జనసేన అధినేత పవన్ కళ్యాణ్  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలంటూ  బీజేపీ నేత అన్నం సతీష్ సంచలన కామెంట్స్ చేశారు. గుంటూరులో ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ లోగా జనసేన పార్టీ తమ బీజేపీలో కలుస్తుందని అన్నం సతీష్ పేర్కొన్నారు. 

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన వస్తుందని ముఖ్యమంత్రి జగన్ ముందునుంచే జాగ్రత్త పడుతున్నాడని ఆయన అన్నారు. తనది ప్రస్తుతం స్టేట్ పార్టీ కాదని... సెంట్రల్ పార్టీ అని పేర్కొన్నారు. ఢిల్లీ నేతలు పవన్ తో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన పేర్కొన్నారు. 

మొన్నటి వరకు టీడీపీ నేతగా ఉన్న అన్నం ప్రభాకర్.. ఇటీవల టీడీపీ ని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. కాగా.. పవన్ తన పార్టీలో బీజేపీలో విలీనం చేస్తారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే... ఆ ప్రచారాన్ని పవన్ తోసి పుచ్చుతూ వస్తున్నారు. కాగా.. తాజాగా అన్నం సతీష్ చేసిన కామెంట్స్... ఈ ప్రచారానికి బరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఏదిఏమైనా ఇప్పుడు అన్నం సతీష్ చేసిన కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ కామెంట్స్ జనసేన అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.