ ఉండగా బిగ్ బాస్ కి రానని చెప్పిందట!

బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఘనంగా ఉంటుందని ఆశించిన ప్రేక్షకులకి గట్టి షాక్ తగిలింది. ఎవరైనా యంగ్ హీరోయిన్ వస్తుందనుకుంటే ఫేడవుట్ అయిన యాంకర్ శిల్పా చక్రవర్తి వచ్చింది. దీంతో ప్రేక్షకులు కాస్త షాక్ అయ్యారు.

 

టీఆర్ఎస్ లో కలకలం: హరీష్ సిఎం కావాలని టీఆర్ఎస్ నేత మొక్కు

హరీష్ రావు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ టీఆర్ఎస్ నేత విష్ణు జోగుళాంబ గుడిలో 1016 కొబ్బరికాయలు కొట్టారు. విష్ణు ఏ స్థాయి నాయకుడనేది తెలియదు కానీ ఓ విధమైన చర్చకు మాత్రం ఆయన చర్య దారి తీస్తోంది. 

 

హరీష్ శంకర్ కు ఇంటి భోజనం వడ్డిస్తున్న బ్రహ్మి!

బ్రహ్మానందం ప్రతి రోజు ఇంటి నుంచి సెట్స్ కు భోజనం తెప్పించుకుంటారు. పనిచేసే సమయంలో కొలీగ్స్ తో కలసి లంచ్ బాక్స్ షేర్ చేసుకోవడం సహజమే. తాజాగా తన ఇంటి నుంచి తెచ్చుకున్న వివిధ వంటకాల్ని బ్రహ్మి హరీష్ శంకర్ కు వడ్డించారు. దీని గురించి హరీష్ ట్వీట్ చేస్తూ.. ఎంతమందికో ఈ అదృష్టం అని హరీష్ పేర్కొన్నాడు. పైగా ఈ రోజు వాల్మీకి చిత్ర షూటింగ్ చివరి రోజు అని హరీష్ తెలిపాడు.

యరపతినేని అక్రమ తవ్వకాలపై సిబిఐ దర్యాప్తు: జగన్ కీలక నిర్ణయం

గురజాల మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత యరపతినేని శ్రీనివాస్‌కు జగన్ సర్కార్ షాకిచ్చింది.అక్రమ మైనింగ్ వ్యవహరంపై సీబీఐ విచారణకు తాము సిద్దమని ఏపీ హైకోర్టుకు జగన్ ప్రభుత్వం బుధవారం నాడు స్పష్టం చేసింది. గురజాల నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ విషయంలో సీబీఐ విచారణకు హైకోర్టు అనుమతి ఇస్తూ ఈ ఏడాది ఆగష్టు 26వ తేదీన హైకోర్టు తీర్పు చెప్పింది.  

 

సమంతతో విసిగిపోతున్న నిర్మాతలు!

సమంతతో సినిమా తీసి హిట్ అందుకుంటే గనుక ఇరవై కోట్ల లాభం ఈజీగా వస్తుంది. ఈ కారణంగానే పలువురు నిర్మాతలు సమంతతో సినిమా చేయడానికి ఆమెని సంప్రదిస్తున్నారు. వీరిలో బడా నిర్మాతలు, చిన్న నిర్మాతలు చాలా మంది ఉన్నారు. కానీ సమంత మాత్రం ఎవరితోనూ పని చేయడానికి ఆసక్తి చూపించడం లేదు.

 

వైఎస్ వివేకా హత్య కేసు:జగన్ కు శ్రీనివాస్ రెడ్డి రాసిన లేఖ ఇదీ...

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడు శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య చేసుకొనే ముందు మూడు సూసైడ్ నోట్స్ రాశారు. అయితే ఈ లేఖలపై చేతి రాతలు వేర్వేరుగా ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ లేఖలను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.

 

ఆ సినిమా దెబ్బకి అన్నీ అమ్ముకోవాల్సి వచ్చింది.. హీరో కామెంట్స్!

సినిమా తీయడమంటే అంత సులువైన విషయం కాదు.. 24 క్రాఫ్ట్స్ లో ఏ ఒక్క డిపార్ట్మెంట్ సరిగ్గా వర్క్ చేయకపోయినా సినిమా రిజల్ట్ పై ఎఫెక్ట్ పడుతుంది. సినిమాపై పెట్టుబడులు పెట్టి కోట్లు సంపాదించిన వారు ఇండస్ట్రీలో ఉన్నారు. అలానే నష్టపోయిన వారు కూడా ఉన్నారు. ఒకప్పుడు బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కుటుంబానికి ఇలాంటి పరిస్థితే ఎదురైందట.

