బాబుకు హైకోర్టులో ఊరట: మరిన్ని వార్తలు

By rajesh yFirst Published Aug 14, 2019, 5:43 PM IST
Highlights

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.

ప్రమాదంలో మాజీ సీఎం చంద్రబాబు నివాసం.. పరిశీలించిన ఆర్కే

ప్రకాశం బ్యారేజీ కృష్ణా నది పరీవాహక ప్రాంతంలోనే చంద్రబాబు నివాసం ఉంది. ప్రకాశం బ్యారేజీ బ్యాక్ వాటర్స్ సమీపంలో ఆయన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా సుమారు నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు అదే నివాసం ఉన్నారు. 

 

జగన్ వస్తే వేధింపులు ఆగుతాయనుకున్నా.. కానీ: నా వల్ల కాదు చచ్చిపోతున్నా

ఇటికేపల్లికి చెందిన నాగేంద్రబాబు ఎన్ఆర్ఎస్ ట్రాన్స్‌పోర్టు కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తన యజమాని దగ్గర రూ.65 వేలు అప్పుగా తీసుకున్నాడు. కొద్దిరోజుల నుంచి బాకీ తీర్చాలని యజమాని వద్ద నుంచి వేధింపులు ఎక్కువకావడంతో వాటిని భరించలేకపోయాడు. ఈ నేపథ్యంలో తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు

 

పాత పద్ధతులకు స్వస్థి: కమిటీల్లో చంద్రబాబు మార్పులు

పార్టీ కమిటీల్లో మార్పులు చేర్పులకు చంద్రబాబునాయుడు శ్రీకారం చుట్టనున్నారు. పార్లమెంటరీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించనున్నారు.

 

ఎమ్మెల్యే రోజా చేతి వంటలకు కేసీఆర్ ఫిదా

రోజా తయారు చేసిన వంటలను తెలంగాణ సీఎం కేసీఆర్ మెచ్చుకొన్నారు. రెండు రోజుల క్రితం కేసీఆర్ కు రోజా తన ఇంట్లో ఆతిథ్యం ఇచ్చారు.

 

సీఎం, మంత్రులకు మమ్మల్ని తిట్టడమే పని.. జగన్ ప్రభుత్వంపై దేవినేని విమర్శలు

వైఎస్ హెలికాప్టర్ కనిపించకుండా పోయిన సమయంలోనే పోలవరం పవర్ ప్రాజెక్టు కోసం జగన్ చేరసారాలు చేశారని ఈ సందర్భంగా దేవినేని గుర్తు చేశారు.  జగన్ బంధువు పీటర్ ఇచ్చిన తప్పుడు నివేధికలతో మేధావులు, నిపుణుల నిర్ణయాలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

 

రంజాన్ రోజు మాటిచ్చారు, బక్రీద్ రోజున పదవి: జగన్‌పై ఇక్బాల్ ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న శాసనమండలి ఉప ఎన్నికకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నుంచి అభ్యర్ధులుగా ఖరారైన మోపిదేవి వెంకటరమణ, ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డిలు బుధవారం అమరావతిలో ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి నానినేషన్ పత్రాలు సమర్పించారు. 

 

కన్న కూతురిపై అత్యాచారం... తండ్రికి జీవిత ఖైదు

బాషా మద్యం సేవించి మైనర్‌ అయిన తన కుమార్తెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బయట చెప్పొద్దని ఆమెను బెదిరించాడు. తరచూ ఆమెపై లైంగికదాడికి పాల్పడేవాడు.

 

ఎల్ బ్రూస్ పర్వతం అధిరోహించిన ఆశా కి పవన్ అభినందనలు

గత ఏడాది ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తయిన కిలిమంజారో అధిరోహించిన ఆశా.. ఇప్పుడు నల్ల సముద్రం, కాస్పియస్ సముద్రానికి మధ్య ఉన్న ఎల్ బ్రూస్ పర్వతాన్ని తన బృందం సహాయంతో అధిరోహించడం ఆనందంగా ఉందని అన్నారు. 

 


ఎన్నో ఒత్తిళ్లు ఉన్నాయి, వాటికి తలొగ్గను: సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

తనపై కూడా ఎన్నో ఒత్తిళ్లు ఉన్నాయని చెప్పుకొచ్చిన సీఎం జగన్ అయినా ఎట్టి పరిస్థితుల్లో వాటికి తలొగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రివర్స్ టెండరింగ్ విషయంలో వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘానికి ఆదేశించారు. 

 

వైఎస్ జగన్ కు జపాన్ కరెంట్ షాక్

పీపీఏల రద్దు విషయంలో జగన్ సర్కార్ కు మరో షాక్ తగిలింది. ఈ నిర్ణయాన్ని జపాన్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ మేరకు జపాన్ ప్రభుత్వం  ఏపీకి లేఖ రాసింది.

