కడప:మాజీ మంత్రి  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడు శ్రీనివాసులు రెడ్డి ఆత్మహత్య ఘటనతో ఏపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఏపీ డీజీపీ బుధవారం నాడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. మరో వైపు శ్రీనివాసులు రెడ్డి సూసైడ్ కంటే ముందు చోటుచేసుకొన్న పరిణామాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

కడప జిల్లా సింహద్రిపురం మండలం కనునూరు గ్రామానికి చెందిన  శ్రీనివాసులు రెడ్డి మంగళవారం నాడు ఆత్మహత్య చేసుకొన్నాడు. వైఎస్ వివేకానందరెడ్డి ఆత్మహత్య కేసులో శ్రీనివాసులు రెడ్డిని  పోలీసులు విచారించారు. 

ఆత్మహత్య చేసుకొనే ముందు శ్రీనివాసులు రెడ్డి మూడు లేఖలు రాశాడు. ఈ లేఖల్లో చేతిరాతలపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  రెండు రకాల చేతి రాతలు ఉన్నట్టుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు  ఆత్మహత్య చేసుకొనేముందు శ్రీనివాసులు రెడ్డి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి మాట్లాడినట్టుగా సమాచారం.  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని కుటుంబసభ్యులకు ఫోన్ చేసి చెప్పారని  సమాచారం.

తన భర్త  ఆత్మహత్యకు సంబంధించిన కేసులో వాస్తవాలను తేల్చాలని శ్రీనివాసులు రెడ్డి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు మేరకు కడప వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

శ్రీనివాస్ రెడ్డి రాసిన లేఖలను పోలీసులు పోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఆత్మహత్య చేసుకొనే ముందు శ్రీనివాసులు రెడ్డి ఎవరెవరితో ఫోన్‌లో మాట్లాడారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. శ్రీనివాసులురెడ్డి ఆత్మహత్య చేసుకొనే సమయంలో పరమేశ్వర్ రెడ్డి ఎక్కడ ఉన్నాడనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


సంబంధిత వార్తలు

వైఎస్ వివేకా హత్య కేసు నిందితుడి ఆత్మహత్య: ఉత్పన్నమవుతున్న ప్రశ్నలివీ...

వైఎస్ వివేకా హత్య: శ్రీనివాస్ రెడ్డి సూసైడ్, పోలీసుల అనుమానాలివి

వైఎస్ వివేకానందరెడ్డి హత్య: అనుమానితుడు శ్రీనివాస్ రెడ్డి సూసైడ్