 

వెనక్కి: కేడర్ బదిలీకి కేంద్రం నో, తెలంగాణలోనే స్టీఫెన్

ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర కేడర్ మార్పుకు కేంద్రం అంగీకరించలేదు. దీంతో ఆయన తెలంగాణ రాష్ట్రంలోనే పనిచేయాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. కేడర్ మార్పు కోసం స్టీఫెన్ రవీంద్ర డీవోపీటీని కోరాడు. కానీ కేంద్రం సానుకూలంగా స్పందించలేదు

 

కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు: టార్గెట్ ఈటల రాజేందర్

పదవులు రాగానే కొందరు నేతలు పెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. పదవులు వచ్చింది పార్టీ వల్లనే అని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. ప్రజలే బాసులనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మంత్రి ఈటల రాజేందర్ ను లక్ష్యంగా చేసుకుంటూ కేటీ రామారావు ఆ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు

 

ఆర్టీసి విలీనం: జగన్ సర్కార్ కు ఎదురయ్యే సవాళ్లు ఇవే...

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల తమ జీతాలు పెరుగుతాయని, నష్టాల ఊబిలోంచి ఆర్టీసీ బయటపడుతుందని ఉద్యోగ సంఘాల నాయకులు సాధారణ ప్రజలు భావిస్తూ ఉండొచ్చు. కానీ ఈ విలీనం వల్ల రవాణా వ్యవస్థను  ప్రజలకు అందుబాటులో ఉంచే విషయంలో, నిర్వహణ విషయంలో కొన్ని సవాళ్లు మాత్రం ఎదురవుతాయి

 

చంద్రబాబుకు షాక్: టీడీపికి అయన్నపాత్రుడి సోదరుడు రాజీనామా

విశాఖపట్టణంలో టీడీపీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సోదరుడు సన్యాసిపాత్రుడు టీడీపీకి రాజీనామా చేశారు.ఆయన వైఎస్ఆర్‌సీపీలో చేరే అవకాశం ఉంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అయ్యన్నపాత్రుడు జన్మదిన వేడుకల్లో ఉన్న సమయంలోనే సన్యాసిపాత్రుడు టీడీపీకి రాజీనామా చేశారు

 

వైఎస్ వివేకా హత్య: శ్రీనివాస్ రెడ్డి సూసైడ్‌ నోట్ ఫోరెన్సిక్‌కు, కడపకు డీజీ

మాజీ మంత్రి  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడు శ్రీనివాసులు రెడ్డి ఆత్మహత్య ఘటనతో ఏపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఏపీ డీజీపీ బుధవారం నాడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. మరో వైపు శ్రీనివాసులు రెడ్డి సూసైడ్ కంటే ముందు చోటుచేసుకొన్న పరిణామాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

కాంట్రాక్టర్లకు జగన్ సర్కార్ షాక్: అడ్వాన్స్‌ ల రికవరీ

బుధవారం  నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది.ఈ  సమావేశంలో కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్‌ పనులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. పనుల నిర్వహణకుగాను కాంట్రాక్టర్లకు ఇచ్చిన అడ్వాన్స్‌లను రికవరీ చేయాలని  ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకొంది.

 

నా ఇంట్లో 9 లక్షలు ఇవ్వండి..సూసైడ్ నోట్‌లో భాస్కర్ రెడ్డిని కోరిన శ్రీనివాస్ రెడ్డి

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న కటికరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. చనిపోకముందే శ్రీనివాస్ రెడ్డి పేరుతో రెండు లేఖలు దొరకడం సంచలనం కలిగిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైఎస్ భాస్కర్ రెడ్డిలకి వేర్వేరుగా రాసిన లేఖలను పోలీసులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు.

 

ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వోద్యోగులే: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే

ఆర్టీసీ ఉద్యోగస్తులందరినీ ప్రభుత్వోద్యోగులుగా పరిగణిస్తామని.. ఆర్టీసీలో పనిచేస్తున్న 52 వేల మంది ఉద్యోగస్తులందరినీ కూడా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌లోకి రీడిజిగ్నిట్ చేసేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసిందని నాని వెల్లడించారు.

