యరపతినేని అక్రమ తవ్వకాలపై సిబిఐ దర్యాప్తు: జగన్ కీలక నిర్ణయం

టీడీపీ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ కు షాక్  కల్గిగించేలా వైఎస్  జగన్ సర్కార్ నిర్ణయం తీసుకొంది. అక్రమ మైనింగ్ పై  జగన్ సర్కార్ సీబీఐ విచారణకు అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకొంది. 

ys jagan decides to give yarapathinenin illict mining case inquiry to cbi

అమరావతి: గురజాల మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత యరపతినేని శ్రీనివాస్‌కు జగన్ సర్కార్ షాకిచ్చింది.అక్రమ మైనింగ్ వ్యవహరంపై సీబీఐ విచారణకు తాము సిద్దమని ఏపీ హైకోర్టుకు జగన్ ప్రభుత్వం బుధవారం నాడు స్పష్టం చేసింది.

గురజాల నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ విషయంలో సీబీఐ విచారణకు హైకోర్టు అనుమతి ఇస్తూ ఈ ఏడాది ఆగష్టు 26వ తేదీన హైకోర్టు తీర్పు చెప్పింది.  ఈ విషయమై సీబీఐ విచారణ అవసరమో కాదో తేల్చుకోవాల్సింది ఏపీ ప్రభుత్వమేనని హైకోర్టు స్పష్టం చేసింది.

ఈ కేసు విషయంలో సీబీఐ విచారణ చేయించేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇదే విషయాన్ని బుధవారం నాడు హైకోర్టుకు నివేదించింది.రాజకీయ వేధింపుల్లో భాగంగానే ఈ కేసును సీబీఐ విచారణకు ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి.

ఏపీలో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత యరపతినేని శ్రీనివాస్ కేసే సీబీఐకు అప్పగించే తొలికేసుగా మారనుంది. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో ఏపీ రాష్ట్రంలోకి సీబీఐకు అనుమతి లేకుండా నిషేధిం విధించారు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఉత్తర్వులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

సీబీఐ విచారణకు హైకోర్టు ఆర్డర్: అజ్ఞాతంలోకి యరపతినేని

యరపతినేనిపై సీబీఐ విచారణకు హైకోర్టు అనుమతి

అక్రమమైనింగ్ కేసులో టీడీపీ నేత యరపతినేనిపై కేసు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios