నర్సీపట్నం: మూడేళ్లలో ఎన్నికలు వస్తాయని మాజీ మంత్రి  చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్య లు చేశారు.

బుధవారం నాడు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అయ్యన్నపాత్రుడు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా బైక్ ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. హెల్మెట్లు ఉంటేనే బైక్ ర్యాలీకి అనుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించారు. దీంతో  బైక్‌లను తోసుకొంటూ టీడీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.

ఈ సమయంలో  పోలీసుల తీరుపై అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. పోలీసులు ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేయాలన్నారు. తమ పార్టీ కార్యకర్తలు ఎవరూ కూడ దాడులు, దౌర్జన్యాలకు పాల్పడారని ఆయన చెప్పారు. వారి మాదిరిగా రౌడీలు, గుండాలు తమ పార్టీలో ఎవరూ కూడ లేరని అయ్యన్నపాత్రుడు చెప్పారు.

మూడేళ్లలో ఎన్నికలు వస్తాయి... మీరంతా మా వద్దే పనిచేయాలి... అది గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలని  అయ్యన్నపాత్రుడు పోలీసులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాము అన్యాయంగా ప్రవర్తించడం లేదన్నారు. ఎక్కడైనా హెల్మెట్లు పెట్టుకొని ర్యాలీలు నిర్వహించారా అని ఆయన ప్రశ్నించారు.పోలీసులు తమ తీరును మార్చకోకపోతే పోలీస్‌స్టేషన్ ముందే ధర్నాకు దిగుతానని ఆయన హెచ్చరించారు.    

సంబంధిత వార్తలు

చంద్రబాబుకు షాక్: టీడీపికి అయన్నపాత్రుడి సోదరుడు రాజీనామా

  విశాఖలో టీడీపీకి షాక్...వైసీపీలోకి కీలక నేత?

బాబాయ్ అబ్బాయ్ ల మధ్య లడాయి:మంత్రి అయ్యన్నకు తలనొప్పి