విశాఖపట్టణం: ఉద్యోగుల జీతాలు మినహ ఇతర బిల్లులను చెల్లింపును నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. 2019-20 ఆర్ధిక సంవత్సరంలో రెవిన్యూ రాబడిలో  విశాఖ జిల్లాలో పలు శాఖలు తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.

పీఏఓ, ట్రెజరీ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున బిల్లుల చెల్లింపు కోసం పెద్ద ఎత్తున ధరఖాస్తులు ఉన్నాయి. కొన్ని శాఖల్లో ఎన్నికల సమయం నుండి అద్దెకు తీసుకొన్న కార్ల బకాయిలు కూడ చెల్లించని పరిస్థితి నెలకొంది.

తమకు బకాయిలు చెల్లించాలని కోరుతూ క్యాబ్ ఓనర్స్ ఆందోళనలు కూడ నిర్వహించారు. ప్రతి నెల ఒక్కో కారుకు రూ. 60వేలను ప్రభుత్వం చెల్లిస్తోంది. ఐదు నెలలుగా కారు అద్దె బకాయిలు చెల్లించడం లేదు.

కారు అద్దె కాకుండా ఇతర బిల్లులను నిధులు లేని కారణంగా చెల్లించడం లేదని విశాఖ జిల్లా క్యాబ్ ఓనర్స్, డ్రైవర్స్  అసోసియేషన్ అధ్యక్షుడు  బిఎం పార్థుడు చెప్పారు.

ఆయా శాఖల్లో పెండింగ్ లో ఉన్న బిల్లులను  చెల్లించేందుకు నిధులను ఇవ్వాలని జిల్లా యంత్రాంగం ప్రభుత్వాన్ని కోరింది.సాధారణంగా ప్రతి ఏటా ఫిబ్రవరి, మార్చి మాసాల్లో బిల్లుల చెల్లింపులో కొంత ఇబ్బందులు ఉంటాయి.

 కానీ, ఈ ఏడాది ఏపీలో ఆదాయానికి, ఖర్చుకు మధ్య  చాలా వ్యత్యాసం ఉంది. దీంతో పెండింగ్ బిల్లుల చెల్లించేందుకు ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొంటుంది.

కేవలం వేతనాలు, పెన్షన్లను చెల్లించేందుకు మాత్రమే ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తోంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో  పలు సంక్షేమ కార్యక్రమాల అమల్లో భాగంగా బిల్లులు పెండింగ్ లో ఉన్నట్టుగా ఓ అధికారి తెలిపారు.

సంబంధిత వార్తలు

జగన్ కు షాక్: ఎపి ఖజానా ఖాళీ, దిక్కేది...