'ఓ బేబీ' సినిమాతో మార్కెట్ పరంగా తన సత్తా ఏంటో నిరూపించింది సమంత. ఈ సినిమా ఇరవై కోట్లు థియేట్రికల్ బిజినెస్ చేసింది. అలానే డిజిటల్, శాటిలైట్ రూపంలో మరో పదిహేను కోట్లు వస్తాయి. అంటే మొత్తంగా చూసుకుంటే సమంత మార్కెట్ ముప్పై ఐదు కోట్ల వరకు ఉంటుంది. 

సమంతకు రెండు కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినా.. మిగిలిన పన్నెండు కోట్లలో సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేయొచ్చు. అంటే సమంతతో సినిమా తీసి హిట్ అందుకుంటే గనుక ఇరవై కోట్ల లాభం ఈజీగా వస్తుంది. ఈ కారణంగానే పలువురు నిర్మాతలు సమంతతో సినిమా చేయడానికి ఆమెని సంప్రదిస్తున్నారు.

వీరిలో బడా నిర్మాతలు, చిన్న నిర్మాతలు చాలా మంది ఉన్నారు. కానీ సమంత మాత్రం ఎవరితోనూ పని చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. తనకు ఇప్పుడు ఓ బేబీ, సూపర్ డీలక్స్వంటి కథలు కావాలని అడుగుతోందట. సాదాసీదా పాత్రలు చేయనని తెగేసి చెప్పేస్తుందట. ఎవరు ఏ కథ చెప్పినా.. హీరోయిన్ పాత్రని మార్చాలని డైరెక్షన్స్ ఇస్తోందట.

ఇక ఆమెతో గనుక సినిమా తీస్తే మానిటర్ దగ్గర, ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూడా కూర్చుంటుందని దర్శకులు భావిస్తుంటే.. ఎన్ని కథలు పంపించినా రిజెక్ట్ చేస్తుండేసరికి నిర్మాతలు కూడా విసిగిపోయి మరో ప్రాజెక్ట్ మీదకు వెళ్లిపోతున్నారట.