 

చంద్రబాబు భద్రతపై హైకోర్టు తీర్పు: 5ప్లస్ 2భద్రతకు గ్రీన్ సిగ్నల్

చంద్రబాబు భద్రతకు సంబంధిందించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం మేరకు ఒక సీఎస్ వోనే కొనసాగించాలని ఆదేశించింది. కాన్వాయ్ లో జామర్ ఇవ్వాలని కూడా ఆదేశించింది. క్లోజ్ ప్రొటెక్షన్ టీం విధులు ఎవరు నిర్వహించాలనే అంశంలో ఎన్ఎస్ జీ, ఐఎస్ డబ్ల్యూ కలిసి చర్చించుకోవాలని తెలిపింది. చంద్రబాబు భద్రత అంశంపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకుని చంద్రబాబుకు 5ప్లస్ టూ భద్రత ఇవ్వాలని తెలిపింది.   

 

వరద ప్రమాదంలో మాజీ సీఎం నివాసం.. స్పందించిన దేవినేని

చాలా మంది పేదలు ఉన్నారని మరిచి పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఇంటి మెట్లను వరద నీరు ఎక్కించేందుకు ప్రకాశం బ్యారేజీ నీటి నిర్వహణను పక్కన పెడుతున్నారని దేవినేని విమర్శించారు.

 

రాజకీయాల్లో జవాబుదారీతనం సిద్ధించనప్పుడే నిజమైన స్వాతంత్య్రం: పవన్ కళ్యాణ్

ఎందరో పోరాటయోధుల త్యాగఫలితమే నేడు దేశ ప్రజలు అనుభవిస్తున్నస్వేచ్ఛకు కారణమని తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆ త్యాగధనులకు అంజలి ఘటించి... వారి అడుగుజాడల్లో నడవాలని సూచించారు. 

 

కాంగ్రెస్‌కు షాక్: బీజేపీలోకి విజయశాంతి?

కాంగ్రెస్ తో పాటు పలు పార్టీలకు చెందిన కీలక నేతలు బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొన్నారు. సినీ నటి విజయశాంతి కూడ బీజేపీలో చేరే అవకాశాలున్నాయి.

 

వనస్థలిపురం ఏటీఎం చోరీ కేసు: రాంజీ గ్యాంగ్‌ను పట్టుకున్న పోలీసులు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన వనస్థలిపురం ఏటీఎం చోరీ కేసును హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. ఆరుగురు సభ్యుల రాంజీ గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌వోటీ, ఈపీఎస్‌ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌ నిర్వహించి రాంజీ గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు. 

 

భగవద్గీత ఉర్దూ అనువాద కర్త హసనుద్దీన్ కన్నుమూత

హసనుద్దీన్... ఐఏఎస్ అధికారిగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందారు. ఆయన నిజాం కుటుంబానికి చెందినవాడు కావడం గమనార్హం. హసనుద్దీన్ తండ్రి నిజాం రాజుగా పరిపాలించారు.  నిజాం పాలనలో హసనుద్దీన్ 1945లో మతపర విభాగానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు.

 

వనస్థలిపురం ఏటీఎం చోరీ: ముఠా అరెస్ట్

వనస్థలిపురంలో ఏటీఎం చోరీ ముఠా సభ్యుల నుండి రికవరీ చేసిన డబ్బును పరిశీలిస్తున్న మహేష్ భగవత్, సుధీర్ బాబు
 

జగన్ పాలనపై కోమటిరెడ్డి ప్రశంసలు: పార్టీ మార్పుపై వెనక్కితగ్గని రాజగోపాల్ రెడ్డి

జమ్ముకశ్మీర్‌ విభజన, ఆర్టికల్ 370,ఆర్టికల్ 35ఏ రద్దు వంటి అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయానికి దేశ ప్రజలంతా హర్షిస్తున్నట్లు తెలిపారు. మోదీ, అమిత్‌ షా నేతృత్వంలో భారత్‌ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని తెలిపారు. 
 

తెలంగాణలో చంద్రబాబుకు భారీ షాక్: బీజేపీలోకి క్యూ కట్టిన నేతలు

పలువురు టీడీపీ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ నెల 18వ తేదీన అమిత్ షా సమక్షంలో వీరంతా బీజేపీలో చేరనున్నారు.

 

నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను.. హీరోయిన్ కామెంట్స్!

ప్రస్తుతం వరలక్ష్మీ హీరోయిన్ గా 'కన్నిరాశి' అనే సినిమాలో నటిస్తోంది. విమల్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాను ముత్తుకుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. 

 

'సాహో'.. రిలీజ్ కి ముందే రూ.300 కోట్లు!

'సాహో'..  సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ రూ.330 కోట్లకు పైగా జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ.125 కోట్లు పలికినట్లు తెలుస్తోంది. దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలు మొత్తం కలిపి రూ.46 కోట్లు పలకగా.. హిందీ వెర్షన్ రూ.120 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం.

 

ప్రముఖ సింగర్ పై ఇండస్ట్రీ బ్యాన్!

పాకిస్థాన్ కి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త ఇంట్లో జరిగిన పార్టీలో పాల్గొన్న ప్రముఖ సింగర్ మికా సింగ్ పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరాచీలో షో చేసిన ఆయనపై తాజాగా బ్యాన్ విధిస్తూ ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. 

