Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ వివేకా హత్య కేసు:జగన్ కు శ్రీనివాస్ రెడ్డి రాసిన లేఖ ఇదీ...

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడు శ్రీనివాస్ రెడ్డి సూసడ్ 

ys viveka murder case: here is srinivas reddy suicide letter
Author
Kadapa, First Published Sep 4, 2019, 1:51 PM IST

కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడు శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య చేసుకొనే ముందు మూడు సూసైడ్ నోట్స్ రాశారు. అయితే ఈ లేఖలపై చేతి రాతలు వేర్వేరుగా ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ లేఖలను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.

ఏపీ సీఎం వైఎస్  జగన్‌ను ఉద్దేశించి శ్రీనివాస్ రెడ్డి లేఖ రాశాడు.ఈ లేఖలో పూర్తి పాఠమిలా ఉంది.

అన్న జగనన్నా..... నేను కస్మూరు శ్రీనివాస రెడ్డిని.  నా మొర నీకు తప్ప వేరొకరికి చెప్పినా లాభం లేదు.మొన్న జరిగిన ఎన్నికల్లో  మీరు, మేం అందరం ఒక యజ్ఞంలాగా చేశాము. నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలనేది కోరిక. పరమేష్ బావ... నేను తెలుగుదేశంలో చేరుతాననని చెప్పగా నీకు ఏమి తిక్క అన్నాను. రాష్ట్రమంతా కావాలి జగన్... రావాలి జగన్ అంటే నీవు ఎందిరా.. బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డి కావాలి అంటున్నావన్నాను.

అన్నా అబద్దం చెప్పను మన జనార్ధన్, శ్రీను ఏదో తెలుగుదేశం అంటున్నారు నీకు తెలుసా అన్నాడు. దైవ సాక్షిగా నా నోటీసుకు రాలేదు బావా అన్నాను. అన్నా మార్చి 13వ తారీఖున శివప్రకాష్ అన్న దగ్గరకు అన్నింటికి నీవుండాలి అని శివ రాఘవరెడ్డి, పరమేశ్వర్ రెడ్డి అడిగితే ఫ్యాక్షన్‌కు నేను ఉండలేను.. ఫైనాన్సియర్ గా అయితే నేను ఉంటానని చెప్పాను.

ఈ విషయం చెప్పినప్పుడు రమేష్ నాకు ఫోన్ చేసి శివప్రకాష్ అన్న జగనన్న దగ్గరకు పిలుచుకొని వెళ్తానన్నాడని నాకు ఫోన్ చేస్తే అప్పుడు పరమేష్ బావ ఈ టైంలో జగనన్న దగ్గరకు పోవటం బ్లాక్‌మెయిల్ అవుతుంది కనుక శివప్రకాష్ అన్నతో ఊరికి ఉన్న బండి తిరగడం లేదు. నా బండి పాతబండి ఏదైనా డబ్బులు ఊరికే ఇస్తే సరిపోతుందని అన్నాను.


13వ తారీఖు సాయంత్రం ఆరోగ్యం బాగా లేదని గంగిరెడ్డి హస్పిటల్ అక్కడి నుండి కడపకు పోయినాం అన్నా.  కడపకు పరమేష్ కు గుండెజబ్బు అంటే పోయినాం తప్ప బీటెక్ రవి వస్తాడని తెలియదు. వాడికి కూడ దర్రవాగు సంజీవరెడ్డి సాయంత్రం కడపకు వస్తున్నామని చెప్పాడంట.  మేము కడపకు 14వ తేదీ సాయంత్రం పరమేష్ ను చూసి రాత్రి  10 గంటలకు ప్రొద్దుటూరుకు చేరుకొన్నాం. తరువాత ఉదయం రాష్ట్రమంత్రి తెలిసిన వాళ్లు నాకు తెలుసు. 

వివేకానందరెడ్డిని చూడడానికి వెళ్లాను. మండలం మొత్తం క్యాన్‌వాస్ కూడ అవినాష్ అన్న శివప్రకాష్ అన్న తిరిగినాం. ఆ తర్వాత 5,6 రోజులు పోలీసులు తీసుకెళ్లారు.వచ్చి అవినాసన్నను, శివప్రకాష్ అన్నను కలిశాం. నేను కొంచెం క్లారిటీగా మాట్లాడుదాం అన్నారు. అన్న అంతకు మించి దైవసాక్షిగా ఏమైంది తెలియదు. అన్నీ ఈ లెటర్ గౌరు వెంకట్ రెడ్డి, ఎం.శ్రీను,. జనార్ధన్, అనిల్, హరికుమార్ రెడ్డి, కసనూరు రమణారెడ్డి, మరియు అవినాసన్న  ద్వారా మా దగ్గరకు వస్తారు. అన్న రాష్ట్రమంతా ప్రజలను చూసేవాడివి.

నీవాడిని, నీ సేవకుడిని నన్ను కనికరించి నాభార్య,  పిల్లలను అనాధలను చేయొద్దు. మీ ద్వారా రూ.10 లక్షలు తీసుకొన్నా.. కానీ శివప్రకాష్ అన్న దగ్గర భాస్కర్ రెడ్డి అన్న దగ్గర అవినాషన్న దగ్గర వివేకానందరెడ్డి దగ్గర కానీ ఒక్క రూపాయి కూడ తీసుకోలేదు. కావున నిన్ను నమ్ముకొన్న వాణ్ణి అన్నా నీకు నా గురించి తెలుసు.

అన్నా మీకు తెలిసి దీనిలో నా తప్పు ఉన్నదా, నీవు అనుకొంటే నా ఫ్యామిలీ చాలా చిన్నది. కావున వీరి ద్వారా ఎంతో కొంత సాయం చేయండి.

సంబంధిత వార్తలు

వైఎస్ వివేకా హత్య: శ్రీనివాస్ రెడ్డి సూసైడ్‌ నోట్ ఫోరెన్సిక్‌కు, కడపకు డీజీ

వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడి ఆత్మహత్య: ఉత్పన్నమవుతున్న ప్రశ్నలివీ...

వైఎస్ వివేకా హత్య: శ్రీనివాస్ రెడ్డి సూసైడ్, పోలీసుల అనుమానాలివి

వైఎస్ వివేకానందరెడ్డి హత్య: అనుమానితుడు శ్రీనివాస్ రెడ్డి సూసైడ్

Follow Us:
Download App:
  • android
  • ios