ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినందుకు ఓ స్కూటర్ యజమానికి ట్రాఫిక్ పోలీసులు దిమ్మతిరిగే షాకిచ్చారు. వెహికిల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, డ్రైవింగ్ లైసెన్స్  వెంట తీసుకువెళ్లలేదని ఓ వ్యక్తికి రూ.23వేల జరిమానా విధించారు. కొత్తగా అమలులోకి వచ్చిన ట్రాఫిక్ రూల్స్ ప్రకారం ఈ జరిమానా విధించారు. కాగా... ఆ వ్యక్తి తన స్కూటీ విలువ రూ.15వేలకు కాగా.. జరిమానా రూ.23వేలు రావడం గమనార్హం. ఈ సంఘటన గుడ్ గావ్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. గుడ్ గావ్ కి చెందిన దినేష్ మదన్ అనే వ్యక్తి ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించాడు. దీంతో ట్రాఫిక్ పోలీసులు అతనికి జరిమానా విధించాడు. ఈ సందర్భంగా దినేష్ మాట్లాడుతూ.. తన స్కూటర్ విలువ కూడా రూ.15వేలకు మించదని చెప్పాడు. భవిష్యత్తులో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించనని స్పష్టం చేశాడు. తాను తన ఇంటి దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ పేపర్ల ఫోటోలను వాట్సాప్ నుంచి తెప్పించేలోపే పోలీసు అధికారి చలానా రాసేసాడని చెప్పాడు. ఆయన కొద్దిసేపు ఆగి ఉంటే తన కొంతమేర జరిమానా తగ్గి ఉండేదని వాపోయాడు. ఇక నుంచి తాను అన్ని డాక్యుమెంట్స తన వెంటనే  ఉంచుకుంటానని కూడా చెప్పాడు.

అతనికి డ్రైవింగ్ లైసెన్స్ వెంట తెచ్చుకోనుందున రూ.5వేలు,  రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వెంట లేనందున మరో రూ.5వేలు, ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపినందుకు రూ.2వేలు, హెల్మెట్ పెట్టుకోనందుకు రూ. వెయ్యి, పొల్యూషన్ చట్టాన్ని అతిక్రమించినందుకు రూ.10వేలు మోత్తం కలిపి రూ.23వేలు జరిమానా విధించారు.

కొత్తగా విధించిన ట్రాఫిక్స్ రూల్స్ ప్రకారం అతివేగంగా వాహనం నడిపితే రూ.2వేల జరిమానా, ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.2వేలు, హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే రూ.వెయ్యి  జరిమానా విధిస్తారు . అదేవిధంగా మూడు నెలల ఇన్సూరెన్స్ కూడా సస్పెన్షన్ చేసే అవకాశం ఉంది.

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.5వేలు, అర్హత లేని వారు వాహనం నడిపితే రూ.పదివేల జరిమానా, సీటు బెల్టు పెట్టుకోకుంటే రూ. వెయ్యి,  ఫోన్ మాట్లాడుతూ వాహనం నడిపితే రూ.5వేలు, మద్యం సేవించివాహనం నడిపితే రూ. పదివేలు జరిమానా విధించనున్నారు.