ప్రియుడితో లేచిపోయేందుకు పథకం వేసింది. ఇంట్లో ఎవరూ చూడట్లేదని నిశ్చయించుకొని... ప్రియుడితో పారిపోయేందుకు సిద్ధపడింది. కానీ... ఆ ప్లాన్ ని కుటుంబసభ్యులు పసిగట్టారు. పారిపోతున్న యువతిని పట్టుకున్నారు. రోడ్డు మీదే కర్రలతో దారుణంగా కొట్టుకుంటూ ఇంటిదాకా నడిపించుకుంటూ తీసుకువచ్చారు. ఈ దారుణ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం అలీరాజ్ పూర్ జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కాగా... అలీరాజ్ పూర్ ప్రాంతానికి చెందిన 19ఏళ్ల దళిత యువతి ఇంట్లో వారికి తెలికుండా ఓ యువకుడితో లేచిపోయేందుకు ప్రయత్నించింది. కాగా... ఆమెను కుటుంబసభ్యులు పట్టుకొని కర్రలతో చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఒకరి ఫోన్ నుంచి మరో ఫోన్ కి చేరి చివరకు ఈ వీడియో పోలీసుల కంట పడింది.

కాగా... తనను కొట్టవద్దని బాలిక వేడుకోవడం ఆవీడియోలో స్పష్టంగా కనపడుతోంది. అయితే.. రోడ్డు మీద వెళ్లేవారు కూడా ఆమెకు సహాయం చేయడానికి ముందుకు రాకపోవడం బాధాకరం. అయితే.. ఈ ఘటనపై తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని పోలీసులు చెబుతున్నారు. బాధిత యువతి, ఆమో తండ్రితో మాట్లాడామని.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.