మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న కటికరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆత్మహత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. చనిపోకముందే శ్రీనివాస్ రెడ్డి పేరుతో రెండు లేఖలు దొరకడం సంచలనం కలిగిస్తోంది.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైఎస్ భాస్కర్ రెడ్డిలకి వేర్వేరుగా రాసిన లేఖలను పోలీసులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. ఇక వైఎస్ వివేకానందరెడ్డికి రాసిన లేఖలో ఈ విధంగా ఉంది. 

గౌరవనీయులైన వైఎస్ భాస్కర్‌రెడ్డి అన్నగారికి మీ శీనప్ప రాయు వాంగ్మూలం.. తనకు ఊహా తెలిసిన నాటి నుంచి వైఎస్ ఫ్యామిలీకి కాకుండా వేరే ఎవరికైనా చేసినానా అని శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో తనకు ఏమాత్రం సంబంధం లేదని.. ఎవరో ఉద్దేశ్యపూర్వకంగా ఇరికించారని ఆయన వాపోయారు.

వైఎస్ కుటుంబం వద్ద పనిచేసినప్పడు గానీ... శివప్రకాశ్ అన్న పనిచేసినప్పుడు కానీ తనకు ఏ ఒక్కరూపాయి ఆదాయం రాలేదన్నారు. పదినిమిషాలు బీటెక్ రవితో మాట్లాడాం.. అంతే , అతను కూడా కావాలంటే తెలుగుదేశంలోకి చేరొచ్చని.. లేదంటే జగన్ సీఎం అయిన తర్వాత అందరం వైసీపీలోకి వెళదామని చెప్పారని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

పోలీసులు మా మీద బంగాకు కేసులు పెట్టి లోపల వేయిస్తామన్నారని.. జగన్ చెప్పినా కేసులు పెడతామని బెదిరించారని ఆయన తెలిపారు. చేయని నేరానికి శిక్షలు, అవమానాలు భరించలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

నువ్వు మూడు లక్షలు... అవినాష్ అన్న మూడు లక్షలు, శివప్రకాశ్ అన్న ఒక మూడు లక్షలు నా ఇంట్లో ఇవ్వండి అంటూ వైఎస్ భాస్కర్‌రెడ్డిని కోరారు. శ్రీను మా వాడనుకోండి.. ఇక ఉంటానన్నా అంటూ శ్రీనివాస్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. 

వైఎస్ వివేకా హత్య కేసు:జగన్ కు శ్రీనివాస్ రెడ్డి రాసిన లేఖ ఇదీ...

వైఎస్ వివేకా హత్య: శ్రీనివాస్ రెడ్డి సూసైడ్‌ నోట్ ఫోరెన్సిక్‌కు, కడపకు డీజీ

వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడి ఆత్మహత్య: ఉత్పన్నమవుతున్న ప్రశ్నలివీ...

వైఎస్ వివేకా హత్య: శ్రీనివాస్ రెడ్డి సూసైడ్, పోలీసుల అనుమానాలివి

వైఎస్ వివేకానందరెడ్డి హత్య: అనుమానితుడు శ్రీనివాస్ రెడ్డి సూసైడ్