ప్రముఖ నిర్మాత బన్నీ వాసు, జనసేన పార్టీ తనను మోసం చేసిందంటూ జూనియర్ ఆర్టిస్ సునీత బోయ నిరసనకు దిగింది. తనను తాను గొలుసులతో బంధించుకుని ఫిల్మ్ చాంబర్‌లో మంగళవారం రాత్రంతా నిరసన తెలిపింది.

విషయం తెలుసుకున్న పోలీసులు బుధవారం ఉదయం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఈమె సినీ విమర్శకుడు కత్తి మహేష్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆరోపణలు చేసింది. అప్పట్లో కత్తి మహేష్‌పై లైంగిక ఆరోపణలతో వార్తల్లో నిలిచిన ఈమె ఇప్పుడు ఫిలిం ఛాంబర్ వద్ద నిరసనకు దిగడంతో మరోసారి హాట్ టాపిక్ అయింది.

గీతాఆర్ట్స్ లో సినిమా ఛాన్స్ లు ఇప్పిస్తానని చెప్పి నిర్మాత బన్నీ వాసు తనను మోసం చేశాడని సునీత ఆరోపిస్తుంది. జనసేన పార్టీ కోసం కష్టపడితే ఆదుకుంటానని చెప్పి ఇప్పుడు  తనపైనే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ఆమె సంచలన ఆరోపణలుచేస్తోంది.

తనకు జరిగిన అన్యాయంపై అల్లు అరవింద్ స్పందించాలని ఆమె డిమాండ్ చేస్తోంది. ఆమె ఆరోపణల్లో ఎంత వరకు నిజం ఉందో తెలుసుకోవడానికి పోలీసులు విచారణ చేస్తున్నారు.