విశాఖపట్టణం: విశాఖపట్టణంలో టీడీపీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సోదరుడు సన్యాసిపాత్రుడు టీడీపీకి రాజీనామా చేశారు.ఆయన వైఎస్ఆర్‌సీపీలో చేరే అవకాశం ఉంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అయ్యన్నపాత్రుడు జన్మదిన వేడుకల్లో ఉన్న సమయంలోనే సన్యాసిపాత్రుడు టీడీపీకి రాజీనామా చేశారు.

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందే సన్యాసిపాత్రుడు, అయ్యన్నపాత్రుడు మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఆ సమయంలో టీడీపీ నాయకత్వం వీరిద్దరి మధ్య నెలకొన్న విభేదాలకు పుల్‌స్టాప్ పెట్టింది.

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ ఘోరంగా పరాజయం పాలైంది. టీడీపీకి చెందిన  కీలక నేతలు బీజేపీ, వైఎస్ఆర్‌సీపీ వైపు చూస్తున్నారు. ఇందులో భాగంగానే  సన్యాసిపాత్రుడు కూడ వైఎస్ఆర్‌సీపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు.

బుధవారం నాడు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పుట్టినరోజు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని  నర్సీపట్నం నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాల్గొన్నారు.

ఈ సమావేశం సాగుతున్న సమయంలోనే సన్యాసిపాత్రుడు టీడీపీకి రాజీనామాను ప్రకటించారు. సన్యాసిపాత్రుడుతో పాటు మరో 10 మంది స్థానిక నేతలు కూడ టీడీపీకి రాజీనామాలు సమర్పించారు.

సంబంధిత వార్తలు

విశాఖలో టీడీపీకి షాక్...వైసీపీలోకి కీలక నేత?

బాబాయ్ అబ్బాయ్ ల మధ్య లడాయి:మంత్రి అయ్యన్నకు తలనొప్పి