సారాంశం

ఏపీ కేబినెట్ బుధవారం నాడు కీలక నిర్ణయాలను తీసుకొంది. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు వీలుగా కేబినెట్ ఆమోదం తెలిపింది.


అమరావతి:  పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్‌ పనులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. పనుల నిర్వహణకుగాను కాంట్రాక్టర్లకు ఇచ్చిన అడ్వాన్స్‌లను రికవరీ చేయాలని  ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకొంది.

బుధవారం  నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది.ఈ  సమావేశంలో కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న కాలంలో  పోలవరం హైడల్ ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ. 3216.11 కోట్లతో నవయుగ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చారు.

 ఇప్పటికే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రివర్స్  టెండర్లను ప్రభుత్వం పిలిచింది.ఈ విషయమై నవయుగ కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు నవయుగ కంపెనీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ విషయమై హైకోర్టు డివిజన్ బెంచ్ కు ఏపీ ప్రభుత్వం వెళ్లింది.

ఆశా వర్కర్ల వేతనాన్ని రూ. 3 వేల నుండి రూ. 10 వేలకు పెంచుతూ  నిర్ణయం తీసుకొన్నారు.ఈ నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. బందరు పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించిన  412 ఎకరాల భూమిని వెనక్కీ తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.ఈ నిర్ణయానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.