ఒంగోలు: తన భర్త సతీష్ హత్య కేసులో హేమంత్ వ్యవహారం అనుమానాలకు తావిస్తోందని హైదరాబాదులోని కూకట్ పల్లిలో హత్యకు గురైన సాప్ట్ వేర్ ఇంజనీరు భార్య ప్రశాంతి అంటున్నారు. తన భర్త సతీష్ హత్య కేసులో హేమంత్ ఒక్కడే నిందితుడని పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోందని, అది హేమంత్ ఒక్కడి పని కాదని ఆమె అన్నారు. 

హేమంత్ వ్యవహారంపై తనకు చాలా అనుమానాలున్నాయని ప్రశాంతి బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తన భర్తకు చాలా మందితో వ్యాపార, ఆర్థిక సంబంధాలున్నాయని, చాలా సంస్థల్లో తన భర్త పెట్టుబడులు పెట్టారని, చాలా మంది పేర్లతో వ్యాపారాలు చేశారని ఆమె చెప్పారు. 

తన భర్త వ్యాపారాలను సొంతం చేసుకునేందుకు చాలా మంది హత్యకు పథకం వేసి ఉంటారని, వారందరినీ పోలీసులు విచారించాలని ఆమె అన్నారు. సతీష్ ను హత్య చేసేందుకు వారికి హేమంత్ సహకరించి ఉండవచ్చునని ఆమె అన్నారు. 

హత్యకు సంబంధించి సతీష్, హేమంత్, ప్రియాంక, క్రాంతిలతో పాటు వ్యాపార భాగస్వాములకు సంబంధించి గత పదిరోజుల ఫోన్ కాల్స్ ను, వాట్సప్ డేటాను పోలీసులు బయటకు తీయాలని ఆమె అన్నారు. 

సంబంధిత వార్తలు

టెక్కీ సతీష్ హత్య: పోలీసుల అదుపులో హేమంత్, కారణమదేనా?

టెక్కీ సతీశ్ హత్య: వీడని చిక్కుముడులు, మరిన్ని ట్విస్టులు

టెక్కీ సతీష్ హత్య కేసులో ట్విస్ట్: అక్రమ సంబంధమే కారణం

కేపీహెచ్‌బీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణహత్య