 

రాజమౌళి సలహాతో 'సాహో' లో అవి లేపేసారు!

ఇండియాలో నెంబర్ వన్ డైరక్టర్స్ లో ఒకరుగా వెలుగుతున్న రాజమౌళితో ప్రభాస్ ఆల్రెడీ ఛత్రపతి, బాహబలి సినిమాలు చేసి ఉన్నాడు. దాంతో వాళ్లిద్దరి మధ్యా మంచి అండర్ స్టాండింగ్ ఉంది. మొదట వేరే డైరక్టర్ సినిమా విషయంలో తను సలహా ఇవ్వటం బాగోదన్న రాజమౌళి..సుజీత్ కూడా కలిసి రిక్వెస్ట్ చేయటంతో చూసి కీలకమైన సూచన చేసారట.

 

రవి ముట్టుకుంటే ఓకేనా శ్రీముఖి..? ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు!

బిగ్ బాస్ హౌస్ లో ఫిజికల్ టాస్క్ లు మగాళ్లకు, ఆడవాళ్లకు కలిపే పెడతారనే విషయం శ్రీముఖికి తెలియదా..? ఎవరూ టచ్ చేయకూడదని రూల్స్ పెట్టుకున్న ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చినట్లు అంటూ ప్రశ్నిస్తున్నారు. 

 

సైరా: రజినీకాంత్ ని రిక్వెస్ట్ చేస్తున్నరామ్ చరణ్

మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి రిలీజ్ డేట్ దగ్గరపడుతోంది. అఫీషియల్ గా చెప్పకపోయినా అక్టోబర్ 2ని ఫైనల్ చేసినట్లు సమాచారం. ఇక సినిమా ట్రైలర్ ని రెడీ చేసి వీలైనంత త్వరగా విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ డిసైడ్ అయ్యింది. 

 

'సైరా'లో పవన్ కళ్యాణ్.. సంథింగ్ స్పెషల్.. వైరల్ అవుతున్న ఫోటో!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ తిరిగి సినిమాల్లోకి రావాలనే డిమాండ్ వినిపించింది. మరికొందరు పవన్ రాజకీయాల్లోనే కొనసాగాలని కోరుకున్నారు. 
 

 

400 మందికి స్టార్ హీరో సర్ ప్రైజ్.. గిఫ్ట్ గా గోల్డ్ రింగ్స్!

ఇళయదళపతి విజయ్ తమిళంలో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. విజయ్ కి రజని స్థాయిలో అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. వరుస విజయాలతో విజయ్ దూసుకుపోతున్నాడు. అతడి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల బిజినెస్ చేస్తున్నాయి. విజయ్ చేస్తున్న చిత్రాల్లో ఎక్కువగా రాజకీయ, సామజిక పరమైన అంశాలు ఉంటున్నాయి.

 

మన్మథుడు2: బూస్ట్ ఇస్తాడనుకుంటే షాక్ ఇచ్చాడు

వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ లో ఊహించని విధంగా మరొకసారి వరుసగా అపజయాలను ఎదుర్కొంటోంది.ధృవ తరువాత అంతా సెట్టయ్యింది అనుకుంటున్న సమయంలో బేబీకి వచ్చిన డ్రీమ్ ప్రాజెక్ట్స్ నిండా ముంచేశాయి. 

 

క్లీవేజ్ షోతో రచ్చ చేస్తోన్న తాప్సీ పన్ను!

తాజాగా ఎలి అనే మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ లో పాల్గొంది తాప్సీ. ఈ ఫోటోలను ఆగస్ట్ సంచికలో ప్రచురించారు. ఫోటోషూట్ తో పాటు స్పెషల్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది. ఫోటోషూట్ మారిషస్ లోని ఎల్ ఇంపీరియల్ రిసార్ట్ అండ్ స్పాలో జరిగిందని తెలుస్తోంది.

 

కోట్ల సంపాదనపై పోర్న్ స్టార్ షాకింగ్ కామెంట్స్!

కెరీర్ ఆరంభంలో నీలి చిత్రాల్లో నటించిన మియా ఖలీఫా ప్రస్తుతం స్పోర్ట్స్ కామెంటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన గతం గురించి.. నీలి చిత్రాల్లో నటించినప్పటి తన పాత జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

 

బాలయ్య పక్కన బికినిలో హీరోయిన్.. రెమ్యునరేషన్ పిండేసిందిగా!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి రూలర్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. జై సింహా తర్వాత బాలయ్య, సి కళ్యాణ్, రవికుమార్ కలయికలో వస్తున్న చిత్రం ఇది. ఎన్టీఆర్ బయోపిక్ డిజాస్టర్ తర్వాత బాలయ్య కమర్షియల్ చిత్రానికి ఓకే చెప్పారు. బోయపాటిని పక్కన పెట్టి మరీ బాలయ్య ఈ ప్రాజెక్ట్ ని ఎంచుకున్నారు. 

 

 

click me!