Asianet News TeluguAsianet News Telugu

'సాహో' ఆ మూడు చోట్లా డిజాస్టర్!

ప్రభాస్ హీరోగా  దాదాపు 350 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో రూపొందిన చిత్రం సాహో.  ఇలాంటి  సినిమాలు కలెక్షన్స్ పరంగా ఒడ్డెక్కాలంటే... ప‌క్కాగా రిలీజ్ డేట్ ప్లానింగ్ ఉండాలి. ముఖ్యంగా లాంగ్ వీకెండ్ ఉంటే చాలా ప్లస్. 

Saaho Disasters in these regions
Author
Hyderabad, First Published Sep 4, 2019, 11:50 AM IST

ప్రభాస్ హీరోగా  దాదాపు 350 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో రూపొందిన చిత్రం సాహో.  ఇలాంటి  సినిమాలు కలెక్షన్స్ పరంగా ఒడ్డెక్కాలంటే... ప‌క్కాగా రిలీజ్ డేట్ ప్లానింగ్ ఉండాలి. ముఖ్యంగా లాంగ్ వీకెండ్ ఉంటే చాలా ప్లస్. సాహో అలాంటి ఫెరఫెక్ట్ ప్లానింగ్‌తోనే వ‌చ్చింది. శుక్ర‌, శ‌ని, ఆది.. ఎలాగూ క‌లిసొచ్చింది. సోమ‌వారం (వినాయ‌క చ‌వితి) సెల‌వు రావ‌డం బోన‌స్‌గా మారింది.  దాంతో తొలి మూడు రోజుల దూకుడు నాలుగో రోజూ చూపించింది సాహో.  అయితే ఈ ప్రభంజనం కొన్ని చోట్లే. వీకెండ్ , వినాయక చవితి  ఏమీ కలిసి రాలేదు. సినిమాని రిలీజ్ రోజే డిజాస్టర్ అని తేల్చేసారు అక్కడి వాళ్లు. 

ఆ ఏరియాల్లో తమిళనాడు మొదటి ప్లేస్ లో ఉంది. తమిళ వెర్షన్ ఇప్పటికే డిజాస్టర్ అనిపించుకుంది. తమిళ వాళ్లకు అసలు నచ్చలేదు. దాంతో రిలీజ్ రోజు నుంచి కలెక్షన్స్ చెప్పుకోదగ్గ రీతిలో లేవు. ఇక మళయాళ వెర్షన్ విషయానికి వస్తే..అక్కడ పరిస్దితి మరీ దారుణంగా ఉంది. సాహోని రిసీవ్ చేసుకోలేదు అక్కడి వాళ్లు. ఫస్ట్ వీకెండ్ కే ఆ పరిస్దితి కనపడింది. 

ఇవన్నీ ప్రక్కన పెడితే...అమెరికాలో అతి తక్కువ కలెక్షన్స్ నమోదు అయ్యాయి. రన్ పూర్తయేయ్సరికి మూడు మిలియన్ డాలర్ల కన్నా తక్కువ వసూలు అవుతుందని లెక్కేస్తున్నారు. అక్కడ డిస్ట్రిబ్యూటర్ కు ఇది డిజాస్టర్. అయితే వచ్చే వారం ఏమైనా పికప్ అయ్యితే చెప్పలేం కానీ ఈ మూడు చోట్ల కూడా కొనుక్కున్న వాళ్లకు పూర్తిగా నష్టం అని తేలింది.

మరో ప్రక్క అన్ని చోట్లా మంగ‌ళ‌వారం ఈ సినిమా వ‌సూళ్లు డ్రాప్ అయ్యాయి. అయితే వ‌చ్చే వారం కూడా పెద్ద సినిమాలేవీ లేక‌పోవ‌డం సాహోకి క‌లిసొచ్చే అవకాసం ఉంది. ఈ వీకెండ్‌ని కూడా సాహో క్యాష్ చేసుకుంటే.. ఆర్థికంగానూ సాహో గ‌ట్టెక్కేసిన‌ట్టే.

Follow Us:
Download App:
  • android
  • ios