‘‘మీరు సంతోషంగా లేరా? రాత్రుళ్లు నిద్ర పట్టడం లేదా? మీ భార్య మీతో లేదా? మరేమీ బాధపడొద్దు. నాకు ఫోన్ చేయండి. నేనొస్తా. నాపేరు బ్రిష్తీరాయ్. మీరు కూడా రూ.10 వేల నుంచి రూ. 20 వేల వరకు సంపాదించొచ్చు’’ అని బెంగాలీలో ఆ పోస్టర్లను ముద్రించి కోల్‌కతా అంతా అతికించి ప్రచారం జరుగుతోంది. దాంతో నటి  బ్రిష్తీరాయ్ కు చాలా మంది ఫోన్స్ చేస్తున్నారు. ఈ విషయమై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసారు.
 
ఓ ఎస్కార్ట్ సర్వీస్ సంస్థ తనపై దుష్ప్రచారం చేస్తోందంటూ బెంగాలీ టెలివిజన్ నటి బ్రిష్తీరాయ్ పోలీసులకు ఫిర్యాదు  చేయటం సంచలనంగా మారింది. చేసింది. తన ఫొటో, ఫోన్ నంబరు ముద్రించిన పోస్టర్లతో ఎస్కార్ట్ సంస్థ లోకల్ రైళ్లు, రైల్వే స్టేషన్లలో ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తనకు ఫోన్లు వస్తున్నాయని, ఫోన్ చేసిన వారు తన ‘రేటు’ అడుగుతున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. 

వారి నుంచి వస్తున్న ఫోన్లు, వారు ఉపయోగిస్తున్న భాషతో తాను తీవ్ర ఇబ్బందికి గురవుతున్నట్టు బ్రిష్తీరాయ్ ఆవేదన వ్యక్తం చేసింది.  ఈ పోస్టర్లు చూసిన కొందరు బ్రిష్తీరాయ్‌కు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతూ, ‘రేటు’ చెప్పమని గొడవ చేస్తుండడంతో ఆమె సోనాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని అన్నారు. నటి ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్టు ఎస్పీ రషీద్ ఖాన్ తెలిపారు. దర్యాప్తు ప్రారంభించామని, అయితే, ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని తెలిపారు.