గుంటూరు: సాధారణంగా అధికార పార్టీలోకి వలసలు ఉంటాయి. కానీ ఏపీలో మాత్రం సీన్ రివర్స్ అయింది. టీడీపీకి చెందిన కీలక నేతలు బీజేపీ లేదా వైఎస్ఆర్‌సీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ, వైఎస్ఆర్‌సీపీకి చెందిన దొన్ను దొర ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరారు.

బుధవారం నాడు గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో దొన్ను దొర టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో దొన్ను దొరకు వైఎస్ఆర్‌సీపీ టిక్కెట్టు దక్కలేదు. దీంతో ఆయన రెబల్ అభ్యర్ధిగా పోటీ చేశారు. దొన్ను దొర రెండో స్థానంలో నిలిచారు. దొన్ను దొరతో పాటు మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు టీడీపీలో చేరారు.

గిరిజను అభివృద్దికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందని చంద్రబాబునాయుడు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ చేరికపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.