 

ఖజానా ఖాళీ: ఏపీలో జీతాలు మినహా ఇతర బిల్లుల నిలిపివేత

ఉద్యోగుల జీతాలు మినహ ఇతర బిల్లులను చెల్లింపును నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. 2019-20 ఆర్ధిక సంవత్సరంలో రెవిన్యూ రాబడిలో విశాఖ జిల్లాలో పలు శాఖలు తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. పీఏఓ, ట్రెజరీ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున బిల్లుల చెల్లింపు కోసం పెద్ద ఎత్తున ధరఖాస్తులు ఉన్నాయి. కొన్ని శాఖల్లో ఎన్నికల సమయం నుండి అద్దెకు తీసుకొన్న కార్ల బకాయిలు కూడ చెల్లించని పరిస్థితి నెలకొంది.

 

సీన్ రివర్స్: టీడీపీలో చేరిన వైఎస్ఆర్‌పీ నేత

సాధారణంగా అధికార పార్టీలోకి వలసలు ఉంటాయి. కానీ ఏపీలో మాత్రం సీన్ రివర్స్ అయింది. టీడీపీకి చెందిన కీలక నేతలు బీజేపీ లేదా వైఎస్ఆర్‌సీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ, వైఎస్ఆర్‌సీపీకి చెందిన దొన్ను దొర ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరారు.

 

అన్ని బయటకొస్తాయి: వివేకా హత్య కేసుపై శ్రీకాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఫ్యాక్షనిస్టులు, రేపిస్టులు టీడీపీలోనే ఉన్నారంటూ శ్రీకాంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. పేదలకు అందుబాటులో ఉండేలా.. పబ్లిసిటీకి దూరంగా సీఎం పరిపాలన చేస్తుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని.. త్వరలోనే వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు.

 

నా అరెస్ట్‌తో బీజేపీ మిషన్ పూర్తయ్యింది... బాధితుడిగా మిగిలా: డీకే శివకుమార్

మనీల్యాండరింగ్ కేసులో తనను అరెస్ట్ చేయడంపై కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే శివకుమార్ ట్వీట్ చేశారు. తనను అరెస్ట్ చేసి బీజేపీ పంతం నెగ్గించుకుందని మండిపడ్డారు. ఇందుకు బీజేపీ మిత్రులను అభినందిస్తున్నాని డీకే సెటైర్లు వేశారు. 

 

ప్రియుడితో లేచిపోతోందని.. యువతిని చితకబాదారు

అలీరాజ్ పూర్ ప్రాంతానికి చెందిన 19ఏళ్ల దళిత యువతి ఇంట్లో వారికి తెలికుండా ఓ యువకుడితో లేచిపోయేందుకు ప్రయత్నించింది. కాగా... ఆమెను కుటుంబసభ్యులు పట్టుకొని కర్రలతో చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఒకరి ఫోన్ నుంచి మరో ఫోన్ కి చేరి చివరకు ఈ వీడియో పోలీసుల కంట పడింది.

 

ఆ ఇద్దరూ జైలుకే... బీజేపీ సీనియర్ నేత షాకింగ్ కామెంట్స్

తిరునల్వేలి శంకర్‌నగర్‌లోని ప్రభుత్వ అతిథి గృహంలో మంగళవారం సుబ్రమణ్యస్వామి విలేకరులతో మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ కుంటుపడలేదని, గత యూపీఏ సంకీర్ణ ప్రభుత్వంలోనే ఇది జరిగిందన్నారు. ఆర్థికవేత్తగా వుంటూ ప్రధానిగా వ్యవహరించిన మన్మోహన్‌సింగ్‌ చేపట్టిన తప్పుడు విధానాలే ఆర్థిక సంక్షోభానికి కారణమయ్యాయన్నారు.

 

స్కూటర్ ధర రూ.15వేలు.. జరిమానా రూ.23వేలు

అతనికి డ్రైవింగ్ లైసెన్స్ వెంట తెచ్చుకోనుందున రూ.5వేలు,  రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వెంట లేనందున మరో రూ.5వేలు, ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపినందుకు రూ.2వేలు, హెల్మెట్ పెట్టుకోనందుకు రూ. వెయ్యి, పొల్యూషన్ చట్టాన్ని అతిక్రమించినందుకు రూ.10వేలు మోత్తం కలిపి రూ.23వేలు జరిమానా విధించారు.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?