బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఘనంగా ఉంటుందని ఆశించిన ప్రేక్షకులకి గట్టి షాక్ తగిలింది. ఎవరైనా యంగ్ హీరోయిన్ వస్తుందనుకుంటే ఫేడవుట్ అయిన యాంకర్ శిల్పా చక్రవర్తి వచ్చింది. దీంతో ప్రేక్షకులు కాస్త షాక్ అయ్యారు.

హెబ్బా పటేల్, ఈషా రెబ్బాల పేర్లు వినిపించినప్పటికీ శ్రద్ధా దాస్ అయితే రావడం ఖాయమనే ప్రచారం జరిగింది. శ్రద్దా హౌస్ లోకి వస్తే హౌస్ కి గ్లామర్ ఎట్రాక్షన్ వస్తుందని భావించారు. అలానే గతంలో ఆమెకి వరుణ్ సందేశ్ తో ఉన్న ఎఫైర్ కూడా షోకి మసాలా యాడ్ చేస్తుందని భావించారు.

అయితే వరుణ్ సందేశ్ హౌస్ లో ఉండగా.. బిగ్ బాస్ షోకి వెళ్లడానికి శ్రద్ధా దాస్ ఒప్పుకోవడం లేదట. వరుణ్ గనుక ఎలిమినేట్ అయితే వస్తానని చెప్పడంతో వైల్డ్ కార్డ్ 
ఎంట్రీని ఒక వారం రోజులు ఆలస్యం చేశారట. కానీ వరుణ్ ఎలిమినేట్ కాకపోవడంతో ఇక శ్రద్ధా రాదని తేలిపోయింది. ఆఖరి నిమిషంలో ఎవరిని ఫైనల్ చేయాలో అర్ధంకాక శిల్పా చక్రవర్తిని హౌస్ లోకి పంపించారు.

వరుణ్ సందేశ్ తో బ్రేకప్ అయిన తరువాత శ్రద్ధ డిప్రెషన్ కి గురైందని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇప్పుడు అతడు ఉన్న హౌస్ లోకి వెళితే.. పాత గాయాలు తిరిగి మొదలవుతాయని.. అలానే భార్యతో కలిసి గేమ్ ఆడుతున్నాడు గనుక ఇబ్బందులు కూడా తలెత్తే ప్రమాదం ఉందని భావించి శ్రద్ధా ఈ షోకి నో చెప్పిందట!