Asianet News TeluguAsianet News Telugu

వరద ప్రమాదంలో మాజీ సీఎం నివాసం.. స్పందించిన దేవినేని

చాలా మంది పేదలు ఉన్నారని మరిచి పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఇంటి మెట్లను వరద నీరు ఎక్కించేందుకు ప్రకాశం బ్యారేజీ నీటి నిర్వహణను పక్కన పెడుతున్నారని దేవినేని విమర్శించారు.

ex minister devineni uma response over flood situation at chandrababu house
Author
Hyderabad, First Published Aug 14, 2019, 4:34 PM IST

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్దకు వరద నీరు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వరద నీటి వల్ల చంద్రబాబు నివాసానికి ప్రమాదం ఉందని అధికారులు  చెబతున్నారు. ఇప్పటికే వరద ముంపు ప్రాంతాన్ని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సందర్శించారు. కాగా... ఈ విషయంపై తాజాగా మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా స్పందించారు.

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నివాసంలోకి వరద నీరు వచ్చిందని వైసీపీ నేతలు సంబరపడుతున్నారని టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. కానీ అక్కడ చాలా మంది పేదలు ఉన్నారని మరిచి పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఇంటి మెట్లను వరద నీరు ఎక్కించేందుకు ప్రకాశం బ్యారేజీ నీటి నిర్వహణను పక్కన పెడుతున్నారని దేవినేని విమర్శించారు.

ఇదిలా ఉండగా... కృష్ణా నదిపై నిర్మించిన పులిచింతల ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తివేయడంతో వరద నీరు పోటెత్తుతోంది. ఆ నీరంతా దిగువకు ప్రవహిస్తోంది. వరద ప్రవాహం మరింత పెరిగితే చంద్రబాబు నివాసానికి మప్పు తప్పదని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. శ్రీశైలం నుంచి పులిచింతల దాకా కృష్ణానదిపై నిర్మించిన భారీ నీటి పారుదల ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్న నేపథ్యంలో నీటికి దిగువకు వదులుతున్నారు.

ప్రకాశం బ్యారేజీ కృష్ణా నది పరీవాహక ప్రాంతంలోనే చంద్రబాబు నివాసం ఉంది. ప్రకాశం బ్యారేజీ బ్యాక్ వాటర్స్ సమీపంలో ఆయన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిగా సుమారు నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు అదే నివాసం ఉన్నారు. భారతీయ జనతాపార్టీ నేత, లోక్ సభ మాజీ సభ్యుడు గోకరాజు రంగరాజుకు సంబంధించిన అతిథిగృహం అది. కృష్ణా నది బఫర్ జోన్ పరిధిలో దాన్ని నిర్మించిన విషయం తెలిసిందే.

కాగా... ఇప్పుడు ఈ వరద కారణంగా మాజీ  సీఎం నివాసానికి ముప్పు ఉందన్న వార్తలు వస్తున్న క్రమంలో ఆ ప్రాంతాన్ని బుధవారం ఉదయం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ పరిశీలించారు.

read more news 

చంద్రబాబుని కాపాడుకోవాల్సిన బాధ్యత మాది... ఎమ్మెల్యే ఆళ్ల

ప్రమాదంలో మాజీ సీఎం చంద్రబాబు నివాసం.. పరిశీలించిన ఆర్కే

Follow Us:
Download App:
  • android
  • ios